బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఆర్‌. కృష్ణయ్యపై ఏపీ బీసీ, ఓబీసీ సంఘాల నేతలు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ సీఎం కేసీఆర్‌ కనుసన్నల్లో కృష్ణయ్య మెలుగుతున్నారని, వైసీపీకి అమ్ముడు పోయారని ఆరోపించారు. తెలంగాణలో కాంగ్రె్‌సకు, ఏపీలో వైసీపీకి అమ్ముడుపోయిన ఆర్‌.కృష్ణయ్య ఆటలు సాగనివ్వబోమని రాష్ట్ర బీసీ సంఘం అధ్యక్షుడు కేసన శంకరరావు హెచ్చరించారు. తెనాలిలో మంగళవారం మీడియాతో మాట్లాడుతూ, బీసీల ఆదరణతో ఎన్నో పదవులను అనుభవించి నేడు బీసీల పట్ల నయవంచకునిగా మారారని విమర్శించారు. తెలంగాణలో బీసీల సమస్యలను పక్కనపెట్టి అధికారం, డబ్బు కోసం వారిని మోసం చేస్తున్నారని ఆరోపించారు. ఏపీలో ప్రచారం చేస్తే బీసీలు తగిన బుద్ధి చెబుతారన్నారు.

game 27032019

ఇదిలావుంటే, కేసీఆర్‌ మాటలు విని టీడీపీని ఓడించేందుకు కృష్ణయ్య కుట్ర చేస్తే తగిన బుద్ధి చెబుతామని ఏపీ ఓబీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అంగిరేకుల వరప్రసాద్‌ యాదవ్‌ హెచ్చరించారు. తెలంగాణకు చెందిన ఆర్‌.కృష్ణయ్యకు ఆంధ్రప్రదేశ్‌లో ఏం పని? ఇక్కడికొచ్చి బిసిల మధ్య చిచ్చుపెడితే చూస్తూ ఊరుకోం? అని బిసి సంక్షేమ సంఘం రాష్ట్ర యువజన అధ్యక్షులు కుమ్మరి క్రాంతికుమార్‌ అన్నారు. తన రాజకీయాలు తెలంగాణలో చేసుకోవాలని, ఆంధ్రప్రదేశ్‌ బిసిల జోలికొస్తే ఊరుకోబోమని ఆర్‌.కృష్ణయ్యను హెచ్చరించారు. గుంటూరులోని బిసి సంక్షేమ సంఘ కార్యాలయంలో ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేశన శంకరరావుతో కలిసి బుధవారం విలేకర్లతో మాట్లాడారు.

game 27032019

బిసి సంక్షేమ సంఘం పార్టీలకతీతంగా పనిచేస్తుందని, బిసి అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా కృషి చేస్తుందని చెప్పారు. తెలంగాణలో బిసిల సమస్యలను పరిష్కరించలేని కృష్ణయ్య ఆంధ్రప్రదేశ్‌కు వచ్చి బిసిలను వైసిపికి ఓటేయాలని ప్రచారం చేస్తాననడం సరికాదన్నారు. బిసి సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేశన శంకరరావు మాట్లాడుతూ బిసిల మనోభావాలు దెబ్బతిన్నప్పుడు తామెవర్నీ ఉపేక్షించబోమన్నారు. ప్రస్తుత ఎన్నికల్లో పలు పార్టీలు ఇచ్చిన ఆఫర్లను సున్నితంగా తిరస్కరించామని, బిసి జీవితాలతో చెలగాటమాడితే వదిలి పెట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. గుంటూరు జిల్లాలో విడదల రజనీ, చంద్రగిరి ఏసురత్నం, అరవిందరావు గెలుపుకోసం సంఘం కృషి చేస్తుందని ప్రకటించారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read