ఆంధ్రప్రదేశ్ రాజకీయాల పై, కేసీఆర్ వేలు పెడుతూనే ఉన్నారు. ఏపిని తన ఆధీనంలోకి తీసుకువటానికి, పన్నుతున్న పన్నాగాలు చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు తాజాగా నర్సంపేటలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఏపీ ఎన్నికల్లో గెలుపోటముల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏపీలో వైసీపీ విజయం ఖాయమని కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఫెడరల్ ఫ్రంట్‌లోకి జగన్ వస్తారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ దేశంలో కాంగ్రెస్ అంటే పడనోళ్లు, బీజేపీ అంటే పడనోళ్లు చాలామంది ఉన్నారని చెప్పారు. పశ్చిమబెంగాల్‌లో మమతాబెనర్జీ, ఏపీలో జగన్, ఒడిస్సాలో నవీన్ పట్నాయక్, ఉత్తరప్రదేశ్‌లో మాయావతి, అఖిలేష్ యాదవ్‌ ఫెడరల్ ఫ్రంట్‌తో కలిసి పనిచేస్తారని కేటీఆర్ చెప్పుకొచ్చారు.

ktr jagan 30032019

కొద్ది రోజుల క్రితం, కేసీఆర్ కూతురు కవిత మాట్లాడుతూ, ‘రిటర్న్ గిఫ్ట్’ విషయంలో ఏపీ సీఎం చంద్రబాబుకు కంగారొద్దని పేర్కొన్నారు. గిఫ్ట్ విషయంలో కంగారుపడొద్దని ఇవ్వాల్సిన టైంలో సీఎం కేసీఆర్ రిటర్న్‌ గిఫ్ట్‌ ఇస్తారన్నారు. ఇప్పుడు మాకు తెలంగాణ ప్రజలు ముఖ్యమన్నారు. కేసీఆర్‌ని చంద్రబాబు చాలా మిస్ అవుతున్నట్టు ఉన్నారని.. ఆయన విమర్శలకు కేసీఆర్ త్వరలోనే స్పందిస్తారని కవిత స్పష్టం చేశారు. మాకు ఎవరితోనూ యుద్ధం లేదని తెలంగాణను దెబ్బతీసే వారితోనే మా యుద్ధమని ఎంపీ కవిత చెప్పుకొచ్చారు.

ktr jagan 30032019

అయితే చంద్రబాబు ప్రతి సభలో కేసీఆర్ ఆంధ్రా వారి పై చేస్తున్న అన్యాయాన్ని ఎండగడుతున్నారు. ‘‘తప్పుడు ఒప్పందాలు చేసుకుంటున్న వారంతా నాకు రిటన్‌ గిఫ్ట్‌ ఇస్తారంట! వారు ఇస్తే తిరిగి మనంకూడా ఇవ్వాలికదా... అందుకే రాష్ట్రంలోని 5 కోట్ల మంది ఒకే మాట, ఒకే తాటిపైకొచ్చి తెలుగుదేశాన్ని గెలిపించి... దానిని వారికి గిఫ్ట్‌గా ఇవ్వాలి’’ అని చంద్రబాబు పిలుపునిచ్చారు. ‘‘విభజన తర్వాత సీమాంధ్రకు దక్కాల్సిన దాదాపు రూ.లక్ష కోట్లు కొట్టేసిన కేసీఆర్‌... మన రాష్ట్రానికి రూ.500 కోట్లు ఇవ్వాలనుకున్నారట! మోదీయే మట్టీ నీళ్లు ఇస్తే నేనేమిచ్చేదని ఎగతాళిగా మాట్లాడతుంటే మీకు రోషం, కోపం రావడంలేదా తమ్ముళ్లూ! సీమాంధ్రులను రాక్షసులన్న కేసీఆర్‌కు బుద్ధి చెబుతారా... లేదా?’’ అని చంద్రబాబు ప్రశ్నించడంతో... ‘చెబుతాం’ అని జనం ముక్తకంఠంతో సమాధానం చెప్తున్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read