ఆ కుటుంబానిది దశాబ్దాల రాజకీయ చరిత్ర. ఓటమి ఎరుగదు.. జిల్లా రాజకీయాల్లో ఆయనకంటూ ఒక ప్రత్యేకస్థానముంది. పార్టీ ఏదైనా..విజయం తన సొంతం కావాలనే లక్ష్యంతోనే రాజకీయాల్లో ముందుకు సాగారు. ఆ మేరకు వరుస విజయాలు చవిచూశారు. ఒకే నియోజకవర్గం నుంచి వరుసగా ఏడుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొంది డబుల్‌ హ్యాట్రిక్‌ విజయాలు సొంతం చేసుకున్న ఏకైక నాయకుడిగా జిల్లా చరిత్రలో ఆయన స్థానం పదిలం. అసెంబ్లీ ఎన్నికల్లోనే కాదు.. పార్లమెంటు బరిలో కూడా నిలిచి విజయం అందుకున్నారు. ఆయనే ప్రస్తుత అనంతపురం పార్లమెంటు ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి. రాష్ట్ర రాజకీయాల్లో ఆయనంటూ తెలియనివారుండరు. నిక్కచ్చిగా మాట్లాడే నైజం ఆయనది. అందుకే ఆ యన రాజకీయాల్లో రాణిస్తున్నారనే అభిప్రాయముంది.

game 27032019

ఇదంతా నాణేనికి ఒకవైపు మాత్రమే. ఇక్కడే అసలు కథ మొదలైంది. తాను పోటీ చేయనని, తన స్థానంలో తన కుమారుడు జేసీ పవన్‌రెడ్డి ఎంపీ అభ్యర్థిత్వాన్ని పరిశీలించాలని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుకు సూటిగా చెప్పి తన పంతం నెగ్గించుకున్నారు. తాజాగా జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో అనంతపురం పార్లమెంటు టీడీపీ అభ్యర్థిగా తన కుమారుడు జేసీ పవన్‌రెడ్డిని ఆయన బరిలో నిలిపారు. కుమారుడి విజయం కోసం ఆయన తన రాజకీయ చాణక్యం చాటుతున్నారనే అభిప్రాయం రాజకీయ విశ్లేషకుల నుంచి వినిపిస్తోంది. ఓటమెరుగని కుటుంబం నుంచి తాజా ఎన్నికల్లో వారసత్వ రా జకీయానికి తెరతీశారు. ఆ విజయ పరంపర కొనసాగించాలనే లక్ష్యంతో తన దశాబ్దాల రాజకీయ అనుభవం రంగరించి వ్యూహాలకు జేసీ దివాకర్‌రెడ్డి పదును పెట్టే పనిలో పూర్తిస్థాయిలో నిమగ్నమయ్యారు.

game 27032019

సుదీర్ఘ రాజకీయ అనుభవానికి తోడు ప్రత్యర్థి, వైసీపీ అభ్యర్థి రంగయ్య స్థానికేతరుడు కావడం తమకు కలిసి వచ్చే అంశంగా జేసీ వర్గీయులు పరిగణిస్తున్నారు. బోయ సామాజికవర్గానికి చెందిన వ్యక్తి అయినప్పటికీ.. రంగయ్యకు మొదట హిందూపురం పార్లమెంటు నియోజకవర్గ బాధ్యతలు అప్పగించారు. అక్కడ తన సామాజికవర్గంలో పరిచయాలు చేసుకుంటున్న క్రమంలోనే.. తిరిగి అనంతపురం పార్లమెంటు బాధ్యతలు అప్పజెప్పారు. దీంతో అనంతపురం పార్లమెంటు పరిధిలో తన సామాజికవర్గానికి చేరువ కావడంలో రంగయ్య కొంత మేరకు సఫలీకృతం కాలేకపోయారనే వాదన వినిపిస్తోంది. పార్లమెంటు పరిధిలోని ఆయా నియోజకవర్గాల పార్టీ పెద్దలపైనే ఆధారపడాల్సిన పరిస్థితిని రంగయ్య ఎదుర్కొంటున్నారు. ప్రజల్లోకి నేరుగా వెళ్లి ఆ మేరకు ఓట్లు రాబట్టే పరిస్థితి తెచ్చుకోలేకపోతున్నారనే అభిప్రాయం ఆ పార్టీ వర్గాల నుంచే వ్యక్తమవుతూండడం తాజా పరిస్థితికి అద్దం పడుతోంది. ప్రత్యర్థి ప్రతికూలతలను తమకు అనుకూలంగా మలచుకోవడంలో జేసీ దివాకర్‌రెడ్డి ఒక అడుగు ముందుకు వేశారనే అభిప్రాయం రాజకీయవర్గాల నుంచి వినిపిస్తోంధి. దీనికితోడు వైసీపీ అభ్యర్థి స్థానికేతరుడు కావడంతో దానిపైనే ప్రధానంగా దృష్టి సారించారు. కాగా, ప్రచారంలో మాత్రం ఇరువర్గాలు ఎవరికి వారే అనే రీతిలో పోటీ పడుతున్నారు. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు వివిధ రూపాల్లో ప్రయత్నాలు ముమ్మరం చేశారనడంలో ఎలాంటి సందేహం లేదు.

 

 

Advertisements

Advertisements

Latest Articles

Most Read