టీడీపీకి చెందిన కొందరు అభ్యర్థులపై జరుగుతున్న ఐటీ దాడుల విషయంలో ఆదాయపు పన్నుశాఖ అధికారులను వివరణ కోరామని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి(సీఈవో) గోపాలకృష్ణ ద్వివేది వెల్లడించారు. ఎన్నికల సమయంలో ఐటీ దాడులు జరగవచ్చా? లేదా? అనేది నియమావళిలో లేదన్నారు. అయితే, దాడులు జరిగినా.. అవి రాజకీయ కోణంలో ఉండకూడదని అభిప్రాయపడ్డారు. ఈ మేరకు గురువారం సచివాలయంలో మీడియాతో మాట్లాడారు. ఐటీ దాడులపై టీడీపీ నేతలు తనకు ఫిర్యాదు చేసినట్టు చెప్పారు. దీనిపై అధికారులను వివరణ కోరామని, నివేదిక అందాక తదుపరి చర్యలు ఉంటాయని తెలిపారు. అయితే టిడిపి నేతలు మాత్రం అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మేము ఏది ఫిర్యాదు చేసినా, మా పరిధిలో లేదు, కారణం చెప్పనవసరం లేదు అంటారని, వైసీపీ ఏదన్నా చెప్తే, నిమషాల మీద ఆక్షన్ తీసుకుంటారని అంటున్నారు.

game 27032019

ఇక మరో పక్క ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థులు చేసే వ్యయంపై నిశితంగా పరిశీలిస్తున్నట్టు ద్వివేది చెప్పారు. ఆదాయపన్ను శాఖలో అత్యున్నత స్థాయిలో పని చేసిన అధికారి ప్రత్యేక వ్యయ పరిశీలకులుగా శుక్రవారం రాష్ట్రానికి రానున్నారని తెలిపారు. డమ్మీ బ్యాలెట్‌ యూనిట్లను రాజకీయ పార్టీలు తయారు చేసుకుని ఓటర్లకు అవగాహన కల్పించవచ్చన్నారు. ఏ ప్రభుత్వ పథకమైనా షెడ్యూల్‌కు ముందే లబ్ధిదారులను ఎంపిక చేసి ఉంటే ఎన్నికల సమయంలో అమలుకు ఇబ్బందిలేదన్నారు. ఎన్నికల విధులు నిర్వర్తించనున్న ఉద్యోగులకు అన్ని అంశాల్లోనూ క్షుణ్ణంగా శిక్షణ ఇస్తున్నట్టు చెప్పారు. ఓటరు ఒకసారి మా త్రమే ఓటు వినియోగించుకునేలా మార్క్‌డ్‌ కాపీని త యారు చేస్తున్నట్టు చెప్పారు. ప్రలోభాలకు లొంగకుండా స్వేచ్ఛాయుతంగా ఓటు వేయాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. నగదు, వస్తువుల పంపిణీపై నిఘా బృందాలు ప్రత్యేక దృష్టి సారించాయన్నారు. రాష్ట్రంలోని పోలింగ్‌ కేంద్రాల్లో మూడో వంతు కేంద్రాలు సమస్యాత్మకంగా ఉన్నాయని, వాటి వద్ద భద్రతను కట్టుదిట్టం చేశామన్నారు.

game 27032019

పోలీస్‌ దాడుల్లో ఇప్పటి వరకు రూ.97.26 కోట్ల నగదు, 92 కేజీల బంగారం, 267 కేజీల వెండి, పట్టుకున్నట్టు సీఈవో ద్వివేది తెలిపారు. 1,203 కేజీల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారని చెప్పారు. రూ.5.46 కోట్ల విలువైన విలువైన వివిధ రకాల వస్తువులు పట్టుకున్నామన్నారు. 999 వాహనాలను సీజ్‌ చేసినట్టు తెలిపారు. ఎక్సైజ్‌శాఖ రూ.21 కోట్ల విలువైన మద్యాన్ని సీజ్‌ చేసిందన్నారు. ఈ నెల 11న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్‌ నిర్వహిస్తామన్నారు. నక్సల్‌ ప్రభావిత ప్రాంతాల్లో సాయంత్రం 4 గంటల వరకు, నక్సల్స్‌ ప్రభావిత ప్రాంతాల సరిహద్దుల్లో 5 గంటల వరకు పోలింగ్‌ నిర్వహిస్తున్నట్టు చెప్పారు. ఎన్నికల కోడ్‌ ఉల్లంఘనలపై తనకే కాకుండా జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, ఎన్నికల పరిశీలకులకూ ఫిర్యాదు చేయవచ్చునని ద్వివేది తెలిపారు. 13 మంది సీనియర్‌ పోలీస్‌ అధికారులు పోలీస్‌ పరిశీలకులుగా ఉన్నారు. వారి వివరాలు www.ceoandhra.nic.in వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయన్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read