ఈ రోజు ఎన్నికల ప్రచారంలో భాగంగా రాజమండ్రి వచ్చిన మోడీ, చంద్రబాబు టార్గెట్ గా రెచ్చిపోయారు. 45 నిమిషాల ప్రసంగంలో, ఎక్కడా జగన్ పేరు ప్రస్తావించలేదు. మరోసారి జగన్ పై, విజయసాయి రెడ్డి పై, తనకున్న ప్రేమను చాటుకున్నారు. అయితే అహర్నిశలు రాష్ట్రం కోసం పాటు పడుతున్న చంద్రబాబు పై మాత్రం, ఆరోపణలతో హోరెత్తించారు. ఒక పక్క నేను కాపలదారుడిని అంటూ ప్రచారం చేస్తున్న మోడీ, చంద్రబాబు అవినీతి చేసారు, పోలవరం లో అవినీతి, ఆ ప్రాజెక్ట్ లో అవినీతి, ఈ ప్రాజెక్ట్ లో అవినీతి అంటూ ఊదరగొడుతున్నారు. మరి, నిజంగా చంద్రబాబు అవినీతి చేస్తుంటే, ఈ చౌకీదార్, ఎక్కడ ఉన్నాడు ? జగన్ దగ్గరకు ఈడీ, సిబిఐ వెళ్ళకుండా కాపలా కాస్తున్నారా ?
ఇక పోలవరం పై మోడీ చెప్పిన డబ్బా అంతా ఇంతా కాదు. గత పాలకులకు పోలవరం ప్రాజెక్ట్ పూర్తి కావాలని లేదని, 40 ఏళ్లుగా పోలవరం ప్రాజెక్ట్‌ని గాల్లో వేలాడదీస్తూనే ఉన్నారని ఆరోపించారు. మొదటి పార్లమెంట్ సమావేశాల్లోనే పోలవరం ప్రాజెక్ట్‌ను జాతీయ పథకంగా ప్రకటించామన్నారు. పోలవరం నిర్మాణానికి రూ.7 వేల కోట్లు ఇచ్చామని, చంద్రబాబు పోలవరం ప్రాజెక్ట్ ఒక ఏటీఎం అని మోదీ విమర్శించారు. పోలవరాన్ని పూర్తి చేయాలన్న చిత్తశుద్ధి టీడీపీకి లేదని దుయ్యబట్టారు. కమీషన్ల కోసం అంచనాలను పెంచుతూ పోతున్నారని, పోలవరం అంచనాలు పెంచడం ద్వారా.. యూటర్న్ బాబు ఎవరికి మేలు చేయాలనుకుంటున్నారని ప్రశ్నించారు. రాష్ట్రంలో.. కేంద్రంలో ఎన్డీఏ సర్కార్ రావాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు.
చంద్రబాబు తన వ్యాపార సంస్థ హెరిటేజ్ కోసం మాత్రమే పని చేస్తున్నారని, తాను మాత్రం ఏపీ సాంస్కృతిక వారసత్వం కోసం నిలబడతానన్నానని మోదీ చెప్పుకొచ్చారు. చంద్రబాబును బాహుబలి సినిమాలో భళ్లాలదేవతో మోదీ పోల్చారు. మోదీ సభలో మొత్తం 45 నిమిషాల ప్రసంగించారు. తన ప్రసంగంలో ఎక్కడ కూడా వైసీపీ జోలికిపోలేదు. ఏపీ ఆకాంక్షలను బీజేపీనే నెరవేరుస్తుందంటూ చెప్పుకున్నారు. బీజేపీ గెలుపును ఏపీ కోరుకుంటోందని మోదీ చెప్పారు. మోదీ ప్రసంగంపై టీడీపీ నేతలు మండిపడుతున్నారు. మోదీ అంత పచ్చి అబ్ధదాల కోరును ఇంతవరకు చూడలేదని టీడీపీ నేత బుచ్చయ్యచౌదరి అన్నారు. పోలవరానికి ఇంకా రూ.5 వేల కోట్లు బాకీ పడ్డారని, మీరిచ్చే రూ.7 వేల కోట్లతో ప్రాజెక్ట్ ఎప్పటికి పూర్తికావాలని ప్రశ్నించారు. రాష్ట్రానికి మోదీ తీవ్ర అన్యాయం చేశారని ఆయన మండిపడ్డారు. రాజధాని కడతామని చెప్పి నిధులు ఇవ్వలేదని దుయ్యబట్టారు. రాజధానికి కేంద్రం ఇచ్చింది కేవలం రూ.1500 కోట్లేనని, అక్కడ రూ.58 వేల కోట్ల విలువైన పనులు జరుగుతున్నాయని బుచ్చయ్యచౌదరి తెలిపారు.