రాజధాని తరలింపును సమర్థిస్తూ, ర్యాలీలు, ధర్నాలు చేస్తున్న వైసీపీ ఎమ్మెల్యేలు , మంత్రులు నడిరోడ్లపైకొచ్చి అభినవకట్టప్పల్లా మారి అమరావతికి వెన్నుపోటు పొడుస్తున్నారని టీడీపీసీనియర్‌నేత, మాజీఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకుమార్ మండిపడ్డా రు. ఆదివారం ఆయన మంగళగిరిలోని పార్టీ కేంద్రకార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. పుట్టినప్రాంతానికి, కన్నతల్లి వంటి జన్మభూమికి ద్రోహం చేస్తున్న అధికార పార్టీనేతలంతా అమరావతి ద్రోహులుగా మిగిలిపోయారన్నారు. అధికారంలోకి రాకముందు ఒకలా, గద్దెనెక్కాక మరోలా మాట్లాడటం జగన్‌కు బాగా వంటపట్టిందని, ఆవిద్యతోనే ఆయన ప్రజల్ని మోసం చేస్తున్నాడని నరేంద్ర దుయ్యబ ట్టారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇచ్చిన హామీలన్నింటినీ ప్రజలు మర్చిపోయేలా చేయడానికి రోజుకోవిధంగా కపటనాటకాలు ఆడటం జగన్‌కు అలవాటుగా మారిందన్నారు. అభివృద్ధి వికేంద్రీకరణ పేరుతో పాలనావ్యవస్థను ముక్కలు చేయడం, రాజధానిని విభజించడం ఎంతవరకు సమంజసమని నరేంద్ర ప్రశ్నించారు. కర్నూల్లో హైకోర్టు పెడితే రాయలసీమ ఎలా అభివృద్ధి చెందుతుందని, ఇప్పటికే అన్నిరంగాల్లో ముందంజలోఉన్న విశాఖజిల్లాలో రాజధానిపెడితే, అక్కడేం ఒనగూరుతుందని ధూళిపాళ్ల నిలదీశారు. అభివృద్ధిలో అన్ని జిల్లాలకంటే, విశాఖ అత్యున్నతస్థానంలోనే ఉందన్నారు. రాబోయేరోజుల్లో విశాఖ వాసులు ధృతరాష్ట్రకౌగిలిలో చిక్కుకోబోతున్నారనే విషయాన్ని ఆప్రాంతవాసులకు ఇప్పటికే అర్థమైందన్నారు. ప్రపంచంలో ఎక్కడాకూడా ఈ విధమైన విభజన జరగలేదని, కేంద్రప్రభుత్వం కూడా పరిపాలనావ్యవస్థలన్నింటినీ ఒకేచోట కేంద్రీకృతం చేస్తోందన్నారు. ప్రధాని నివాసం, ఉపరాష్ట్రపతి, రాష్ట్రపతుల నివాసాలు, అన్నిరకాల డైరెక్టరేట్లు ఒకేచోట ఉండేలా ఇప్పటికే ప్రణాళికలు రూపొందిచా రని ధూళిపాళ్ల పేర్కొన్నారు. జగన్ నిర్ణయాలను సమర్థిస్తూ, మూడురాజధానులు అద్భుతమని పొగిడిన కేసీఆర్, తనరాష్ట్రాన్నికూడా ఉత్తర, దక్షిణ, మధ్య ప్రాంతాలుగా విభజిస్తాడా అని నరేంద్ర నిలదీశారు. రాష్ట్రంలోని ఆందోళనలవల్ల ఎక్కువగా లాభపడు తోంది తెలంగాణ రాష్ట్రమేనన్నారు. ఏపీలో రగిలిన మంటల్లో తెలంగాణ చలికాచుకుం టోందని, 13జిల్లాలకే మూడు పరిపాలనాకేంద్రాలుంటే, 33జిల్లాలకు ఎన్ని కేంద్రాలుం డాలో, ఆవిధంగా చేయడానికి తెలంగాణ సర్కారు ముందుకెళుతుందా అని టీడీపీ నేత ప్రశ్నించారు.
కేంద్రంలో ఎల్లయ్య ఉన్నా, పుల్లయ్యఉన్నా చొక్కాపట్టుకొని నిలదీసి రాష్ట్రానికి ప్రత్యేకహోదా తీసుకొస్తానన్న జగన్, ఇప్పుడు ప్లీజ్‌ప్లీజ్ అంటూ మోదీకాళ్లు పట్టుకునే స్థితికి చేరాడని నరేంద్ర ఎద్దేవాచేశారు. రాష్ట్రమంతా రాజధాని కేంద్రంగా రగులుతుంటే, ఆప్రాంతంలో వేలాదిమందిపోలీసుల్ని నియమించి, వారిబూట్లకింద ప్రజలు నలిగిపోయేలా ప్రభుత్వం చేస్తోందన్నారు. రైతులంతా కన్నీళ్లతో వేడుకుంటున్నా జగన్‌ప్రభుత్వం ఎందుకు మూర్ఖత్వంతో వ్యవహరి స్తోందని నరేంద్రప్రశ్నించారు. తనకున్న ఎంపీల బలంలో ఎన్‌ఆర్సీ, సీ.ఏ.ఏ బిల్లులకు పార్లమెంట్‌లో మద్ధతుతెలిపిన జగన్మోహన్‌రెడ్డి, రాష్ట్రంలో మాత్రం 102జీవో జారీ చేశాడన్నారు. ముస్లింమైనారిటీలకు ద్రోహం చేశాడుకాబట్టే, జగన్ తనపార్టీలోని ఆయావర్గానికి చెందిన ప్రజాప్రతినిధులకు ముఖం చూపించడంలేదన్నారు. ఎన్నికలకు ముందు ముస్లింలకు అండగాఉంటామని చెప్పినజగన్, అధికారంలోకి రాగానే వారిని నడిసముద్రంలో ముంచేశాడని నరేంద్ర ఆక్షేపించారు. పింఛన్లు రూ.3వేలకు పెంచుతాన ని చెప్పి, రూ.2,250కే పరిమితం చేశాడని, 45ఏళ్లకే పింఛన్ ఇస్తానని చెప్పి మోసం చేశాడని, అన్నక్యాంటీన్లు మూసేశాడని ఇలా అనేక విషయాల్లో జగన్ చెప్పేమాటలకు చేస్తున్నపనులకు పొంతనలేకుండా పోయిందన్నారు.
రాజధాని అంశంలో నేడుజరగబో యే అసెంబ్లీసాక్షిగా జగన్ ప్రజలకు అరచేతిలో వైకుంఠం చూపేప్రయత్నాలు ప్రారంభిం చాడన్నారు. ప్రజల్ని ఏమార్చడం కోసం తనవిషపుత్రిక సాక్షిలో తమపై అసత్యప్రచారం చేస్తూ, తమగొంతునొక్కే ప్రయత్నాలు మొదలయ్యాయన్నారు. ఇన్‌సైడ్‌ట్రేడింగ్‌పేరుతో తనకుమార్తెపై విషప్రచారం చేసేక్రమంలో సాక్షిపత్రికలో అభూతకల్పనలతో, అసత్యాలు వండివార్చారని నరేంద్ర మండిపడ్డారు. తన కుమార్తెకు తెల్లకార్డు ఉందని, ఆమెకు అమరావతిలో భూమిఉందని చెబుతూ, సాక్షిని అడ్డంపెట్టుకొని, జగన్ అసత్యాలపై బతుకుతున్నాడన్నారు. ఎన్నిరోజులు ఇలా కుల, మతరాజకీయాలు చేస్తూ జగన్ పబ్బం గడుపుకుంటాడని నరేంద్ర ప్రశ్నించారు. జగన్ ఉంటున్న ఇల్లు ఆయనదికాదని, ఇల్లుఉన్న తాడేపల్లి ప్రాంతంలో, పక్కనున్న నంబూరు, కాజలో ఏవర్గాలవారున్నారో జగన్ సమాధానం చెప్పాలన్నారు.
రాజధానివల్ల సామాజికవర్గాలకు అతీతంగా అంద రూ లబ్ధిపొందారన్నారు. ఆస్తులేవైనా ఉంటే అవితనపేరుతో, తనపిల్లలపేరుతోనే ఉంటాయని, జగన్‌లా తానేమీ బినామీలపై ఆధారపడి బతకడంలేదని నరేంద్ర తేల్చి చెప్పారు. జగన్‌కే బెయిల్‌కార్డు, బినామీకార్డు, జైల్‌కార్డున్నాయని, ఆయన నివాసం హరీశ్‌ఇన్‌ఫ్రా, భారతిపేరుతో ఉందన్నారు. బినామీ బతుకుబతికే వ్యక్తి, తమగురించి ఇష్టానుసారం ఎలా మాట్లాడతాడని, ఎలా వార్తలు రాయిస్తాడని ధూళిపాళ్ల మండిపడ్డా రు. అసత్యాలతో ప్రజలమధ్య అపోహలు, వైషమ్యాలు రెచ్చగొట్టేపనిలో జగన్‌ఉన్నాడని, ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని ఆయన హితవుపలికారు. 2004లో వైఎస్ ముఖ్యమం త్రి అయ్యేనాటికి జగన్ ఆస్తులెన్ని, తండ్రి అధికారంనుంచి దిగిపోయేనాటికి ఆయనకు ఆయన కుటుంబానికి ఉన్న ఆస్తులెన్ని అనేదానిపై ఆయనచర్చకు వస్తాడా అని నరేంద్ర ప్రశ్నించారు. జగన్ నిజంగా ధైర్యవంతుడయితే ఈ అంశంపై బహిరంగంగా చర్చకు రావాలని నరేంద్ర సవాల్‌విసిరారు. ఏ అధికారి అయినాసరే, జగన్మోహన్‌రెడ్డి ఆదేశాలకు అనుగుణంగా, గుడ్డిగా పనిచేస్తే, వారంతా కోర్టులచుట్టూ తిరగకతప్పదని ఆయన హెచ్చరించారు.
తామేదైనా తప్పుచేసుంటే, ఏవిచారణ జరిపినా ఎదుర్కోవడానికి తాముసిద్ధంగానే ఉన్నామన్నారు. కండీషన్ బెయిల్‌పై బయటతిరుగుతున్న ఏ2ముద్దాయి ఏహోదాలో ప్రధానికి లేఖలు రాశాడన్నారు. సీబీఐ కేసులో ఏ2గా ఉన్న విజయసాయి కోర్టులను, ప్రభుత్వసంస్థలను, అధికారులను ప్రభావతంచేసేలా లేఖలు ఎలారాస్తాడని, వ్యవస్థలను ఎలా ప్రభావితం చేస్తాడని నరేంద్ర నిలదీశారు. అధికారయంత్రాంగాన్ని దుర్వినియోగం చేస్తున్న జగన్, విజయసాయిల గురించి సీబీఐకి, ఈడీకి, సుప్రీంకోర్టుకి లేఖలు రాస్తామన్నారు. ప్రజలను ఏమార్చడానికి, మైమరపించడానికి ఈప్రాంతానికి వెయ్యికోట్లు, ఆప్రాంతానికి మరోవెయ్యికోట్లని అసెంబ్లీ సాక్షిగా మోసం చేయడానికి జగన్ సిద్ధమయ్యాడన్నారు. అసత్యాలు, అబద్ధాల కలయికలోనుంచి పుట్టిన సాక్షి కథనాలు నమ్మకుండా, కులాలు, మతాలపేరుతో జరుగుతున్న ప్రచారాన్ని పట్టించుకో కుండా, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని నరేంద్ర హితవుపలికారు. వ్యక్తులు తప్పుచేస్తే వారిపై చర్యలు తీసుకోవాలిగానీ, కులాలు, మతాలప్రస్తావన ఎందుని ఆయన ప్రశ్నించారు. బెయిల్‌పక్షులన్నీ ఒకేగూటికిచేరేలా తమవంతు ప్రయత్నాలు చేస్తామని, జగన్ తనపైఉన్న కేసులనుంచి పునీతుడయ్యాక, ఎదుటివారిగురించి మాట్లా డాలని ధూళిపాళ్ల సూచించారు.