ఏపి ఎన్నికల్లో ఎప్పుడూ చూడని, ఎవరూ ఊహించని ఫలితాలు చూడబోతున్నామా ? చంద్రబాబు కష్టానికి ఫలితం అనూహ్యంగా దక్కనుందా ? అభివృద్ధితో పాటు, సంక్షేమం సూపర్ హిట్ అయ్యిందా ? జగన్ మోహన్ రెడ్డి, కేసీఆర్, మోడీతో కలిసి చేస్తున్న కుమ్మక్కు రాజకీయాలు బెడిసికొట్టాయా ? అవును అనే అంటుంది లోక్‌నీతి-సీఎస్ డీఎస్‌ సర్వే. ఏపీలో మళ్లీ తెలుగుదేశానిదే అధికారమని ‘లోక్‌నీతి-సీఎ్‌సడీఎస్‌’ సర్వే స్పష్టం చేసింది. ఇప్పటిదాకా అనేక జాతీయ మీడియా సంస్థలు వైసీపీదే గెలుపు అని చెబుతుండగా... మొట్టమొదటిసారి ‘టీడీపీదే హవా’ అనే అంచనాలు వెలువడ్డాయి. ఏబీపీ చానల్‌ కోసం లోక్‌నీతి-సీఎ్‌సడీఎస్‌ ఈ సర్వే చేసినట్లు తెలిసింది. దీని ప్రకారం... ఆంధ్రప్రదేశ్‌లో మళ్లీ టీడీపీ బంపర్‌ మెజారిటీతో విజయం సాధించనుంది.

survey 01042019 1

టీడీపీ 126 నుంచి 135 అసెంబ్లీ స్థానాలు గెలుచుకుంటుందని ఈ సర్వే అంచనా వేసింది. వైసీపీ 45 నుంచి 50 స్థానాలకు పరిమితమవుతుందని తేల్చింది. ఇక... 25 ఎంపీ సీట్లలో టీడీపీ 18 నుంచి 22 వరకు గెలుచుకుంటుందని, వైసీపీ 3 నుంచి 5 వరకు నెగ్గుతుందని లోక్‌నీతి-సీఎ్‌సడీఎస్‌ స్పష్టం చేసింది. జనసేన 2 నుంచి 5 వరకు అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధించవచ్చునని తెలిపింది. బీజేపీ, కాంగ్రెస్‌ రాష్ట్రంలో ఖాతా తెరిచే అవకాశం లేదని తేల్చింది. తెలుగుదేశం పార్టీకి 46.2 శాతం ఓట్లు లభిస్తాయని లోక్‌నీతి-సీఎ్‌సడీఎస్‌ అంచనా వేసింది. వైసీపీకి 37.2 శాతం ఓట్లు మాత్రమే వస్తాయని తెలిపింది.

survey 01042019 1

మళ్లీ బాబు ఎందుకంటే... అభివృద్ధి, సంక్షేమం, సుపరిపాలన కొనసాగాలనే భావన. జగన్‌, పవన్‌లతో పోల్చితే చంద్రబాబు నాయకత్వంపైనే ఎక్కువ విశ్వాసం. రైతులకు సహాయం చేసే అన్నదాత సుఖీభవ, డ్వాక్రా మహిళలకు ‘పసుపు కుంకుమ’, రూ.5కే భోజనం పెట్టే అన్న క్యాంటీన్‌, పింఛన్లు, చంద్రన్న బీమా, ఆటోలు, ట్రాక్టర్లపై జీవితకాల పన్ను ఎత్తివేత... మరిన్ని సంక్షేమ పథకాల ప్రభావం. పోలవరం నిర్మాణం, నదుల అనుసంధానం, రాజధాని అమరావతి నిర్మాణం, పెట్టుబడుల ఆకర్షణ, కియ వంటి కంపెనీల రాక, మౌలిక సదుపాయాల కల్పనలో చంద్రబాబు సామర్థ్యం! చంద్రబాబు పట్ల ఓటర్లు మొగ్గుచూపడానికి ఇవే కారణాలని లోక్‌నీతి-సీఎస్ డీఎస్‌ తెలిపింది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read