ఈ రోజు అసెంబ్లీ గేటు బయట చంద్రబాబుకి తీవ్ర అవమానం జరిగింది. 40 ఏళ్ళు సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తీ, 13 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే రికార్డు ఉన్న వ్యక్తీ, 10 ఏళ్ళు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న వ్యక్తీ, జాతీయ స్థాయిలో గుర్తింపు ఉన్న మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని, అసెంబ్లీ లోపలకు వెళ్ళనివ్వకుండా, గేటు వేసి, అవమాన పరిచారు. అయితే ఈ విషయం పై ఈ రోజు అసెంబ్లీలో తెలుగుదేశం పార్టీ లేవనెత్తిన సమయంలో, చంద్రబాబు, జగన్ ని ఉన్మాది అన్నారు అంటూ, ఒక వీడియో అసెంబ్లీలో అధికార పక్షం ప్లే చేసింది. అయితే ఇది చూసిన అందరూ, తప్పు తెలుగుదేశం పార్టీదే అని, రాజకీయం చేస్తున్నారాని అనుకున్నారు. కాని, ఇప్పుడు తెలుగుదేశం పార్టీ విడుదల చేసిన వీడియో చూస్తే, చంద్రబాబుని ఎలా అవమానించారో చూడవచ్చు. చంద్రబాబుని మాత్రమే కాదు, మిగతా శాసనసభ్యులను, శాసనమండలి సభ్యులను, మాజీ మంత్రులుగా పని చేసిన వారిని కూడా ఇలాగే అవమానించారు.
అసలు జరిగిన విషయం ఏమిటి అంటే, శాసనసభలో మీడియాపై ఆంక్షల సంకెళ్ళకు నిరసనగా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్లేలు,ఎమ్మెల్సీలు బృందం గురువారం నోటికి నల్ల రిబ్బన్లు కట్టుకుని నల్ల ప్ల కార్డులతో ర్యాలీ నిర్వహించారు. ఈ సమయంలో, నిరసన తరువాత అసెంబ్లీకి వస్తున్న వారిని చీఫ్ మార్షల్ ఆపేసారు. బ్యానర్లు, ప్లేకార్డులు వద్దు అంటే ఇచ్చేసారు. చివరకు నల్ల రిబ్బన్ కట్టుకుంటే, అది కూడా తీసేసుకున్నారు. చివరకు చేతిలో పేపర్లు కూడా తీసుకుంటున్న సమయంలో, చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేసారు. దీంతో చాలా సేపు చంద్రబాబుతో పాటు, ఇతర నేతలను లోపలకు విడుదల చెయ్యలేదు. పేపర్స్ కూడా ఇవ్వాలి అంటూ, చీఫ్ మార్షల్ అనటంతో, స్వల్ప తోపులాటి జరిగింది.
దీంతో, అసెంబ్లీ గేటువద్ద చంద్రబాబును 40 నిముషాలు నిలిపేయడం, మార్షల్స్ దురుసు ప్రవర్తన పై ధ్వజమెత్తారు. అయితే అసెంబ్లీలో ప్రభుత్వం చూపించిన వీడియోకి, తెలుగుదేశం చూపించిన వీడియోకు, ఎంతో తేడా ఉంది. ఇదే విషయం పై నారా లోకేష్ ట్విట్టర్ లో స్పందించారు. "ప్రజా సమస్యల పై ప్రతిపక్షాలు నోరెత్తకూడదు అన్నట్టు ఉంది జగన్ గారి వ్యవహార శైలి. జగన్ గారు ప్రతిపక్షంలో ఉండగా ఎన్నోసార్లు అసెంబ్లీలో నిరసన తెలిపారు. అప్పట్లో వారికి ఉన్న హక్కు, ఇప్పటి ప్రతిపక్షమైన తెదేపాకు ఎందుకు ఉండదు? సభలో ప్రజా సమస్యల పై నిరసన తెలిపే మా హక్కులు హరించే అధికారం జగన్ గారికి ఎవరిచ్చారు? ప్రతిపక్షాలకు శాసనసభలో నిరసన తెలిపే హక్కు లేదని ఏ చట్టం చెబుతుంది?" అంటూ పోస్ట్ చేసారు. ఈ పూర్తీ వీడియో ఇక్కడ చూడవచ్చు. https://www.facebook.com/VoteforTDP/videos/842394799526188/