విభజన చట్టం అమలుపై త్వరలోనే శ్వేతపత్రం విడుదల చేస్తామని, ప్రధాని మోదీ చెప్పినవన్నీ పచ్చి అబద్ధాలని నిరూపిస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయాధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అన్నారు. ఎలక్షన్ మిషన్ 2019పై ఆయన టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా పలు ఆసక్తిక విషయాలను పంచుకున్నారు. అంతేకాదు, టీడీపీ నాయకులు, కార్యకర్తలకు దిశానిర్ధేశం చేశారు. వైసీపీ, బీజేపీపై ప్రజల్లో నమ్మకం పోయిందని, మోదీని, జగన్‌ను జనం విశ్వసించడం లేదని ఆయన పేర్కొన్నారు. కర్నూలు సభలో మోదీ కక్ష మరోసారి బయటపడిందన్నారు. బీజేపీ ఎంతో చేసిందని మోదీ చెప్పడం మరో మోసమని, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఆయన చేసిన ద్రోహం తీరనిదని చంద్రబాబు ఆరోపించారు.

modilies 30032019

అంతేకాదు, దేశంలోని ప్రజాస్వామ్య వ్యవస్థలను ప్రధాని భ్రష్టు పట్టించారని, అవినీతిపరులకు రెడ్ కార్పెట్ వేశారని సీఎం చెప్పుకొచ్చారు. అభివృద్ధిపై బీజేపీ వక్రభాష్యాలను ప్రజలు నమ్మరని అభిప్రాయపడ్డారు. బీజేపీ రాష్ట్రాలలో డబుల్ ఇంజన్లతో మోదీ ఏం సాధించారని, రైతుల్లో అశాంతి సృష్టించడమా డబుల్ ఇంజన్లతో సాధించిందని ఆయన ప్రశ్నించారు. సన్‌సెట్‌ ఏపీ అంటూ ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలపై చంద్రబాబు ఆగ్రహించారు. కష్టపడి శ్రమతో అభివృద్ధి చేసుకుంటున్న రాష్ట్రంపై ఇంత అక్కసా అని ప్రశ్నించారు. కర్నూలు సభలో రాష్ట్రంపై మోదీకి ఉన్న ద్వేషం మరోసారి బయటపడిందని ఆక్షేపించారు. ధైర్యముంటే చెప్పినదానికి, చేసిన దానికి శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు.

modilies 30032019

వాళ్లు చేయకుంటే మనమే శ్వేతపత్రం విడుదల చేద్దామని, వాళ్లు ఢీ అంటే మనమూ ఢీ అందామని పార్టీ నేతలతో సీఎం అన్నారు. మోదీ సభకు వైకాపా కార్యకర్తలను తరలించడాన్ని తప్పుబట్టారు. రాష్ట్రానికి ఏమీ చేయకపోగా.. నిందలు మోపుదామనుకుంటే సహించొద్దని పిలుపునిచ్చారు. ప్రజలు తెదేపా పట్ల సానుకూలంగానే ఉన్నారన్న అతి విశ్వాసం నాయకులకు తగదని సూచించారు. చివరి వరకూ అందరూ కష్టపడాల్సిందేనని, ఏ ఒక్క అవకాశాన్ని వదులుకోవద్దని సూచించారు. ఈసారి ఇన్‌ఛార్జిల వ్యవస్థ ఉండబోదని అధినేత తేల్చిచెప్పారు. ప్రజల్లో పార్టీ గెలుపు ఏకపక్షంగా ఉందని, దీన్ని అదునుగా చూసుకుని ఎవరైనా కష్టపడకుంటే ఉపేక్షించబోనని హెచ్చరించారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read