జగన్ మోహన్ రెడ్డి సెక్యూరిటీకి, రేపటి అసెంబ్లీ టెన్షన్ పట్టుకుంది. రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు వెలగపూడిలో జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే, జగన్ మోహన్ రెడ్డి కాన్వాయ్, అసెంబ్లీకి వెళ్ళాలి అంటే, మందడం మీదుగా వెళ్ళి. అయితే గత 33 రోజులుగా జరుగుతున్న అమరావతి రైతుల ఆందోళన నేపధ్యంలో, అలాగే రేపు అసెంబ్లీ ముట్టడికి పిలుపిచ్చిన నేపధ్యంలో, రేపు ఎలా గట్టెక్కించాలా అని పోలీసులు వ్యూహాలు పన్నుతున్నారు. దీంతో ఇప్పటికే అమరావతి అసెంబ్లీకి వెళ్ళటానికి, వేరే రోడ్ కూడా వేసారు. ఈ కొత్త రోడ్డు ద్వారా, అసెంబ్లీకి తేలికగా చేరుకోవచ్చని, ప్రభుత్వం వ్యూహంగా ఉంది. అయితే రేపటి అసెంబ్లీ సమావేశాల కోసం, ఇప్పటి నుంచి, జగన్ సెక్యూరిటీ సిద్ధం అవుతుంది. తాడేపల్లిలోని జగన్ నివాసం నుంచి, అసెంబ్లీకి, వెళ్ళే మార్గంలో, ఇప్పటికే జగన్ కాన్వాయ్ ట్రయల్ రన్ చేసారు. అలాగే, దారి పొడుగునా పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో, అయితే, మూడంచెల భద్రత వ్యవస్థను ఏర్పాటు చేసారు.
ఎక్కడైతే సమస్యాత్మక గ్రామాలు ఉన్నాయో చెక్ పోస్టులు ఏర్పాటు చేసి, తనిఖీ చేసి పంపిస్తున్నారు. ఇప్పటికే అందరికీ 149 సీఆర్పీసీ నోటీసులు వెళ్ళాయి. బయట వ్యక్తులు ఎవరూ ఊరిలో ఉండకూడదు అంటూ నోటీసులు కూడా ఇచ్చారు. అన్ని ఏర్పాట్లు తీసుకుంటున్నారు. ఇక మరో పక్క, మూడు రాజధానుల ప్రతిపాదన, CRDA చట్టం రద్దు బిల్లులు.. శాసనసభతో పాటు.... మండలిలో గట్టెక్కడంపై ప్రభుత్వం తర్జనభర్జన పడుతోంది. బిల్లులు ఆమోదం కోసం అసెంబ్లీ అనుసరించాల్సిన వ్యూహంపై..ముఖ్యమంత్రి జగన్ పలువురు మంత్రులతో చర్చించారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో జరిగిన భేటీలో ఉపముఖ్యమంత్రి మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్, మండలిలో వైకాపా పక్షనేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు హాజరయ్యారు.
మండలిలో వైకాపాకు బలం తక్కువగా ఉండటంతో బిల్లులను గట్టెక్కించడంపై సమాలోచనలు జరిపారు. మండలిలో ఇబ్బందులు ఎదురైతే ఏం చేయాలనే దానిపైనా దృష్టి సారించారు. ఇదే సమయంలో అసెంబ్లీలో రేపు ప్రవేశపెట్టే బిల్లులపై ప్రభుత్వం అత్యంత గోప్యత పాటిస్తోంది. ఇక మరో పక్క, ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన ముగ్గురు రైతులు, అమరావతి రాజధానిని తరలించ వద్దు అంటూ, అమరావతిలో నిర్మాణంలో ఉన్న ఎమ్మెల్యే క్వార్టర్స్ పైకి ఎక్కారు. ఎమ్మెల్యే క్వార్టర్స్ లో 13వ అంతస్తుకు ఎక్కిన వాళ్ళు, అమరావతిని ఇక్కడే ఉంచుతాం అని చెప్పే దాకా, దిగమని, స్పష్టమైన హామీ ఇవ్వకపోతే, ప్రాణత్యాగానికైనా వెనుకాడేదిలేదని నినాదాలు చేస్తున్నారు. అయితే, వారిని దించే ప్రయత్నం చేస్తున్నా, ఇప్పటి వరకు ఫలించలేదు.