ఆంధ్రప్రదేశ్ లో, రాజధానుల రగడ కాక రేపుతుంది. జగన్ మోహన్ రెడ్డి అసెంబ్లీలో, మూడు రాజధాణుల ప్రకటన చేసినప్పటి నుంచి, అమరావతిలో 33 వేల ఎకరాలు భూములు ఇచ్చిన రైతులు, ఇప్పుడు రోడ్డున పడ్డారు. రాష్ట్ర విభజన సమయంలో, రాష్ట్రానికి రాజధాని లేదని తమను రాజధాని కోసం భూములు అడిగితే, రాష్ట్ర భవిష్యత్తుతో పాటుగా, తమ భవిష్యత్తు కూడా బాగుంటుందని, భూములు ఇచ్చామని, ఇప్పుడు ఇలా చెయ్యటం అన్యాయమని వారు వాపోతున్నారు. సీఆర్డీఏ పరిధిలో ఉన్న ప్రజల అభిప్రాయం కూడా ఇలాగె ఉంది. గత మూడు రోజులుగా ఆందోళనలు ప్రాంతంగా కొనసాగుతున్నాయి. ఈ పరిస్థితి రోజు రోజుకీ ఎక్కువ అవ్వటమే కాని, సద్దుమణిగేలా కనిపించట్లేదు. ప్రజలు రోజు రోజుకీ ఆందోళనలు ఎక్కువ చేసే అవకాసం కనిపిస్తుంది. ఈ నేపధ్యంలో, ఇప్పుడు కృష్ణా, గుంటూరు జిల్లాల ఎమ్మేల్యేల పై తీవ్ర ఒత్తిడి పెరుగుతుంది. జగన్ మోహన్ రెడ్డి నిర్ణయాన్ని వ్యతిరేకించలేక, ఇటు ప్రజలకు సమాధానం చెప్పలేక ఇబ్బంది పడుతున్నారు.
చివరకు అమరావతి ప్రాంతం ఉన్న తాడికొండలో కూడా, తెలుగుదేశాన్ని కాదని, వైసీపీని అక్కడ ప్రజలు గెలిపించారు. ఇప్పుడు వైసీపీ తమకు అన్యాయం చేస్తుంది అంటూ రోడ్డు ఎక్కారు. అయితే రోజు రోజుకీ ప్రజల ఆందోళన తీవ్ర తరం అవుతూ ఉండటంతో, ఈ ఎమ్మెల్యేలలో ఒత్తిడి పెరుగుతుంది. తెలుగుదేశం పార్టీ నేతలు దేవినేని ఉమా లాంటి వారు, బయటకు వచ్చి రోడ్డు మీద కూర్చుని వారికి సంఘీభావంగా నిరసన తెలుపుతుంటే, వైసీపీ ఎమ్మల్యేలు మాత్రం నోరు ఎత్తటం లేదు. ముఖ్యంగా తాడికొండ, మంగళగిరి నియోజకవర్గాల ఎమ్మెల్యేలు ఉండవల్లి శ్రీదేవి, ఆళ్ల రామకృష్ణారెడ్డి అసలు అడ్డ్రెస్ లేకుండా, కనిపించక పోగా, అసలు మీడియా ముందుకు కూడా రాకపోవటంతో, వారు బయటకు వచ్చి తమకు మద్దతు ఇవ్వాలని ప్రజలు కోరుతున్నారు.
టిడిపిని కాదని మిమ్మల్ని ఇక్కడ గెలిపించామని, ఇప్పుడు ప్రభుత్వం అన్యాయం చేస్తుంటే, తమకు మద్దతుగా ఎందుకు బయటకు రావటం లేదని అంటున్నారు. ఇక గుంటూరు జిల్లాకు చెందిన అంబటి రాంబాబు జగన్ నిర్ణయాన్ని సమర్ధించగా, నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మాత్రం, జగన్ నిర్ణయం తప్పని తేల్చి చెప్పారు. అసెంబ్లీ, సెక్రటేరియట్ ఒకే చోట ఉండాలని, అమరావతిలోనే కొనసాగాలని అన్నారు. అయితే అమరావతి ప్రాంత ఎమ్మేల్యేలు అయిన తాడికొండ, మంగళగిరి నియోజకవర్గాల ఎమ్మెల్యేలు ఉండవల్లి శ్రీదేవి, ఆళ్ల రామకృష్ణారెడ్డి మాత్రం అడ్డ్రెస్ లేరు. వీరి వైఖరి ఎలా ఉంటుంది ? పార్టీ లైన్ కాదని, తమకు ఓటు వేసిన ప్రజల తరుపున నిలబడే సాహసం చెయ్యగలరా ? వేచి చూడాలి.