వైఎస్ వివేకది కేవలం ఎదో ఆవేశంలోనో, పధకం ప్రకారం చేసిన హత్య మాత్రమే కాదు, అంతకు మించి అంటూ పోలీస్ రిమాండ్ రిపోర్ట్ లో సంగతులు చెప్తున్నాయి. ఆయన్ను చంపే ముందు అత్యంత క్రూరంగా కొట్టి కొట్టి చంపారు. ‘‘ వైఎస్‌ వివేకానందరెడ్డి మృతదేహంపై ఏడు చోట్ల పదునైన, లోతైన గాయాలున్నాయి. తలకైన తీవ్ర గాయాలు కనిపించకుండా బ్యాండేజీ వేశారు. వీటన్నింటినీ విశ్లేషించిన తర్వాత అత్యంత క్రూరంగా వివేకానుహింసించి...ప్ర మాదకరమైన ఆయుధంతో ఆయన తలపై దాడి చేసి చంపినట్లు తేలింది. హత్యకు పాల్పడిన దోషులెవరో తుమ్మలపల్లి గంగిరెడ్డి అలియాస్‌ ఎర్ర గంగిరెడ్డి, ములి వెంకటకృష్ణారెడ్డి, ఎద్దుల ప్రకాశ్‌లకు తెలుసు. హత్య చేసిన వారిని చట్టం నుంచి తప్పించేందుకు వీరు ముగ్గురు ఉద్దేశపూర్వకంగానే నేర ఘటనాస్థలం నుంచి సాక్ష్యాధారాలను తుడిచేసి..మాయం చేశారు. ఈ హత్యలో మరికొందరు వ్యక్తుల పాత్రపైనా అనుమానాలున్నాయి. ఇంకా చాలా మంది సాక్షులను విచారించాల్సి ఉంది. సాక్ష్యాధారాలను సేకరించాల్సి ఉంది.’’ అని వివేకా హత్యకేసులో పైన పేర్కొన్న నిందితుల అరెస్టుకు సంబంధించి పోలీసులు దాఖలు చేసిన రిమాండు రిపోర్టు వెల్లడించింది.

game 27032019

పులివెందుల ఫస్ట్‌క్లాస్‌ జ్యుడీషియల్‌ మెజిస్ట్రేట్‌ న్యాయస్థానంలో దీన్ని వేశారు. సాక్ష్యాధారాలు తుడిచేసినందుకు వీరిపై ఐపీసీ సెక్షన్‌ 201ను కూడా జతపరచి..త్వరలో న్యాయస్థానంలో మెమో దాఖలు చేయనున్నామన్నారు. వివేకా హత్యపై జరిపిన దర్యాప్తు ఆధారంగా.. ఆయనను అత్యంత కిరాతకంగా హింసించి, ప్రమాదకరమైన ఆయుధంతో తలలోపల మెదడుకు దెబ్బతగిలేలా కొట్టి దారుణంగా హత్య చేశారనే నిర్ణయానికి వచ్చినట్టు రిమాండ్‌ రిపోర్టులో పేర్కొన్నారు. ఈ హత్యకు పాల్పడిన వ్యక్తి చట్టం చేతుల నుంచి తప్పించుకునేందుకు అవకాశం కల్పించేలా సాక్ష్యాలను మాయం చేసేందుకు పైన పేర్కొన్న ముగ్గురు నిందితులూ ప్రయత్నించారనేందుకు ఆధారాలు లభించినట్టు తెలిపారు. దర్యాప్తులో తేలిన అంశాలను బట్టి.. వివేకాను చంపిందెవరో ఆ ముగ్గురికీ తెలుసనిపిస్తోందని, అందుకే వారు కావాలనే సాక్ష్యాధారాలు చెరిపేసే ప్రయత్నం చేశారని పేర్కొన్నారు. ఈ హత్యకు సంబంధించి మరింతమందిని విచారించి మరిన్ని సాక్ష్యాలు సేకరించాల్సి ఉందని.. నిజాన్ని వెలికితీయాల్సి ఉందని పేర్కొన్నారు.

game 27032019

నిందితులకు బెయిల్‌ ఇస్తే కేసును తారుమారు చేసే అవకాశం ఉంది కాబట్టి వారు పోలీసు కస్టడీలోనే ఉండాలని స్పష్టంచేశారు. అత్యంత కిరాతకంగా ఈ హత్య చేసిన ప్రధాన నిందితుడి గుర్తింపును బయటపెట్టాల్సి ఉందని.. ఈ మిస్టరీని ఛేదించేందుకు తాము చేయాల్సింది చాలా ఉందని పేర్కొన్నారు. సాక్ష్యాలను మాయం చేసే ప్రయత్నం చేసిన గంగిరెడ్డి, వెకటకృష్ణారెడ్డి, ప్రకాశ్‌లపై ఐపీసీ 201 కింద కేసు నమోదు చేసినట్టు వెల్లడించారు. పులివెందుల పోలీసుస్టేషన్‌లో పనిచేసే ఎస్‌ఐలు శివప్రసాద్‌, రఘురామ్‌, పీసీలు 913, 2803, 1409లు బెస్తవారిపల్లె వై.జంక్షన్‌ వద్ద రోడ్డుపై నిలుచుని ఉన్న ఆ ముగ్గురిని గురువారం ఉదయం 10గంటలకు అదుపులోకి తీసుకున్నారని.. విచారణలో వారు నోరు తెరవట్లేదని.. అందుకనే 15 రోజుల పాటు పోలీసు కస్టడీకి ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నామని రిమాండు రిపోర్టులో డీఎస్పీ నాగరాజ పేర్కొన్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read