రెండు రోజుల క్రితం జగన్ మోహన్ రెడ్డి అసెంబ్లీలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మూడు రాజధానులు ఉండొచ్చు అంటూ చేసిన వ్యాఖ్యల పై రాష్ట్రంలో పెద్ద దుమారమే రేగిన సంగతి తెలిసిందే. ఒక రాజధాని కట్టటానికే దిక్కు లేదు, ఇంకా మూడు రాజధానాలు ఎలా కాడతారు అంటూ, పలువురు ప్రశ్నిస్తున్నారు. ఇదంతా ప్రజల మధ్య ప్రాంతీయ చిచ్చు పెట్టి, పబ్బం గడుపుకోవటమే అని అంటున్నారు. ఇక రాజకీయ పార్టీలు కూడా ఈ విషయం పై స్పందిస్తున్నాయి. బీజేపీ పార్టీ స్పందిస్తూ, తాము అభివృద్ధి వికేంద్రీకరణ సమర్దిస్తామని, పరిపాలనా వికేంద్రీకరణ సమర్ధించమని, కర్నూల్ లో హైకోర్ట్ ఉండటం మాత్రం ఒప్పుకుంటామని, అమరావతిలో హైకోర్ట్ బెంచ్ పెట్టాలని కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. జగన్ కు పాలించటం రాదు అంటూ కన్నా వ్యాఖ్యలు చేసారు. అయితే, బీజేపీ రాజ్యసభ సభ్యడు, కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి మరింత ఘాటుగా, జగన్ పై విమర్శలు గుప్పించారు. జగన్ పిల్ల ఆట ఆడుతున్నారు అంటూ, తీవ్ర వ్యాఖ్యలు చేసారు.
అమరావతిని తరలించటం అంత సులువైన పని కాదని, ఇప్పటికే నోటిఫై చేసిన హైకోర్ట్ ని మార్చటం కూడా అంత తేలికైన పని కాదని అన్నారు. జగన్ మోహన్ రెడ్డి ఇష్టం వచ్చినట్టు చేస్తాం అంటే, కేంద్రం చూస్తూ కుర్చోదని తీవ్ర వ్యాఖ్యలు చేసారు. ఇప్పటికే రాజధాని కోసం 2500 కోట్లు ఇచ్చామని, ఇప్పుడు మార్చేస్తాం అంటే ఎలా కుదురుతుంది, ఇదేమీ చిన్నపిల్లలాట కాదని సుజనా వ్యాఖ్యలు చేసారు. జగన్ అసెంబ్లీలో ఈ విషయం పై మాట్లాడుతూ, ఉండొచ్చు ఏమో అంటూ, ఊహాజనితంగా చెప్పారని, అధికారికంగా ఈ ప్రకటన చేస్తే, అప్పుడు కేంద్రం స్పందిస్తుందని అన్నారు. అమరావతిని ఈ స్టేజ్ లో తప్పించటం జగన్ కాదు కాదా, ఆయన తాత తరం కూడా కాదని సుజనా అన్నారు.
అసలు జగన చేసిన ప్రకటన, మూడు రాజధానుల వ్యవమారం హాస్యాస్పదంగా ఉందని, అయుదు ఉప ముఖ్యమంత్రులను పెట్టుకున్నట్లు, ఇష్టం వచ్చినట్టు రాజధానులు పెట్టుకోవటం కుదరదని అన్నారు. 33 వేల ఎకరాలు ఇచ్చిన చోట, కేవలం అసెంబ్లీ మాత్రమే పెడతాం అంటే, దానిని రాజధాని అనరని అన్నారు. ఈ మొత్తం విషయం ఇప్పటికే కేంద్రం ద్రుష్టిలో ఉందని, అధికారికంగా ప్రకటన చేస్తే, అప్పుడు కేంద్రం ఏమి చెయ్యాలో, అది చేస్తుందని అన్నారు. ఎక్కడైనా, ఎవరైనా అన్ని ప్రాంతాలు అభివృద్ధి అవ్వాలని కోరుకుంటారని, కాని ఇలనాటి నిర్ణయాలు ఎవరూ సమర్ధించరని అన్నారు. అలాగే, రాజధాని నిర్మాణానికి భూములిచ్చిన రైతులకు కేపిటల్ గెయిన్స్ పన్ను నుంచి మినహాయింపు కేంద్రం ఇచ్చిన విషయాన్ని గుర్తు చేస్తూ, ఇప్పుడు రాజధాని మార్చేస్తాం అంటే, కేంద్రం చూస్తూ ఊరుకుంటుందా అని ప్రశ్నించారు.