ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ఈ రోజు నుంచి ప్రారంభం అయ్యాయి. ఈ రోజు 9 గంటలకు అసెంబ్లీ సమావేశాలను స్పీకర్ తమ్మినేని ప్రారంభించారు. అయితే, అసెంబ్లీ సమావేశాల మొదటి రోజే, తెలుగుదేశం పార్టీ ఇంకా లోపలకి ఎంటర్ కాక ముందే, అధికార పక్షం తెలుగుదేశం పార్టీని తొక్కేసే ప్రయత్నం చేసింది. ఈ రోజు ప్రజలు ఎదుర్కుంటున్న తీవ్ర సమస్య ఉల్లి ధరలు పెంపుదల. కేజీ ఉల్లిపాయ దాదాపుగా 200 కు చేరుకుంది. అయితే ప్రభుత్వం, ఒక్కొక్కరికీ కేజీ 25 రూపాయలకు సబ్సిడీ ఇస్తుంది. అయితే ఇవి కూడా అరకోరగా సాగుతున్నాయి. ప్రజలు ఉదయం నుంచి సాయంత్రం వరకు క్యూలో ఉంటే, ఒక కేజీ వచ్చే పరిస్థితి కూడా లేదు. దీంతో, ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. అయితే, ఈ సమస్య పై తెలుగుదేశం పార్టీ మొదటి రోజే, నిరసన తెలిపింది. ఉల్లి దండలు మెడలో వేసుకుని ఆ పార్టీ నేతలు నిరసన తెలిపారు. తక్కెడలో బంగారం, ఉల్లిపాయలు పెట్టి రెండూ సమానమేనని చూపిన చంద్రబాబు.
పాదయాత్రగా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అసెంబ్లీకి చేరుకున్నారు. అయితే అసెంబ్లీ ప్రధాన ద్వారం టీడీపీ అధినేత చంద్రబాబుతో పాటుగా, మిగతా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను పోలీసులు అడ్డుకున్నారు. ప్లకార్డులతో అనుమతి లేదని, అలాగే ఉల్లిపాయల దండలతో లోపాలకి వెళ్ళవద్దు అంటూ, టీడీపీ అధినేత చంద్రబాబును గేటు వద్దే పోలీసులు ఆపేశారు. చంద్రబాబుతో పాటు ఇతర ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను గేటు వద్దే ఆపేశారు. దీంతో పోలీసులు టిడిపి నేతల మధ్య స్వల్ప వాగ్వాదం చోటుచేసుకుంది. అయితే ఇవన్నీ మేము అసెంబ్లీ లోపలకు తీసుకువెళ్ళమని, వీటిని మా పార్టీ ఆఫీస్ లో పెట్టుకుంటాం అని చెప్పినా పోలీసులు లోపలకి అనుమతించలేదని సమాచారం.
ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు మాట్లాడుతూ, రాష్ట్రంలో ఉల్లి ధరలు బంగారంతో సమానంగా ఉన్నయాని అనంరు. తక్కెడలో బంగారం, ఉల్లిపాయలు పెట్టి రెండూ సమానమేనని చంద్రబాబు చూపించారు. ఉల్లి ధరలను ప్రభుత్వం నియంత్రించలేకపోతోందని చంద్రబాబు అన్నారు. టీడీపీ హయాంలో నిత్యావసర ధరలు పెరగకుండా చర్యలు తీసుకున్నామని గుర్తు చేసారు. సబ్సిడీ పై తక్కువ ధరలతో ఉల్లి అందించామని, అప్పట్లో కేజీ 20 కు ఇచ్చి, ఒక్కొక్కరికీ 2.5 కేజీలు ఇచ్చామని, అవి కూడా ప్రజలకు ఇబ్బంది లేకుండా, రేషన్ దుకాణాల్లో ఇచ్చామని గుర్తు చేసారు. ధరలు దిగివచ్చేవరకు, ఈ ప్రభుత్వం పై, టీడీపీ పోరాటం కొనసాగుతుందని చంద్రబాబు తెలిపారు. ఉల్లి కేజీ రూ. 200 అమ్ముతుందంటే ఎంత దుర్మార్గమో ఆలోచించాలని చంద్రబాబు అన్నారు.