ఏపీ రాజకీయం రాజుకుంది. ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న కొద్దీ టీడీపీని దెబ్బ తీసేందుకు ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్ని ప్రయత్నాలూ చేస్తోంది వైసీపీ. టీడీపీ ద్వితీయ శ్రేణీ నేతలే టార్గెట్గా పీకే టీం రంగంలోకి దిగింది. కోస్తాలోని 25 నియోజకవర్గాల్లో మకాం వేసింది. ఆయా నియోజకవర్గాల్లో టీడీపీ బలంగా ఉన్న నేతల బలహీనతలను తెలుసుకోవడం వారి అనుచరగణంతో టచ్ లోకి వెళ్లడం.. ఈ టీమ్ లక్ష్యం. నియోజకవర్గంలో వైసీపీ ఎక్కడ బలహీనంగా ఉందో ఆ ప్రాంతాల్లో ప్రత్యర్థి వర్గంలో ఉన్న బలమైన నేతలను తమ వైపునకు తిప్పుకోవడమే వీరి వ్యూహం. కొందరిని తమ పార్టీలోకి తీసుకుంటుండగా.. మరికొందరిని టీడీపీలోనే ఉంచి సమాచారం తెలుసుకుంటూ డబ్బులు ముట్టజెబుతున్నారు.
ఇక ఇదే స్ట్రాటజీతో, ముఖ్య మంత్రి కుమారుడు నారా లోకేష్ పోటీ చేస్తున్న చేస్తున్న మంగళగిరి నియోజకవర్గం పై కూడా ఈ బ్యాచ్ కన్ను పడింది. నన్ను గెలిపిస్తే మంగళగిరి ని మరో గచ్చిబౌలి చేస్తాను అని లోకేష్ విస్తృతంగా నియోజకవర్గంలో ప్రచారం చేస్తున్నారు . ఇప్పటికే మంగళగిరి నియోజకవర్గం లో ఒక దఫా ప్రచారం పూర్తీ చేసుకుని జిల్లాల పర్యటనకు లోకేష్ వెళ్లారు. ఇంకో పక్క లోకేష్ ని చట్ట సభ లోనికి అడుగుపెట్టనీయకూడదు అని వైకాపా ఎత్తులు వేస్తోంది. దీనిలో భాగంగా మంగళగిరి నియోజకవర్గంలో ఎప్పుడు చూడని కొత్త వ్యక్తులు మనకి కనిపిస్తున్నారు. వాళ్ళు అందరు పీకే టీం మనుసులు అని నియోజకవర్గంలో అనుకుంటున్నారు .
తెలంగాణ రిజిస్ట్రేషన్ తో మంగళగిరి నియోజకవర్గం లో వైకాపా జెండా తో తిరుగుతున్నా వాహనాలు , ఏ వాహనాల్లో లాప్టాప్ తో యూవతులు వుంటున్నారు. వీరు ఇంటి ఇంటికి తిరుగుతున్నారు, ప్రజల వద్ద నుంచి ఆధార్ , బ్యాంకు అకౌంట్ లు సేకరిస్తున్నారు. చిన్న చిన్న సమావేశాలు పెడుతున్నార. అసలు తెలంగాణ నుంచి ట్రాన్స్ పోర్ట్ పర్మిట్ ఉన్న వాహనం వైకాపా జెండా కట్టుకుని నియోజకవర్గం లో ఎలా తిరుగుతోంది ? ఈ వాహనానికి పర్మిట్ ఎవరు తీసుకున్నారు ? పక్క రాష్ట్రము యువకులు కి ఇక్కడ ఏమి పని ? దీనిని పక్క రాష్ట్రము సాక్షిగా మన రాష్ట్ర అభివృద్ధి ఆడుకోటానికి కుట్ర గానే చూడాలి అని మంగళగిరి లో పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. దీని వెనెక పక్క రాష్ట్రములో పెద్దలు హస్తం ఉంది అని నియోజకవర్గంలో గుసగుసలు వినిపిస్తున్నాయి.