ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త, జేడీయూ ఉపాధ్యక్షుడు ప్రశాంత్ కిశోర్ కు, నితీష్ కుమార్ షాక్ ఇచ్చారు. ప్రశాంత్ కిశోర్, జేడీయూలో చేరటం, ఆయనను నితీష్ ఉపాధ్యక్షుడుని చెయ్యటం ఇవన్నీ చకచకా జరిగిపోయాయి. ప్రశాంత్ కిషోర్ కూడా , నేను ఇక ఎక్కువ సేపు రాజకీయాల్లోనే ఉంటాను, నా టీం అంతా, జగన్ పనులు చూస్తుంది అని చెప్పిన సంగతి తెలిసిందే. అయితే, ప్రశాంత్ కిషోర్ మాత్రం, బీహార్ లో కాకుండా, ఎక్కువగా హైదరాబాద్ లోటస్ పాండ్ లోనే ఎక్కువ సమయం గడుపుతున్నారు. జగన్ మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చెయ్యటం కోసం, రకరకాల పన్నాగాలు పన్నుతూ, ఎక్కువ సేపు ఇక్కడే గడిపేస్తున్నారు. సరిగ్గా ఇక్కడే నితీష్ కు, ప్రశాంత్ కిషోర్ వైఖరి నచ్చలేదని తెలుస్తుంది.
దీంతో జేడీయూపార్టీ వ్యవహారాల్లో, ప్రశాంత్ కిషోర్ ను దూరం పెడుతూ వచ్చారు. అయితే ఉపాధ్యక్షుడుని అయిన నన్నే దూరం పెడితే ఎలా, ఇది ఎన్నికల సమయం కదా అంటూ, ప్రశాంత్ కిషోర్. తన పార్టీ నాయకత్వంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఈ అసహనాన్ని ఆయాన ట్విట్టర్ లో పంచుకున్నూర్. గురువారం ఆయన చేసిన ఓ ట్వీటే దీనికి ఉదాహరణ. ‘‘జేడీయూలో ఎన్నికల నిర్వహణ, ప్రచార బాధ్యతలన్నీ ఆర్‌సీపీ సింగ్‌లాంటి సీనియర్ చూస్తున్నారు. నా రాజకీయ జీవితపు తొలినాళ్లివి. నేర్చుకోవడం, సహకరించడం వరకే నా పాత్ర పరిమితం’’ అని నర్మగర్భంగా పోస్ట్ పెట్టారు.
పొత్తులు, సీట్ల పంపిణీలాంటి బాధ్యతలను ఉపాధ్యక్షుడైన తనకు కాకుండా ఆర్‌సీపీ సింగ్, లల్లన్‌సింగ్‌లకు నితీశ్ ఇవ్వడం ప్రశాంత్ కిశోర్‌లో అసంతృప్తిని రేపింది. పార్టీ యువ విభాగం, మిగిలిన రాష్ట్రాల్లో జేడీయూని బలోపేతం చేయడమెలా అనే చిన్నచిన్న పనులను మాత్రమే అప్పగించడంపై అలిగి ప్రశాంత్ కిశోర్- ఏపీలో ఎక్కువకాలం గడుపుతున్నారు. అక్కడాయన వైఎ్‌సఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యూహరచనలో సహకరిస్తున్నారు. ఇది ముగిశాక ఆయన శివసేనకు కూడా ఇదే తరహా వ్యూహరచన చేయనున్నారు.