151 మంది ఎమ్మెల్యేలతో, తిరుగులేని శక్తిగా, ఆరు నెలల క్రితం జరిగిన ఎన్నికల్లో, భారీ విజయం సాధించిన వైసీపీకి, ఆరు నెలలు తిరగకుండానే, అంతర్యుద్ధం మొదలైంది. అది కూడా సీనియర్ నేత ఆనం రామనారాయణరెడ్డి. అయితే సీనియర్ నేత ఇలా మాట్లాడటం వెనుక, అధికార పార్టీలో ఆధిపత్యపోరు అనే ప్రచారం జరుగుతుంది. నివురుగప్పిన నిప్పులా ఉన్న వ్యవహారం, ఆనం రామనారాయణ రెడ్డి వ్యాఖ్యలతో బగ్గు మంది. ముఖ్యంగా, అనిల్ కుమార్ యాదవ్, కోటంరెడ్డి శ్రీధర్‌ రెడ్డిలను టార్గెట్ చేస్తూ, ఆనం రామనారాయణరెడ్డి చేసిన వ్యాఖ్యలు, ఇప్పుడు పార్టీలో హాట్ టాపిక్ అయ్యాయి. ఆనం రామనారాయణరెడ్డి మాట్లాడుతూ, నెల్లూరు నగరంలో, అన్ని రకాల మాఫియాలు పెరిగిపోయాయని, యువత ఈ మాఫియాల వల్ల, చెడిపోతున్నారని, ఎవరిని కదిలించినా, ఏదోక మాఫియాలో ఆరి తేరి ఇబ్బంది పడేవారే అని ఆనం రామనారాయణరెడ్డి అన్నారు. వీరికి అడ్డు అదుపు లేకుండా పోయిందని అన్నారు.

aanam 07122019 2

నెల్లూరు నగరంలో లిక్కర్‌ మాఫియా, ఇసుక మాఫియా, ల్యాండ్‌ మాఫియా, బెట్టింగ్‌ మాఫియా, ఇలా ఒకటి కాదు, రెండు కాదు, అనేక మాఫియాలు ఉన్నాయని అన్నారు. ఈ మాఫియాలు పెట్టే బాధ, ఎవరికి చెప్పు కోవాలో అర్థం కాక లక్షలాది మంది నెల్లూరు ప్రజలు కుమిలిపోతున్నారని ఆనం అన్నారు. అయితే ఈ బెట్టింగ్ గురించి, ఇలా అన్ని మాఫియాల గురించి ఆనం చెప్పటం చూస్తే, ఆయన టార్గెట్ మంత్రి అనిల్‌, ఎమ్మెల్యే కోటంరెడ్డిలు అని అర్ధమవుతుంది. మంత్రి వర్గంలో, ఆనంకి చోటు లేకపోవటం, అలాగే నెల్లూరు మంత్రి అనిల్‌, ఎమ్మెల్యే కోటంరెడ్డిలు మాటే చెల్లుబాటు అయ్యేలా వాళ్ళు చెయ్యటంతో, ఆనం రామ నారాయణరెడ్డి, కాకాణి గోవర్థన్‌రెడ్డిలు రగిలిపోతూ వస్తున్నారు. ఇది వరుకే, కాకాణి, కోటంరెడ్డిలకు, విభేదాలు వచ్చిన సంగతి తెలిసిందే.

aanam 07122019 3

మరో పక్క తాజాగా, వీఆర్సీ కాలేజీ పెత్తనం తమ చేతులు దాటటం పై ఆనం మరింత అసహనానికి గురవ్వటానికి కారణం అయ్యింది. వీఆర్సీ కాలేజీ పెత్తనం చాలా ఏళ్లుగా ఆనం కుటుంబం చేతిలో ఉంది. వీఆర్‌సీ అభివృద్ధి కమిటీ చైర్మన్‌గా రూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డిని నియమించినట్లు మంత్రి అనిల్‌ ప్రకటించటంతో, ఆనం తన పై కుట్ర చేసారని భావిస్తున్నారు. అయితే నిన్న ఆనం మీడియాతో మాట్లాడుతూ, నెల్లూరు అంతా అన్ని రకాల మాఫియాలు ఉంటున్నాయని, చెప్పటం చూస్తుంటే, సొంత పార్టీ పరిపాలన పైనే ఆయన వ్యాఖ్యలు చేసినట్టు అర్ధమవుతుంది. ఈ ధిక్కారం ఇంతటితో ఆగుతుందా, లేదా అనేది వైసీపీ నేతల్లో గుబులు పట్టుకుంది. అంతర్గతంగా చెప్పాల్సిన విషయాలు, బహిరంగం అయ్యాయి అంటే, విషయం చాలా దూరం వెళ్లిందని పార్టీలో చర్చ జరుగుతుంది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read