ఎన్నికల ముందు వరకు, అటు కేసీఆర్ కి, ఇటు జగన్ కు, అలాగే పైన ఉన్న బీజేపీకి, ఉమ్మడి టార్గెట్ చంద్రబాబు. అందుకే అందరూ లోపాయకారీ ఒప్పందం కుదుర్చుకుని, వాళ్ళు అనుకున్నది సాధించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏమైనా పరవాలేదు, మాకు రాజకీయం ముఖ్యం అనుకుని సాధించారు. అయితే ఎన్నికల ముందు ఉన్న స్నేహం, ఇప్పుడు ఈ మూడు పార్టీలకు లేదు. ఎన్నికల తరువాత, అటు తెలంగాణాలో బీజేపీకి నాలుగు ఎంపీ స్థానాలు రావటంతో, బీజేపీ తమకు ఎర్త్ పెడుతుందని, కేసీఆర్ గ్రహించారు. అలాగే ఎన్నికల ముందు, కేసీఆర్ - జగన్, కన్న కలలు వేరుగా ఉన్నాయి. కేంద్రంలో బీజేపీ రావటం కష్టమని, ప్రాంతీయ పార్టీలదే హవా అంటూ, ఎన్నికల ముందే తమిళనాడులో డీఎంకే అధినేత స్టాలిన్, తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీతో చర్చలు జరిపారని, ఇద్దరం జట్టుగా ఉండి, బీజేపీని వదిలించుకుందామని, వేసిన ఎత్తులు, బీజేపీ అధిష్టానానికి తెలియటంతో, ఎన్నికల తరువాత నుంచే, ఇద్దరినీ పక్కన పెట్టటం మొదలు పెట్టరు.
మోడీ మళ్ళీ సంపూర్ణ మెజారిటీతో అధికారంలోకి రావటంతో, విధేయత నటిస్తూ వస్తున్నారు. కాని బీజేపీ ఏ చిన్న సూచన ఇచ్చినా, జగన్ మాత్రం పట్టించుకోవటం లేదు అనేది కూడా బీజేపీ ఆగ్రహానికి గురి చేసింది. పీపీఏల విషయంలో కాని, పోలవరంలో రివర్స్ టెండరింగ్ లో కాని, ఎక్కడా జగన్ తమ చెప్పిన మాట వినటం లేదని, కాని విన్నట్టే నటిస్తూ, వినయం నటిస్తున్నారని, బీజేపీ అధిష్టానం గ్రహించింది. అదీ కాక, రాష్ట్రంలో విపరీతంగా పెరిగిపోతున్న మత మార్పిడులు పై కూడా బీజేపీ ఆగ్రహంగా ఉందని చెప్తున్నారు. అందుకే అమిత్ షా, ఎప్పటికప్పుడు జగన్ ని దగ్గరకు రానివ్వటం లేదని తెలుస్తుంది. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ నుంచి ఢిల్లీ వెళ్ళినా, ఒకటికి రెండు సార్లు వెయిట్ చేపించి, వెనక్కు పంపించి వేస్తున్నారు అంటే, అదే జగన్ కు ఎంతో అవమానం. అదీ కాక, సామాన్య ఎంపీలకు, అదే సమయంలో అపాయింట్మెంట్ ఇస్తున్నారు.
అయితే తాజాగా, మరో సంఘటన కూడా బీజేపీ అధిష్టానికి ఆగ్రహం తెప్పించిందని, ఈ రోజు ఒక ప్రాముఖ పత్రికలో వార్తా కధనం వచ్చింది. జార్ఖండ్‌లో జేఎంఎం-కాంగ్రెస్ కూటమికి జగన్ ఆర్థిక సహాయం చేస్తున్నారనే, సమాచారం బీజేపీ వద్ద ఉందని, ఆ కధనం సారంశం. దేశంలో అన్ని ప్రాంతీయ పార్టీలను మచ్చిక చేసుకుని, పరపతి పెంచకునే పనిలో జగన్ ఉన్నారని సమాచారం. అయితే, ఈ ప్రయత్నాలు అన్నీ బీజేపీ అధిష్టానానికి ఆగ్రహం తెప్పించాయి. అందుకే అటు అపాయింట్మెంట్ లు ఇవ్వకుండా, ఇటు తగినన్ని నిధులు కూడా విడుదల చెయ్యకుండా, అటు కేసీఆర్ ని , ఇటు జగన్ ను కూడా ఇబ్బంది పెడుతున్నారని, ఢిల్లీ టాక్. అయితే ఈ క్రమంలో, జగన్, కేసీఆర్ మధ్య దూరం పెంచటంలో, బీజేపీ సక్సెస్ అయ్యింది. అన్ని వైపుల నుంచి ఇబ్బంది పెట్టి, తమ జగన్ ని, కేసీఆర్ ని, తమ దారికి తెచ్చుకునే వ్యూహంలో భాగంగానే, బీజేపీ ఇలా చేస్తుందా అనే సందేహం కూడా కలుగుతుంది. మరి, ఈ గేమ్ లో ఎవరు పై చేయి సాధిస్తారో చూడాలి.