మాజీ మంత్రి నారా లోకేష్ ని, ఈ రోజు పోలీసులు అరెస్ట్ చేసారు. ముందుగా లోకేష్ గద్దె రామ్మోహన్ చేసిన దీక్ష వద్దకు వెళ్లి, తిరిగి వస్తూ ఉండగా, బెంజ్ సర్కిల్ దగ్గర పోలీసులు అడ్డుకున్నారు. నేను గుంటూరు పార్టీ ఆఫీస్ కి వెళ్తున్నాను అని చెప్పగా, పోలీసులు అటు వెళ్ళటానికి వీలు లేదని చెప్పారు. అయితే తాను ఉండవల్లిలో ఉన్న తన నివాసానికి వెళ్ళిపోతానని చెప్పగా, అటు కూడా వెళ్ళటానికి వీలు లేదని పోలీసులు చెప్పారు. మిమ్మల్ని ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా అరెస్ట్ చేస్తున్నామని చెప్పగా, ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో చెప్పాలని లోకేష్ కోరారు. అయినా పోలీసులు వినిపించుకోకుండా, లోకేష్ ని అదుపులోకి తీసుకున్నారు. లోకేష్ తో పాటుగా, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర, అలాగే ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు కూడా ఉన్నారు. వీరిని కూడా పోలీసులు అరెస్ట్ చేసారు. అయితే వీరిని ఎటు వైపు తీసుకు వెళ్తున్నారో ఎవరికీ అర్ధం కాలేదు. యనమలకుదురు కట్ట మీదుగా, తరలిస్తూ ఉండటంతో, యనమలకుదురు పోలీస్ స్టేషన్ కు వెళ్తున్నారని అందరూ అనుకున్నారు.

totlavallauru 07012020 2

అయితే, అక్కడ కూడా ఆగకుండా పోలీసులు ముందుకు వెళ్ళటంతో, అవనిగడ్డ తీసుకు వెళ్తున్నారని అందరూ అనుకున్నారు. అయితే, మధ్యలోనే తోట్లవల్లూరు పోలీస్ స్టేషన్ కు, లోకేష్ తో పాటుగా, రవీంద్రని, రామానాయుడుని తరలించారు. లోకేష్ ని అరెస్ట్ చేసారని తెలుసుకుని, చుట్టు పక్కల గ్రామాల ప్రజలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకున్నారు. జగన్ మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేసారు. ఇదే సందర్భంలో, వైవీబీ, అనురాధ వచ్చి, స్టేషన్ ముందు ధర్నా చేసారు. దాదపుగా నాలుగు గంటల పాటు, వీరిని పోలీస్ స్టేషన్ లో నే ఉంచారు. మరో పక్క, చుట్టు పక్కల మొత్తం, పల్లెటూరులు కావటంతో, ప్రజలు గంటగంటకు పెరిగి పోతూ ఉండటంతో, అక్కడ పరిస్థితి అదుపు తప్పే పరిస్థితి వచ్చింది.

totlavallauru 07012020 3

ఇదే సందర్భంలో, పామర్రు ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ అటు వైపు రావటంతో, ఒక్కసారిగా పరిస్థితి వేడెక్కింది. ట్రాఫిక్, క్లియర్ చేసి రాక పొకలకు, ఇబ్బంది లేకుండా చూడాలని, పోలీస్ లను పామర్రు ఎమ్మెల్యే అనిల్ ఆదేశించారు. అయితే ఇక్కడ ఉద్రిక్త పరిస్థితి ఉన్న సమయంలో, ఎమ్మెల్యే కావాలనే వచ్చి ఇక్కడ రెచ్చగొడుతున్నారు అంటూ, టిడిపి కార్యకర్తలు నినాదాలు చేసారు. రోడ్డుపై ట్రాక్టర్ టైర్ తగులు పెట్టి, జగన్ మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేసారు. దీంతో ఎమ్మెల్యేతో పాటు వచ్చిన అనుచరులు, అడ్డుకోబోతో, వైసిపి కార్యకర్తలకు, టిడిపి కార్యకర్తలకు మధ్య బాహా బాహీ జరిగింది. దీంతో పోలీసులు లాఠీ చార్జి చేసారు. తరువాత పోలీసులు ఎమ్మేల్యేను పంపించేసి, తొట్ల వల్లూరు పోలీస్ స్టేషన్ నుండి నారా లోకేష్,టిడిపి నాయకులు విడుదల చేసారు. ఎమ్మల్యేలను పంపించి, కావలని వైసీపీ గొడవలకు ప్లాన్ చేస్తుందని, టిటిపి ఆరోపిస్తుంది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read