అమరావతి ప్రాంత రైతులకు, రోజు రోజుకీ మద్దతు పెరుగుతుంది. 26 రోజులుగా అమరావతి రైతులు ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం మాత్రం స్పందించటం లేదు. 26 రోజుల క్రితం, కేవలం 29 గ్రామాల సమస్యగా మొదలైన అమరావతి ఉద్యమం, నేడు ఆంధ్రప్రదేశ్ అంతటా పాకింది. అయితే, ఈ 26 రోజులు నుంచి ప్రభుత్వం మాత్రం, మీ సమస్య ఏమిటి అని మాత్రం, రైతులని అడగలేదు. ఇక పొతే, అమరావతి ఉద్యమానికి అన్ని వర్గాల నుంచి మద్దతు లభిస్తుంది. ముఖ్యంగా అన్ని ప్రాంతాల్లో మహిళలు వారికి మద్దతుగా నిలుస్తున్నారు. ఇక పొతే, అన్నిటికంటే ముందు ఉండాల్సిన సినీ పరిశ్రమ మాత్రం, ఇటు వైపు కూడా చూడటం లేదు. కేవలం హీరో నారా రోహిత్, సింగర్ స్మితా మాత్రమే, అమరావతి ఉద్యమానికి మద్దతు పలికారు. చిరంజీవి లాంటి అగ్ర హీరో అయితే, మొదటి రోజే, అద్భుతమైన నిర్ణయం తీసుకున్న జగన్ రెడ్డి అంటూ, భజన చేసారు. దీంతో సినీ పరిశ్రమ పై, ఏపి వ్యాప్తంగా వ్యతిరేకత వస్తుంది. ఇక్కడ ఎక్కువ కలెక్షన్లు తెచ్చుకుని, ఏపిని మాత్రం పట్టించుకోరు అని ప్రజలు వాపోతున్నారు.

aswinidutt 11012020 2

ఈ సందర్భంలో, తెలుగు సినీ ఇండస్ట్రీ దిగ్గజ నిర్మాతలో ఒకరైన ప్రముఖ నిర్మాత అశ్వినీదత్, ఈ రోజు అమరావతి ప్రాంతంలో పర్యటించారు. అక్కడ రైతులు చేస్తున్న ఉద్యమానికి మద్దతు ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సొంత సినీ పరిశ్రమ పై, చిరంజీవి పై సంచలన వ్యాఖ్యలు చేసారు. మూడు రాజధానులు భేష్ అంటూ మెగాస్టార్ చిరంజీవి తీసుకున్న నిర్ణయాన్ని, అయన విజ్ఞతకే వదిలేస్తున్నానని అశ్వినీదత్ అన్నారు. చిరంజీవికి అసలు ఏమి తెలుసనీ, ఆయనకు ఏమి తెలియదు కాబట్టే, మూడు రాజధానులు బాగుంటుందని చెప్పారని అన్నారు. ప్రపంచంలో ఎక్కడైనా ఒకటి కంటే ఎక్కువ రాజాధనులు ఉన్న ప్రాంతాలు, ఫెయిల్ అయ్యాయనే విషయం చిరంజీవికి తెలియదా అని ప్రస్నిన్చాఉర్.

aswinidutt 11012020 3

పవన కళ్యాణ్ సినిమాల్లోకి వస్తే, ఆయానకు కోట్లు వస్తాయని, సినిమాలు వదిలేసి ఆయన రైతులు కోసం ఎందుకు పోరాడుతున్నారో, చిరంజీవికి తెలియదా అని అశ్వినీదత్ ప్రశ్నించారు. ఇక పృథ్వీ మాట్లాడిన మాటలు ఎవరూ పట్టించుకోనవసరం లేదని, అతనికి విలువే లేదని, అలంటి వాడి మాటలకు విలువ ఇవ్వాల్సిన పని లేదని అశ్వినీదత్ అన్నారు. రైతులు, సినీ పరిశ్రమమద్దతు ఇవ్వమని అడగనవసరం లేదని, సినిమాలు చూడటం మానిస్తే చాలని, సినీ ఇండస్ట్రీ మొత్తం, దిగి వచ్చి, మీ ముందు ఉంటుంది అని అన్నారు. ఈ గడ్డ పై పుట్టిన వాళ్ళు సూపర్ స్టార్లు అయ్యారని, నటుడిగా కాకున్నా, కనీసం మనిషిగా అయినా స్పందించాలని అన్నారు. రాజధాని రైతులను చూస్తే ఆవేదన కలుగుతోందని అశ్వినీదత్ అన్నారు. సొంత ఇండస్ట్రీ పై, అశ్వినీదత్ చేసిన వ్యాఖ్యలు, సినీ ఇండస్ట్రీలో ఎలాంటి రియాక్షన్ ఇస్తుందో మరి.

Advertisements

Advertisements

Latest Articles

Most Read