అమరావతిలో పరిస్థితి గంట గంటకు ఉద్రిక్తంగా మారుతుంది. ఈ రోజు క్యాబినెట్ సమావేశం ఉందటం, మంత్రులు అటు వైపు వెళ్ళాల్సి ఉండటంతో, అమరావతి మొత్తం 144 సెక్షన్ పెట్టరు. అడుగు అడుగునా పోలీసులు పెట్టరు. ప్రతి చోట ఆంక్షలు పెట్టరు. చివరకు నిత్యావసరాలు కూడా కొనుక్కునే వీలు లేకుండా ఆంక్షలు పెట్టరు. అయితే ఇదే సందర్భంలో, కొన్ని టీవీ చానల్స్ పని గట్టుకుని, అమరావతి పై విషం చిమ్మటం పై రైతులు ఆగ్రహం వ్యక్తం చేసారు. రైతులను పైడ్ ఆర్టిస్ట్ లు అంటూ, అలాగే అమరావతి ప్రాంతం మునిగిపోయే ప్రాంతం అంటూ, కొన్ని ఛానెల్స్ ప్రచారం చెయ్యటం, ప్రతి సారి అమరావతిని కించ పరుస్తూ మాట్లాడుతూ ఉండటం పై, రైతులు ఎదురు తిరిగారు. రైతులను పైడ్ ఆర్టిస్ట్ లు అంటూ అనటంతో, ఒక ప్రముఖ మీడియా స్తంస్థ ప్రతినిధిని రైతులు తరిమి తరిమి కొట్టారు. ఆ మీడియా ప్రతినిధి కారు పగలగొట్టి, వెంబడించి వెంబడించి, తరిమి తరిమి కొట్టారు. అలాగే మరొక మీడియా ప్రతినిధి పై కూడా దాడి చేసారు.
తాము భూములు ఇచ్చిన రైతులం అని, పెళ్ళాం పిల్లలు, అందరినీ రోడ్డున పెట్టుకుని, పది రోజుల నుంచి రోడ్డున కూర్చుంటే, తమని ఆ మీడియా ఛానెల్స్ పైడ్ ఆర్టిస్ట్ లు అంటారా అంటూ, వారి పై దాడి చేసారు. తాము మీడియాకు వ్యతిరేకంగా కదాని, తమ ఆందోళన చూపిస్తుంది మీడియానే అని, కాని కొన్ని టీవీ ఛానెల్స్ పని గట్టుకుని, అమరావతి పై విష ప్రచారం చేస్తున్నారని, హేళన చేస్తున్నారని, తాము రోడ్డున పడి ఏడుస్తుంటే, తమని పైడ్ ఆర్టిస్ట్ లు అంటూ, హేళన చేస్తున్నారని, ఇలాంటి వారి పై తమ నిరసన అని, వారిని ఉపేక్షించే పరిస్థితి లేదని, తరిమి తరిమి కొడతాం అంటూ, రైతులు తీవ్ర ఆగహ్రం వ్యక్తం చేస్తూ, ఆ మహిళా రిపోర్ట్ కారు అద్దాలు పగలగొట్టారు.
అయితే ఈ పరిస్థితిని ఆపే క్రమంలో, గ్రామస్తులకు, పోలీసులకు కూడా గాయాలు అయ్యాయి. ఉద్రిక్తత పరిస్థితులు ఉన్న నేపధ్యంలో, వారి పోరాటాన్ని హేళన చేస్తూ, హైదరాబాద్ స్టూడియోల్లో కూర్చుని, అమరావతి విషం చిమ్ముతూ, చివరకు పోరాటం చేస్తున్న రైతులని కూడా, పైడ్ ఆర్టిస్ట్ లు , ఒకే కులం, అమరావతి ముంపు ప్రాంతం అంటూ, ఇలా ఇష్టం వచ్చినట్టు రాస్తున్న మీడియాకు బుద్ధి చెప్తామని, రైతులు అంటున్నారు. చేతనైతే మా ఆవేదన ప్రభుత్వానికి చేర వెయ్యాలని, అంతే కాని, ప్రభుత్వాలు ఆడిస్తున్నట్టు , మీరు ఆడితే, చూస్తూ ఊరుకోం అని అంటున్నారు. సమాజానికి హానికరం అయ్యే ఈ ఛానెల్స్ ని, అమరావతి ప్రాంతమే కాదని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు కూడా, తరిమి కొట్టాలని పిలుపిచ్చారు. అయితే మీడియా ప్రతినిధులు మాత్రం, మీ ఆందోళన కవర్ చేస్తున్న మమ్మల్ని, ఇలా కొట్టటం అన్యాయం అని అంటున్నారు.