వైసీపీ నేత ఆమంచి కృష్ణమోహన్ కు చెందిన కంపెనీకి విద్యుత్ సరఫరాను ఏపీ విద్యుత్ శాఖ నిలిపివేసింది. ప్రకాశం జిల్లాలోని వేటపాలెం మండలం చల్లారెడ్డిపాలెం పంచాయతీ పరిధిలోని పొట్టిసుబ్బయ్యపాలెంలో ఉన్న క్రిస్టల్ సీఫుడ్స్ సంస్థ విద్యుత్ కనెక్షన్ కట్ చేసింది. ఈ విషయమై విద్యుత్ శాఖకు చెందిన ఉన్నతాధికారి ఒకరు మాట్లాడుతూ.. క్రిస్టల్ సీఫుడ్స్ సంస్థ విద్యుత్ శాఖకు రూ.1.30 కోట్ల బకాయి పడిందని తెలిపారు. ఈ బిల్లులు చెల్లించాల్సిందిగా పలుమార్లు నోటీసులు జారీచేశామన్నారు. అయినా కంపెనీ యజమానులు, ప్రతినిధులు స్పందించకపోవడంతో నిబంధనల మేరకు విద్యుత్ కనెక్షన్ ను కట్ చేశామని పేర్కొన్నారు. ఈ విషయంలో నిబంధనల మేరకు ముందుకు పోతామని వ్యాఖ్యానించారు. కాగా, ఈ విషయమై ఆమంచి కృష్ణమోహన్, వైసీపీ వర్గాలు ఇంతవరకూ స్పందించలేదు.

amanchi 30032019 2

చీరాల సమీపంలోని వేటపాలెం మండలంలో క్రిస్టల్‌ సీ ఫుడ్స్‌ అనే సంస్థ ఉంది. దానికి అయిదుగురు డైరెక్టర్లు ఉండగా ఆమంచి కుటుంబంలోని ఎమ్మెల్యే కృష్ణమోహన్‌తో పాటు ఆమంచి రాజేంద్రప్రసాద్‌ ఈ కంపెనీకి డైరెక్టర్లుగా ఉన్నారు. రొయ్యలను ఉత్పత్తి చేసి విదేశాలను ఎగుమతి చేయడం దీని ఉద్దేశం. నాలుగేళ్లుగా కార్యకలాపాలు నిర్వహిస్తోంది. నెలకు సుమారుగా రూ.25 లక్షల వరకు విద్యుత్తు బిల్లు వస్తుంది. బిల్లులను నెలనెలా చెల్లించడం అరుదే. నామమాత్రంగా నెలనెలా నోటీసులు అందిస్తూ కంపెనీ ద్వారా చెల్లింపులు వచ్చినప్పుడు తీసుకునేవారు. కానీ ఇప్పుడు ఇక ఊరుకోలేదు. విద్యుత్తు శాఖ అధికారులు, సిబ్బంది గురువారం ఈ కంపెనీకి చేరుకుని విద్యుత్తు కనెక్షన్‌ను తొలగించారు.

amanchi 30032019 3

మొత్తం రూ.1.30 కోట్ల వరకు బకాయి పడ్డారని లెక్కల్లో తేలడంతో ఇదే విషయాన్ని ఉన్నతాధికారులకూ తెలియజేశారు. ఉన్నతాధికారుల ఆదేశాలతో కనెక్షన్‌ను తొలగించారు. ఈ విషయమై ఎమ్మెల్యే కృష్ణమోహన్‌ మాట్లాడుతూ ‘ప్రతి సంస్థకు విద్యుత్తు బకాయిలు ఉంటాయి, అది సహజమే. రూ. కోట్లలో, లక్షల్లో టర్నోవర్‌ జరుగుతున్నప్పుడు బకాయిలు ఉండడం సహజం. ఇదేమీ పెద్ద విషయం కాదు. గురువారం ఉదయం కనెక్షన్‌ తొలగించారు, సాయంత్రానికి మాట్లాడి మళ్లీ సరఫరా పునరుద్ధరించారు. బకాయిల్లో కొంత నగదు శుక్రవారం చెల్లిస్తాం’ అన్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read