అమరావతి కోసం 24 రోజులుగా ఆందోళనలు జరుగుతున్నాయి. ఈ రోజు అమరావతిలో యుద్ధ వాతవరణం నెలకొంది. ఉద్దండరాయిని పాలెం నుంచి విజయవాడ కనకదుర్గ గుడి వరకు చేపట్టిన మహిళా పాదయాత్రను పోలీసులు అడ్డుకున్నారు. ఉద్దండరాయిని పాలెంలో పూజలు నిర్వహించి పొంగళ్లను నైవేద్యంగా అమ్మవారి గుడికి తీసుకెళ్లాలని రైతులు నిర్ణయం తీసుకున్నారు. అయితే రైతు నాయకులను ముందస్తు అరెస్ట్ చేసిన పోలీసులు , పాదయాత్రగా వస్తున్న మహిళలను కూడా ఎక్కడికక్కడ అరెస్ట్ చేసారు. గ్రామాల ప్రధాన కూడళ్ళలో మూళ్ళ కంచెలు ఏర్పాటు చేసి, ఎక్కడికక్కడ అరెస్ట్ చేసారు. మందడం, వెలగపూడి గ్రామాల్లో రైతులు బయటకు రాకుండా భారీగా బలగాలు మొహరించారు. దేవుని సెంటిమెంట్ ను పోలీసులు నియంత్రిస్తున్నారంటూ రైతుల మండిపాడ్డారు. అమరావతిలో ఇంత హంగామా జరుగుతుంటే, మరో పక్క అమరావతి జేఏసీ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గునటానికి, చంద్రబాబు రాజమండ్రి వెళ్లారు.
అమరావతి కోసం భూములు ఇచ్చిన, 29 వేల మంది రైతులు ఇంత ఆందోళన చేస్తుంటే, సినీ వర్గానికి చెందిన వారు సపోర్ట్ లేకపోవటం వల్ల, సినీ ఇండస్ట్రీ స్పందించాలి అంటూ, రైతులు కోరుతున్నారు. జేఏసీ కూడా, హీరోలు అందరూ ఉద్యమానికి బలం ఇవ్వాలని కోరారు. అలా ఇవ్వకపోతే, మీ సినిమాలు చూడం అంటూ హుకుం జారీ చేసారు. అయితే ఈ రోజు, జై ఆంధ్ర ప్రదేశ్ విద్యార్థి, యువజన పోరాట సమితి నాయకులు, హైదరాబాద్ లోని టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేశ్ బాబు ఇంటి ముందు నిరాహార దీక్షకు కూర్చున్నారు. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతినే కొనసాగించాలని, ఈ ఉద్యమానికి తెలుగుసినీ పరిశ్రమ మొత్తం, మద్దతు ఇవ్వాలని వారు డిమాండ్ చేసారు. అయతే విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడకు వచ్చారు.
అక్కడ ధర్నా చేస్తున్న వారిని అదుపులోకి తీసుకున్నారు. వారిని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. మరో పక్క, ఆంధ్రప్రదేశ్ కోసం తెలుగుసినీ పరిశ్రమ కలిసి రావాలని, ఇవాళ్టి నుంచి 19 వరకూ హీరోల ఇంటి ఎదుట ఆందోళన చేస్తామంటూ జై ఆంధ్ర ప్రదేశ్ విద్యార్థి, యువజన పోరాట సమితి పిలుపిచ్చింది. అయితే ఆంధ్రప్రదేశ్ పై ఇప్పటి వరకు తెలుగు సినీ పరిశ్రమ చిన్న చూపు కొనసాగుతూనే ఉంది. గతంలో ప్రత్యెక హోదా సమయంలో కాని, ఇప్పుడు అమరావతి పోరాటంలో కాని, ఎక్కడా వారు మద్దతు ఇవ్వటం లేదు. అదే తెలంగాణాలో అయితే చిన్న సమస్యకు కూడా వారు స్పందిస్తూ ఉంటారు. ఎక్కువ కలెక్షన్ లు వచ్చేది, మన ఆంధ్రప్రదేశ్ నుంచే అయినా, మనలను మాత్రం, పట్టించుకోరు.