ఆంధ్రప్రదేశ్ లో కుట్రలు తారా స్థాయికి చేరుతున్నాయి. మోడీ, కేసీఆర్, జగన్ చేస్తున్న పన్నాగాలు, అడ్డు అదుపూ లేకుండా, సాగుతున్నాయి. ప్రజల అండ లేకపోవటంతో, వ్యవస్థలని అడ్డు పెట్టుకుని అరాచారం చేస్తున్నారు. ఈ నేపధ్యంలోనే, ఎన్నికలు సమీపిస్తున్న వేళ వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ఆడియో కలకలం రేపుతోంది. విజయసాయిరెడ్డికి సంబంధించి తాజాగా ఓ ఆడియో క్లిప్పింగ్ లీకైంది. ఈ ఆడియోతో వైసీపీ కుట్ర బట్టబయలైంది. ఎన్నికల్లో వైసీపీ గెలిచినట్లు, జగన్ సీఎం అయినట్లు కలల కనడం సరికాదని, 2014 లోనూ ఇలాగే ఊహించుకుని తప్పుచేశామని కుండబద్దలు కొట్టారు. మళ్లీ అదే తప్పును చేస్తున్నామని ఆడియోలో పేర్కొన్నారు.
మోదీ మనకేదో ఒరగబెడతారని, ఆయన సాయంతో అంతా అయిపోతుందని భ్రమపడటం సరికాదని ఆయన వ్యాఖ్యానించారు. మనమంతా సెట్ చేసుకొని, సిద్ధమయ్యాక ఇప్పుడొచ్చి మోదీ తాను చూసుకుంటానని అంటున్నారని, ఇన్నాళ్లూ ఆ మాట ఎందుకు చెప్పలేదని ఆడియోలో ప్రశ్నించారు. ఎన్నికల కోసం పూర్తిగా సిద్ధమయ్యాక తాను చూసుకుంటానని మోదీ అంటున్నారని, అయినా ఆయనను నమ్మడానికి వీల్లేదని తెలిపారు. జగన్ ఇంకా కోర్టుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితే ఎందుకుందని ప్రశ్నించారు. ‘అమర్చిన దానిపైన అమ్మగారి చెయ్యి’ అన్నట్లుగా మోదీ ధోరణి ఉందని ఆడియోలో విజయసాయిరెడ్డి దుయ్యబట్టారు. మోదీ నిబద్ధత ఉన్న నాయకుడేమీ కాదని, అందుకే సాయం చేస్తానని చెప్పినా మనం రిలాక్స్ కాకూడదని విజయసాయి హెచ్చరించారు. రాజకీయంగా చంద్రబాబును జయించడం అంత సులభం కాదని, ఆయన ఎవరికీ లొంగరు అంటూ చెప్పుకొచ్చారు.
అంతే కాదు ఆంధ్రప్రదేశ్ ప్రజల పై కూడా, తనకు, తన పార్టీకి ఉన్న చులకన భావం మరోసారి బయటపెట్టారు. తెలంగాణా ప్రజలు చాలా నయం అని, ఆంధ్రా ప్రజలకు నిబద్ధత లేదంటూ, ఏపి పై విషం చిమ్మారు. తెలంగాణాలో అసలు కులమే లేదు అన్నట్టు చెప్తూ, ఏపి ప్రజలు మాత్రం కుల పిచ్చ ఉన్నోళ్ళు అనే విధంగా మాట్లాడుతూ, మరోసారి ఏపి పై వారి నైజం బయటపెట్టారు. ఏపీ జనానికి కులాలు ముఖ్యం, కులాల కోసం కొట్టుకుచస్తారు. ఇలాంటి కులాలను హ్యాండిల్ చేయడంలో చంద్రబాబు సిద్ధహస్తుడు. చంద్రబాబు బతుకే అంత, టీడీపీ బతుకున్నదే కులాలపైన అంటూ వ్యాఖ్యానించారు. చంద్రబాబు ఎవరికీ లొంగడు. జగన్‌కు పోల్ మేనేజ్‌మెంట్ చేతకాదు. చుట్టూ ఉన్నవారి మాటలను జగన్ నమ్ముతారు. ఈసారి గెలవకుంటే ఏపీలో వైసీపీ ఖతం అని విజయసాయిరెడ్డి మాట్లాడిన ఆడియో క్లిప్స్ ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారాయి. మొత్తానికి ఈ ఆడియో లీక్ తో, విజయసాయి బండారం మరోసారి బయట పడింది.