గత పది రోజులుగా అమరావతి ప్రాంత రైతులు ఆందోళన చేస్తుంటే, గుంటూరు, కృష్ణా జిల్లాల వైసీపీ ప్రాంత ఎమ్మెల్యేలు కనీసం అటు వైపు కన్నెత్తి చూడలేదు. వారి వైపు వెళ్లి, ఏమి జరుగుతుందో కూడా అడగలేదు. చివరకు అమరావతి ప్రాంతం ఉంటున్న తాడికొండ, మంగళగిరి ఎమ్మెల్యేలు కనీసం, బయటకు కూడా రాలేదు. వీరి పై ప్రజల్లో వ్యతిరేకత వస్తున్న సమయంలో, గుంటూరు, కృష్ణా జిల్లా ప్రాంత వైసీపీ ఎమ్మేల్యేలు, ఈ రోజు తాడేపల్లిలోని జగన్ క్యాంపు కార్యాలయంలో, జగన్ తో సమావేశం అయ్యారు. ఈ భేటీ పై అంబటి రాంబాబు, పార్ధసారధి, మీడియాకు వివరించారు. మేము ఈ సమావేశంలో జీఎన్ రావు కమిటీ నివేదిక పై చర్చించామని, అమరావతి రైతులకు న్యాయం జరిగేలా చూస్తామని, జగన్ చెప్పారని అంబటి చెప్పారు. అమరావతి నిర్మాణాలు పూర్తీ చెయ్యాలి అంటే, చాలా డబ్బులు అవుతాయని, అంత డబ్బులు పెట్టి, రాజధాని నిర్మించలేమని చెప్పారు. మేము రాజధాని కోసం నగరాన్ని నిర్మించం అని, నగరం ఉన్న చోటే, రాజధాని పెడతాం అంటూ చెప్పారు.

ycp 26122019 2

మొత్తానికి, గుంటూరు, కృష్ణా జిల్లా వైసీపీ ఎమ్మెల్యేలు, ప్రజల తరుపున కాకుండా, జగన్ నిర్ణయానికే జై కొట్టారు. వీరి నిర్ణయాల పై, టిడిపికి చెందిన, మాజీ మంత్రులు, నక్కా ఆనందబాబు, కొల్లు రవీంద్ర బహిరంగ లేఖ విడుదల చేసారు. "కృష్ణా, గుంటూరు జిల్లాల వైసీపీ ఎమ్మెల్యేల సమావేశ నిర్ణయాలు ఈ రెండు జిల్లాల ప్రజల ప్రయోజనాలే కాకుండా రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీసేవిధంగా ఉన్నాయి. హైదరాబాద్‌ కు ధీటుగా రాష్ట్రం నడిబొడ్డులో అమరావతిని నిర్మించడాన్ని విచ్ఛిన్నం చేస్తున్న జగన్మోహన రెడ్డి, విజయసాయి రెడ్డిల తప్పుడు నిర్ణయాలను తలకెత్తుకున్నట్లుగా ఉన్నాయి. రాజధాని నిర్మాణానికి ప్రభుత్వ డబ్బు ఒక్క రూపాయి అవసరంలేదు. రైతులు ఇచ్చిన భూముల ద్వారానే రాజధాని నిర్మించవచ్చు. రాజధానిని విశాఖకు మారిస్తే ప్రభుత్వ ఖజానా నుంచి తలకు మించిన ఖర్చు చేయవలసి వస్తుంది. ఇది రాష్ట్రాభివృద్ధికి మూలిగే నక్కపై తాటికాయ పడినట్లుంటుంది."

ycp 26122019 3

"రాజధాని మార్పు అనేది కేవలం జగన్మోహన రెడ్డివిజయసాయి రెడ్డిల స్వప్రయోజనాలే తప్ప రాష్ట్రాభివృద్ధికి విఘాతం కలిగిస్తుంది. రైతుల త్యాగాలను ఒమ్ము చేస్తోంది. ఈ వాస్తవాలు తెలిసి కూడా కృష్ణా, గుంటూరు జిల్లాల వైసీపీ ఎమ్మెల్యేలు ఆత్మవంచన చేసుకొని బేలగా జగన్మోహన రెడ్డి నిర్ణయాలను సమర్ధించే స్థితికి దిగజారారు. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఉన్న33 ఎమ్మెల్యే స్థానాలలో నేడు 30 స్థానాలు వైసీపీని చేతుల్లో ఉన్నవి. ఇంత భారీ స్థాయిలో గెలిచిన వీరు రాజధాని మార్పును వ్యతిరేకించి జగన్మోహన రెడ్డి మనసు మార్చకపోతే వీరందరి రాజకీయ జీవితం శాశ్వితంగా ముగిసేవిధంగా ప్రజలు నిర్ణయం తీసుకుంటారు. నాడు తల్లిని చంపి బిడ్డను తీసినందుకు కాంగ్రెస్‌ కు భవిష్యత్‌ లేకుండా చేశారు. ఎదిగే బిడ్డ తలను ముక్కలు చేస్తున్నా వైసీపీ శాసనసభ్యులకు రాజకీయ భవిష్యత్‌ ను ప్రజలు శూన్యం చేస్తారు. వారి భవిష్యత్‌ శూన్యం కాకుండా ఉండాలంటే వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు జగన్మోహన రెడ్డి, విజయసాయి రెడ్డిల మనసు మార్చాలి." అంటూ లేఖ రాసారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read