ఈ రోజు క్యాబినెట్ సమావేశం జరుగుతున్న సంగతి తెలిసిందే. జగన్ మోహన్ రెడ్డి తాడేపల్లిలోని తన నివాసం నుంచి, అమరావతి రాజధాని గ్రామాలు మీదుగా, వెలగపూడి సచివాలయం రావలిసి ఉంటుంది. అయితే, ఈ రోజు అమరావతిలో కేవలం అసెంబ్లీ ఉంటుందని, సచివాలయం వైజాగ్ కి వెళ్ళిపోతుందని, హైకోర్ట్ కర్నూల్ కు వెళ్ళిపోతుందని, క్యాబినెట్ నిర్ణయం తీసుకునుంది. ఈ నేపధ్యంలోనే, అమరావతి రాజధాని ప్రజలు, పది రోజులుగా నిరసన తెలుపుతున్నారు. అయితే, క్యాబినెట్ సమావేశం నేపధ్యంలో, ఎక్కడ ప్రజలు నిరసన తెలుపుతారో అని, రైతులు పై అనేక ఆంక్షలు పెట్టరు. అయినా, జగన్ మోహన్ రెడ్డి, సచివాలయం వచ్చే సమయంలో, ఏమైనా ఘటనలు జరుగుతాయి ఏమో అని, అందరూ టెన్షన్ పడ్డారు. అయితే, రైతులను బోల్తా కొట్టించి, తెలివిగా ఎటువంటి ఆందోళనకు గురి కాకుండా, జగన్ మోహన్ రెడ్డి సచివాలయం చేరుకున్నారు. దీంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు.
దీనికి పోలీసులు అదిరిపోయే వ్యూహం పన్నారు. రైతులను రోడ్డు మీదకు రావద్దు అన్నా వారు వచ్చి ఉన్నారు. అయితే, ఇవి గ్రామాలు కావటంతో, ఎవరు ఎటు వైపు నుంచి వస్తారో, తెలియని పరిస్థితి. అందుకే పోలీసులు ఓక మాస్టర్ ప్లాన్ వేసారు. ముందుగా జగన్ మోహన్ రెడ్డి సచివాలయం వస్తున్నట్టుగా, ఒక డమ్మీ కాన్వాయ్ ని పంపించారు. అయితే రైతుల నుంచి పెద్దగా ఎక్కడా ప్రతిఘటన లేకపోవటం, ఎలాంటి ఆవంచనీయ ఘటనలు లేకపోవటంతో, వెంటనే దాని వెనుక జగన్ మోహన్ రెడ్డి అసలు కాన్వాయ్ వచ్చింది. ఎలాంటి ఘటనలు జరగకుండా, కాన్వాయ్ సచివాలయానికి చేరుకుంది. దీంతో అటు పోలీసులు, ఇటు జగన్ బద్రత సిబ్బంది, ఊపిరి పీల్చుకున్నారు. ఎలాం ఆటంకం కలగక పోవడంతో పోలీసులు ఊపిరిపీల్చుకున్నారు.
ఇది ఇలా ఉంటే, సచివాలయంలో, క్యాబినెట్ సమావేశం ప్రారంభం అయ్యింది. జీఎన్ రావు కమిటీ ఇచ్చిన నివేదిక పై, క్యాబినెట్ లో చర్చిస్తున్నారు. అయితే, ఈ రోజు ఎటువంటి ప్రకటన చెయ్యకుండా, ఉండే అవకాసం ఉన్నట్టు తెలుస్తుంది. కొద్ది రోజుల్లో, ఈ అంశం పై ముందుగా అఖిల పక్ష సమావేశం పెట్టాలని, అందరి అభిప్రాయం తీసుకుని, చెయ్యాలని నిర్ణయం తీసుకునే అవకాసం ఉన్నట్టు తెలుస్తుంది. అలాగే మరో పక్క, అమరావతి రైతులను శాంతింప చేసి, వారితో చర్చలు జరపటానికి, ఒక క్యాబినెట్ సబ్ కమిటీ కూడా వేసి, వారితో చర్చలు జరిపి, ప్యాకేజీ పెంచటం, లాంటి హామీలు ఇచ్చి, అమరావతి రైతులను దారిలోకి తెచ్చుకునే వ్యూహం కూడా పన్నుతారని తెలుస్తుంది.