జనసేన పార్టీ చీఫ్ పవన్ కల్యాణ్ ఢిల్లీ పర్యటన వెనుక ఆంత ర్యం ఏమిటనేది ప్రశ్నార్థకంగా తయారైంది. అత్య వసరంగా శనివారం ఢిల్లీ వెళ్లిన ఆయన ఇప్పటి వరకూ ఎవరినీ ఇంకా కలవ లేదని సమాచారం. అయితే పార్టీ విస్తృత స్థాయి సమావేశం మధ్యలో అంత అర్జంటుగా ఢిల్లీ వెళ్లాల్సిన పరిస్థితి ఏమిటనేది సందిగ్ధంగా తయా రైంది. ఢిల్లీ వెళ్లిన ఆయన అక్కడ అసలు ఏం చేస్తు న్నారు. ఎవరిని కలుస్తున్నారనేది అంతా గోప్యంగా జరు గుతుండడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. రాజధానిగా అమరావతినే కొనసాగించాలని ఆందోళనలు జరుగుతున్న సమయంలో అమరావతికి అనుకూలంగా కార్యాచరణ చేపట్టాలని పవన్ కల్యాణ్ నిర్ణయించారు. ఇందుకుగాను ఇసుక కొరతతో భవన నిర్మాణ కార్మికులు పడుతున్న ఇబ్బందులను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేం దుకు భారీ స్థాయిలో విశాఖపట్నంలో లాంగ్ మార్చ్ ను నిర్వహించారు. అదేవిధంగా ఇప్పుడు అమరావతి నుండి రాజధానిని విశాఖపట్నం తరలించేందుకు ప్రభుత్వం సిద్ధమైన నేపధ్యంలో దీనికి వ్యతిరేకంగా, రైతుల ఆం దోళనలకు మద్దతుగా మరోసారి లాంగ్ మార్చ్ నిర్వ హించాలని పవన్ కల్యాణ్ భావించారు. ఇందుకు వేది కగా పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో నిర్ణయం తీసు కునే సమయంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఉన్న ట్టుండి ఢిల్లీకి వెళ్లడం సర్వత్రా ఆసక్తికరంగా మారింది. ఇక ఢిల్లీలో పవన్ కల్యాణ్ అజ్ఞాతవాసిగా మారి ఆయన పర్యటన అంతారహస్యంగా సాగుతోంది. శనివారం నుండి అక్కడ ఆయన ఎవరికీ చిక్కడం లేదు. కనీసం ఆయన ఎక్కడ ఉన్నారన్నదాని పైన కూడా ఎటువంటి , సమాచారం బయటకు అందడం లేదు.
ఎవరిని కలుస్తారనేది కూడా తెలియని పరిస్థితి నెలకొంది. అసలు ఆయనను ఢిల్లీకి ఎవరు పిలిచారన్నది కూడా తెలియరావడం లేదు. మీడియాకు సైతం ఆయన దూరంగా , ఉంటుండడం సర్వత్రా చర్చనీయాంశంగా తయారైంది. అయితే ఆయన రాజకీయ కారణాలతో ఢిల్లీకి వెళ్లారా, లేదంటే వ్యక్తిగత అంశాలపై వెళ్లారా అనేది సస్పెన్స్ గా మారింది. ఢిల్లీలో ఉన్న వవన్ కల్యాణ్ శనివారం రోజునే బిజెపి వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా, పార్టీ అధ్యక్షులు అమిత్ షా తదితర పలువురు బిజెపి పెద్దలను కూడా , కలువనున్నట్లు సమాచారం. కానీ దీనిపై ఎటువంటి అధికారిక సమాచారం లేకపోవడంతో వవన్ పర్యటన వెనుక ఉన్న మతలబు ఏమిటనేది ఆసక్తి రేపుతోంది. మరోపక్క రాజధాని అమరావతి విషయంలో కేంద్రమే నిర్ణయం తీసుకోవాలని ఇటీవల పవన్ కల్యాణ్ ప్రకటించిన నేపథ్యంలో ఆయనను బిజెపి పెద్దలే పిలిచా రన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే రెండు సార్లు ఢిల్లీ వెళ్లి వచ్చిన పవన్ కల్యాణ్ ఇప్పుడు మూడోసారి కూడా వెళ్లడంతో రాజకీయంగా పెద్దలతో పావులు కదుపుతున్నానే బలమైన ప్రచారం జరుగుతోంది. కాగా డిసెంబర్ నెలలో ఢిల్లీ వెళ్లిన పవన్ కల్యాన్ ఆ పర్యటనను కూడా రహస్యంగా ఉంచారు. ఎవరిని, ఎప్పుడు కలుస్తున్నారనేది తెలియనీ యకుండా జాగ్రత్త పడ్డారు.
ఢిల్లీకి వెళ్లి వచ్చిన తరువాత వపన్ కల్యాణ్ ఆంధ్రప్రదేశ్ లో మరిన్ని రాజకీయ వ్యూ హాలకు పదును పెట్టారు. ఢిల్లీ వర్యటనను అత్యంత సీక్రెట్ గా ఉంచిన ఆయన తిరిగి రాష్ట్రానికి వచ్చిన అనంతరం కొత్త వ్యూహాలకు శ్రీకారం చుట్టారు. ప్రజా సమస్యల నుండి హిందుత్వ ఎజెండాకు మారారని పార్టీ వర్గాలే వెల్లడిస్తున్నాయి. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వ విధానాలను లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేస్తున్న ఆయ బిజెపిపై మాత్రం సానుకూల వ్యాఖ్యలు చేస్తున్నారు. తన రాయలసీమ వర్యటనలో మతపరమైన వ్యాఖ్యలు చేస్తూ సంచలనం సృష్టించారు. దీంతో తన దారి ఢిల్లీ వైపు నకు అంటూ సంకేతాలు ఇచ్చినట్లయ్యిందని రాజకీయ వర్గాల్లో అప్పుడు చర్చ జరిగింది. అంతేకాకుండా బిజెపికి తాను ఏనాడూ దూరం లేనని, అమిత్ షా లాంటి నాయకులు దేశానికి ఎంతో అవసరం అని, సీఎం జగన్మోహన్ రెడ్డి ఇంటికి సమీపంలోని 40 మందిని మత మార్పిడి చేశారని పవన్ కల్యాణ్ అప్పట్లో చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీ యాల్లో వెడెక్కించాయి. అంతేకాకుండా తాను బిజెపి ఏనాడూ దూరం కాలేదని కేవలం ప్రత్యేక హోదా కోసమే ఒంటరిగా పోరాడానని చెప్పారు. ఈ నేపథ్యంలోనే వపన్ కల్యాణ్ జనసేన పార్టీని బిజెపిలో విలీనం చేస్తు న్నారని అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు రాజకీయ విమర్శలకు తెరలేపారు. మరోవైపు బిజెపి నేతలు సైతం పవన్ కల్యాణ్ వ్యాఖ్యలను స్వాగతించారు. ప్రాంతీయ పార్టీల విలీనాన్ని తాము ఎప్పుడూ కోరుకుంటామనే సంకేతాలను బిజెపి నేతలు ఇచ్చారు. ఇప్పుడు మళ్లీ ఢిల్లీకి పర్యటనకు అత్యవసరంగా వెళ్లడం, ఆద్యంతం పర్యటన వివరాలు రహస్యంగా ఉంచడంతో మరోసారి రాజకీయవర్గాల్లో వేడిని రేకెత్తిస్తోంది.