అమరావతి రాజధానిని నిర్వీర్యం చేసి, మూడు రాజధాణులుకు సంబంధించి జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం పన్నిన వ్యూహాన్ని, శాసనమండలిలో అడ్డుకునే దిశగా తెలుగుదేశం పార్టీ అడుగులు వేస్తుంది. దీనిపై తమ వ్యూహాలకు టిడిపి పార్టీ నేతలు పదును పెడుతున్నారు. అసెంబ్లీలో వైసీపీకి, శాసనమండలిలో తెలుగుదేశం పార్టీకి మెజారిటీ ఉండటంతో, అసెంబ్లీలో వైసీపీ తమను మాట్లాడనివ్వకుండా బుల్ డోజ్ చేసినా, శాసనమండలిలో అడ్డుకోవాలని, ప్రజలకు అన్నీ అక్కడ వివరించాలని తెలుగుదేశం పార్టీ భావిస్తుంది. అయితే అసెంబ్లీలో బిల్లుల ఆమోదం పొందటంలో అసెంబ్లీదే పైచేయి అవుతుంది. ఒకసారి శాసనమండలి బిల్ తిప్పి పంపిస్తే, రెండో సారి మళ్ళీ అసెంబ్లీ బిల్ చేస్తే, ఇక శాసనమండలికి తిప్పి పంపించే అవకాసం ఉండదు. అయినప్పటికీ తన వ్యతిరేకతను తెలియజేయడానికి, ఈ ప్రక్రియ కొంత కాలమా జాప్యం చేసి, ఢిల్లీ లెవెల్ లో చెక్ పెట్టటానికి, తెలుగుదేశం పార్టీ శాసనమండలి ద్వారా, జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వానికి చెక్ పెట్టటానికి రెడీ అయ్యింది.
ఈ ప్రక్రియ ద్వారా, తాము మూడు ముక్కల రాజధానికి ఎందుకు వ్యతిరేకం, దాని వల్ల, ఏ ఉపయోగం ఉండదు, అలాగే రాజధాని రైతుల సమస్యల గురించి కూడా ప్రజలకు వివరంగా చెప్పాలని టీడీపీ భావిస్తోంది. అయితే శాసనమండలిలో తిప్పి పంపకుండా, ఎక్స్పర్ట్ కమిటీకి రిఫర్ చేస్తే, ఒక నెల రోజులు పాటు, ఈ ప్రక్రియ ఆపవచ్చని, తద్వారా, ప్రభుత్వం తీసుకున్న ఈ తిక్క నిర్ణయం గురించి, ప్రజల్లో మరింత చర్చ జరిగి, ఢిల్లీ స్థాయిలో, జోక్యం చేసుకునే అవకాసం ఉంటుందని, తెలుగుదేశం భావిస్తుంది. అసెంబ్లీ, శాసనమండలిలో ఎలాంటి వాదనలు వినిపించాలి, ఎలాంటి వ్యూహం అనుసరించాలి అనే దాని పై, ఇప్పటికే తెలుగుదేశం పార్టీ శాసనసభా పక్షం ఈ రోజు సమావేశం అయ్యింది.
శాసనసభలో ఎలాంటి వదనలు వినిపించాలి, తమకు మైక్ ఇవ్వకపోతే ఏమి చెయ్యాలి అనే దాని పై, అలాగే శాసనమండలిలో తమ అభిప్రాయం వినిపించడంతో పాటు బిల్లులను ఎలా ఆపాలి అనే దాని పై చర్చిస్తున్నారు. రాజధాని మార్పు అంటూ నేరుగా ప్రభుత్వం బిల్లులో చెప్పదని తెలుగుదేశం పార్టీ భావిస్తుంది. అల చేస్తే, రైతులకు పరిహారం ఇవ్వాలి కాబట్టి, అలా చెయ్యదని, పరిపాలనా వికేంద్రీకరణ పేరుతో ఈ బిల్లు వచ్చే అవకాసం ఉందని టిడిపి భావిస్తుంది. అయితే, ఈ బిల్లులను ద్రవ్య బిల్లు రూపంలో తెద్దామని ప్రభుత్వం భావించారు. ఇలా అయితే మండలిలో అడ్డుకోలేదని భావించారు. అయితే, ద్రవ్యబిల్లుగా తెస్తే ముందు దాన్ని గవర్నర్ కు పంపి అనుమతి తీసుకోవాలి. అయితే గవర్నర్ పరిశీలన చేయాల్సి ఉంటుందని చెప్పటంతో ప్రభుత్వం వెనక్కు తగ్గింది. మరి శాసనమండలిలో ఎలా ఉంటుందో చూడాలి.