ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల వేళ కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) సంచలన నిర్ణయం తీసుకుంది. ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) అనిల్ చంద్ర పునేఠాను బదిలీ చేసింది. కొత్త సీఎస్‌గా 1983 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారి ఎల్వీ సుబ్రహ్మణ్యంను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. పునేఠాను ఎన్నికలతో సంబంధంలేని పోస్టులో నియమించాలని ఆదేశాల్లో స్పష్టంగా పేర్కొంది. ఇటీవల రాష్ట్రంలో ముగ్గురు ఐపీఎస్‌ల బదిలీల విషయంలో సీఎస్‌ను పునేఠాను కేంద్ర ఎన్నికల సంఘం దిల్లీకి పిలిపించింది. ఐపీఎస్‌ల బదిలీ అంశం తర్వాత రాష్ట్ర ప్రభుత్వం వెంటవెంటనే జారీచేసిన మూడు జీవోల విషయమై ఈసీఐ సుదీర్ఘ వివరణను కోరింది.
అనంతరం ఐపీఎస్ అధికారుల బదిలీపై రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది. ఎన్నికల విధులకు దూరంగా ఉంటున్న ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు కేసులో ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం అభ్యంతరాలు వ్యక్తంచేసిన విషయం తెలిసిందే. కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చిన ఆదేశాలు రాష్ట్ర ప్రభుత్వానికి వర్తించవని, ఆయన ఎన్నికల విధుల్లో లేరని జీవోలో పేర్కొన్నారు. వీటిపై వివరణ కోరిన ఈసీఐ ఆయనను తప్పిస్తూ నిర్ణయం తీసుకుంది. కొత్త సీఎస్‌గా ఎల్వీ సుబ్రహ్మణ్యంను నియమించింది ఎలక్షన్ కమిషన్. ఎల్వీ సుబ్రహ్మణ్యం జగన్ అవినీతి కేసుల్లో కూడా ఉన్నారు.