విజయసాయి రెడ్డి అంటే, వైసీపీలో ఎంత స్థాయి వ్యక్తి అనేది అందరికీ తెలిసిందే. జగన్ మోహన్ రెడ్డి నెంబర్ వన్ అయితే, విజయసాయి రెడ్డి నెంబర్ 2 గా గుర్తింపు తెచ్చుకున్నారు. పార్టీలో విజయసాయి రెడ్డి అంటే, అందరికీ భయం, గౌరవం, భక్తి ఇలా అన్నీ ఉన్నాయి. ఇలాంటి పవర్ ఉన్న విజయసాయి రెడ్డి పై, మంత్రి పేర్ని నాని చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఈ రోజు క్యాబినెట్ మీటింగ్ జరిగిన తరువాత, క్యాబినెట్ లో జరిగిన విషయాల పై, ఆయన ఈ రోజు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు. ఈ సందర్భంగా, మీడియా అడిగిన ప్రశ్నకు మంత్రి పేర్ని నాని స్పందిస్తూ, ఈ వ్యాఖ్యలు చేసారు. విజయసాయి రెడ్డి రెండు రోజుల క్రితం, 28న జగన్ మోహన్ రెడ్డి వైజాగ్ వస్తున్నారని, ఆయనకు భారీ స్వాగతం పలకాలని, ఏకంగా కల్లెక్టరేట్ లోనే, రివ్యూ మీటింగ్ పెట్టి, 24 కిమీతో మానవహారం పెట్టి, జగన్ కు కనీ వినీ ఎరుగని రీతిలో స్వాగతం పలకలాని, విజయసాయి రెడ్డి, వైజాగ్ లోని ప్రజా ప్రతినిధులను కోరుతూ, హంగామా చేసిన సంగతి తెలిసిందే.
ఇదే ప్రశ్న విలేఖరులు, మంత్రిని అడిగారు. ఒక పక్క రేపు జగన్ వైజాగ్ వస్తున్నారు, విశాఖను పరిపాలనా రాజధాని చేసిన తరువాత మొదటి సారి వస్తున్నారు, వెల్కమ్ చెప్పండి అంటూ మీ విజయసాయి రెడ్డి చెప్పారు కదా, మరి ఇప్పుడు మీరు క్యాబినెట్ లో ఏమి నిర్ణయం తీసుకోలేదు అని చెప్తున్నారు ఏమిటి అని అడగగా, దానికి మంత్రి సమాధానం చెప్తూ, విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలను మంత్రి పేర్ని నాని ఖండించారు. విజయసాయి రెడ్డి ఒక రాజకీయ నాయకుడు, విశాఖ వైసీపీ ఇన్చార్జ్గా ఆయన ఉన్నారు, ఆయన విశాఖ మీద అభిమానంతో ఇలా చెప్పి ఉంటారు, మీము ప్రభుత్వంగా చెప్తున్నాం, మేము విశాఖ పై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు, కమిటీ నిర్ణయం రావాలి అంటూ, పెర్ని నాని చెప్పారు.
అయితే పెర్ని నాని చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఏకంగా విజయసాయి రెడ్డి మాటలను, ఒక్క మాటలో తీసి పడేసి, ఆయన ఒక రాజకీయ నాయుడు, మేము ప్రభుత్వం, మేము చెప్పిందే ఫైనల్ అంటూ, చెప్పటంతో, అందరూ ఒక్కసారిగా అవాక్కయ్యారు. వైసీపీ శ్రేణులు కూడా మంత్రి, ఏకంగా విజయసాయి రెడ్డిని ఇలా అనటం పై అవాక్కయ్యారు. ఒక పక్క విజయసాయి రెడ్డి, విశాఖలో గ్రాండ్ ఏర్పాట్లు చెయ్యాలి అని చెప్పటం, ఏకంగా వైసీపీ దాన్ని భారీగా ప్రాచారం చెయ్యటంతో, అందరూ వైజాగ్ క్యాపిటల్ అని ఫిక్స్ అయిపోయారు. అయితే, ఇప్పుడు క్యాబినెట్ దాన్ని ఫైనల్ చెయ్యక పోవటం, విజయసాయి రెడ్డి ఒక రాజకీయ నాయకుడు , మేము ప్రభుత్వం అంటూ చెప్పటం, అందరినీ ఆశ్చర్య పరుస్తుంది.