వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌పై ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఘాటు విమర్శలు చేశారు. కోడికత్తి పార్టీ వల్ల ఏమైనా సాధ్యమా?, కోడికత్తి పార్టీ డ్రామాలు, నాటకాలు ఆడుతున్నారని చంద్రబాబు విమర్శించారు. ప్రజల్ని మోసం చేయడానికి జగన్‌ వస్తున్నాడని, జగన్‌కు పరిపాలన అనుభవం ఉందా?, ఎప్పుడైనా సర్పంచ్‌ అన్నా అయ్యాడా? అని చంద్రబాబు ప్రశ్నించారు. జగన్‌ ఒక్క ఛాన్స్‌ ఇవ్వాలంటున్నాడని.. సరదా పడుతున్నాడని క్లీనర్‌కి ఒక్క ఛాన్స్‌ ఇస్తే యాక్సిడెంట్‌ అవుతుందని చంద్రబాబు అన్నారు. రాష్ట్రం ఏమన్నా చాక్లెట్‌ అనుకుంటున్నారా? అని చంద్రబాబు ప్రశ్నించారు. రాష్ట్ర ప్రయోజనాల గురించి జగన్‌ ఎప్పుడైనా ఆలోచించాడా?, మోదీ ఢిల్లీలో అవార్డులు ఇస్తారు.. గల్లీలో తిడతారని బాబు మండిపడ్డారు. పోలవరంపై సాకులు చెబుతున్నారని, మోదీ లాంటి వ్యక్తుల వల్ల ఏమీ కాదని చంద్రబాబు అన్నారు.

game 27032019

వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఐదేళ్లలో 24 సార్లు అసెంబ్లీకి వస్తే 240 సార్లు కోర్టుకెళ్లారన్నారు. 34 కేసులున్న నాయకుడా మిమ్మల్ని పాలించేది.. ప్రజాసమస్యలకన్నా ఆయనకు అయన కేసుల యావ.. వాటి నుండి తప్పించుకొనే యావనే ఉందని.. అతనా మీ బ్రతుకులు బాగుచేసేదని బాబు ప్రశ్నించారు. మంచినీళ్లు అడిగితే కొబ్బరి నీళ్లిచ్చే మంచితనమున్న సౌమ్యులు గల గోదావరి జిల్లాలలో రైళ్లను తగలబెట్టి అరాచకాలు సృష్టించాలని చూసిన దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డన్నారు. ఇక్కడ ప్రజలు గౌరవంగా పలకరిస్తే జగన్ కడప నుండి రౌడీలను రప్పించి మీ బ్రతుకులను ఛిద్రం చేయాలని చూస్తున్నారన్నారు. మనం మన ఆత్మగౌరవం కోసం కేంద్రంతో పోరాడుతుంటే జగన్ మోడీతో కలిసి రాష్ట్రంలో ఎన్ని డ్రామాలేసి, ఎంత నంగనాచి నాటకాలాడుతున్నారో అందరూ చూస్తున్నారన్నారు.

game 27032019

రాబోయే ఐదేళ్లలో మూడుసార్లు పసుపు-కుంకుమ ఇస్తానని చంద్రబాబు నాయుడు అన్నారు. నాకు కోటిమంది చెల్లెమ్మలు అండగా ఉన్నారని, ఈచెల్లెమ్మల సౌభాగ్యం కోసమే పసుపు-కుంకుమ పెట్టానన్నారు. అలాగే ప్రతి పేదవాడి సొంతింటి కల నెరవేరుస్తానన్నారు. పట్టణ ప్రాంతాల్లోనూ ఉచితంగా ఇళ్లు కట్టించే బాధ్యత నాదని చంద్రబాబు అన్నారు. అన్ని వర్గాల ప్రజలకు తెలుగుదేశం అండగా ఉంటుందన్నారు. వెనుకబడిన వర్గాలకు 25 కార్పొరేషన్లు ఏర్పాటు చేశామన్నారు. పిఠాపురంలో ఇచ్చిన హామీలను నిలబెట్టుకున్నానన్నారు. కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేసి రూ.వెయ్యి కోట్లు కేటాయించామన్నారు. పేద యువతుల పెళ్లికి రూ.లక్ష ఆర్థికసాయం చేస్తామన్నారు. మనిషిని మనిషిగా గుర్తించిన వ్యక్తి ఎన్టీఆర్ గారని.. పేదలకు కూడు, గూడు, గుడ్డ అనే నినాదంతో ఆనాడు పార్టీ ఆవిర్భవించిందని.. ఆయన ఆశయాల నుండి పార్టీలో ఆయన ఆశయాలను కొనసాగించడమే ఇప్పుడు మా ఉదేశ్యమని.. ఈనాడు తినడానికి కొదువ లేకుండా ఇంట్లో ఉన్నా లేకుండా అన్న క్యాంటీన్లతో ఆకలి తీర్సుతున్నామన్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read