ప్రస్తుతం దేశం మొత్తం ఎక్కడ చూసినా ఒకటే చర్చ. ఆడపిల్లల పై అమానుషంగా పడుతున్న మృగాలకు ఎలాంటి శిక్ష పడాలి. ఎంత త్వరగా పడాలి. చట్టాల్లో ఎలాంటి మార్పులు తీసుకురావాలి. వెంటనే న్యాయం ఎలా జరగాలి. ఇలా చర్చలు అన్నీ గత వారం రోజులుగా, దీని చుట్టూ తిరుగుతున్నాయి. హైదరాబాద్ కేసులో, నలుగురినీ పోలీసులు ఎన్కౌం-టర్ చెయ్యటంతో, ఇది కరెక్ట్ అని కొంత మంది, ఏదైనా చట్టం ద్వారా చెయ్యాలని, అందుకు అనుగుణంగా, సత్వర న్యాయం జరిగేలా చూడాలని, కొంత మంది వాదిస్తున్నారు. ఈ క్రమంలోనే, ఏ టీవీ ఛానల్ పెట్టినా ఇదే చర్చ జరుగుతుంది. చనిపోయినా ఆ నలుగురుకీ ఏ బ్యాక్ గ్రౌండ్ లేదు కాబట్టి, ఎన్కౌం-టర్ చేసారని, మరి మిగతా కేసుల్లో ఉన్న వారిని కూడా అలా ఎప్పుడు చేస్తారు అంటూ, నేషనల్ మీడియాలో చర్చలు జరుగుతున్నాయి. ఇదే కోవలో, వారు ముందుగా, ప్రజా ప్రతినిధులను టార్గెట్ చేసారు. ఎంపీలుగా ఉన్న వారి పై కూడా, రే-ప్ కేసులు ఉన్నాయని, వారిని ఎప్పుడు హ్యంగ్ చేస్తున్నారు అంటూ, ట్రెండ్ చేస్తున్నారు.
ఈ సందర్భంగా, ఈ జాబితాలో ఆంధ్రప్రదేశ్ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన హిందూపూర్ ఎంపీ గోరంట్ల మాధవ్ పేరు కూడా వచ్చింది. ఆయన పై కూడా ఒక రే-ప్ కేసు ఉండటంతో, ఆయణ ఫోటో చూపిస్తూ, వీళ్ళా మన ప్రజా ప్రతినిధులు, వీరి సంగతి ఏంటి అంటూ, నేషనల్ మీడియా ప్రశ్నిస్తుంది. గోరంట్ల మాధవ్, పోలీస్ గా పని చేస్తూ, రాజకీయాల్లోకి వచ్చారు. ఆయన పై, నాలుగు వరకు వివిధ కేసులు ఉన్నాయి. అందులో ఒకటి, ఐపిసి-376, రే-ప్ కేసు. మరొకటి ఐపీసీ - 302 మర్డ-ర్ చేసారని అభియోగం. అలాగే ఐపిసి - 506 తో రెండు కేసులు ఉన్నాయి. రే-ప్ కేసుకు సంబంధించి, ఇది ఆయన పై, 2012లోనే నమోదు అయ్యింది. ఇది ఒక యువ జంటని అదుపులోకి తీసుకున్న సమయంలో జరిగిన ఘటనగా తెలుస్తుంది.
ఓ కేసులో ఓ యువజంటను అదుపులోకి తీసుకున్న గోరంట్ల మాధవ్, ఆ జంటలోని మహిళతో అసభ్యంగా ప్రవర్తించారు. అత్యా-చారం చేయబోయారని ఆ మహిళ కేసు పెట్టింది. ఈ కేసు విచారణలో ఉంది. అలాగే ఆయాన నోట్ల రద్దు సమయంలో, ఒక వ్యక్తీని గొడ్డుని బాదినట్టు బాదిన వీడియో ఒకటి వైరల్ అయ్యింది. దాని పై కూడా ఆయన మీద కేసు నమోదు అయ్యింది. ఇలా రే-ప్ కేసు ఉన్న మాధవ్ పై ఎప్పుడు చర్యలు తీసుకుంటున్నారు, అంటూ నేషనల్ మీడియా ప్రశ్నిస్తుంది. అయితే మాధవ్ మాత్రం, ఈ కేసు ఇంకా విచారణలో ఉందని చెప్తున్నారు. విచారణలో ఉండగానే, ఇలా ఎలా మాట్లాడుతారు అని ప్రశ్నిస్తున్నారు. అయితే, ఇప్పుడు జరుగుతున్న చర్చే అది. రే-ప్ కేసుల్లో సత్వర న్యాయం ఉండాలని.