ఏపీలో ఎన్నికల నేపథ్యంలో ఈవీఎంలలో సాంకేతిక లోపాలు సహా పోలింగ్‌ నిర్వహణ వైఫల్యాలపై తీవ్ర నిరసన వ్యక్తంచేసిన టీడీపీకు కేంద్ర ఎన్నికల సంఘం లేఖ రాసింది. ఈవీఎంల వ్యవహారంపై టీడీపీకు చెందిన సాంకేతిక నిపుణులుతో కాకుండా పార్టీయేతర ఎక్స్‌పర్ట్స్‌తో చర్చించేందుకు సిద్ధమని తెలిపింది. ఈ నెల 15న ఉదయం 11 గంటలకు తమను మరోసారి కలవ వచ్చని టీడీపీ న్యాయవిభాగం అధ్యక్షుడు, ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్‌కు ఈసీ ముఖ్య కార్యదర్శి లేఖ పంపారు. అయితే ఇక్కడ ఒక చిన్న మెలిక పెట్టారు. ఈవీఎంల వ్యవహారంపై టిడిపికి చెందిన సాంకేతిక నిపుణులు హరిప్రసాద్‌తో చర్చించేందుకు అభ్యంతరం తెలిపింది. ఆయన కాకుండా ఇతర సాంకేతిక నిపుణులను పంపిస్తే చర్చించేందుకు సిద్ధమని లేఖలో పేర్కొంది.

ec 13042019 1

అందుకోసం ఈ నెల 15న ఉదయం 11 గంటలకు తమను మరోసారి కలవవచ్చని తెదేపా న్యాయవిభాగం అధ్యక్షుడు రవీంద్రకుమార్‌కు ఈసీ ముఖ్య కార్యదర్శి లేఖ పంపారు. ఎన్నికల సంఘం లేవనెత్తిన అభ్యంతరాలకు సమాధానంగా లేఖ రాయాలని తెలుగుదేశం నిర్ణయించినట్టు తెలుస్తోంది. హరిప్రసాద్‌ క్రిమినల్ కాదని, ఇది వరకు ఈవీయంల ఎలా హ్యాక్ చెయ్యాలో చెప్పినందుకు, ఈవీయం దొంగలించారు అంటూ కేసు పెట్టారని గుర్తు చేస్తున్నారు. హరిప్రసాద్‌ తమతో పాటు మధ్యానం వచ్చారని, సాయంత్రం నాలుగు గంటలకు వస్తే చర్చిద్దాం అన్నారని, నాలుగు గంటలకు వచ్చి హరిప్రసాద్‌ కొన్ని విషయాలు అడిగితే, సోమవారం రమ్మన్నారని, ఈ లోపే ఆయన రావద్దు అంటూ లేఖ పంపించారని తెలుగుదేశం నేతలు చెప్తున్నారు.

ec 13042019 1

ఏ తప్పు లేకపోతే హరిప్రసాద్‌ లేవనెత్తిన అంశాలకు సమాధానం చెప్పాలని, అంతే కాని ఆయన మీద కేసు ఉందని, ఆయన డిబేట్ కు వస్తే ఒప్పుకోమని ఈసీ చెప్పటం పై ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. 31 కేసులు ఉన్న A1 జగన్ ని కలవగా లేనిది, ఆర్ధిక ఉగ్రవాది A2 విజయసాయి రెడ్డి కలవగా లేనిది, హరిప్రసాద్ అనే ఒక సాంకేతిక నిపుణుడు పై అభ్యంతరం చెప్పటం ఏంటి అని అంటున్నారు. ఇక్కడే ఎలక్షన్ కమిషన్ భాగోతం బయట పడిందని, చంద్రబాబు చేస్తున్న పోరాటానికి పాక్షిక విజయం లభించినట్టే అని అంటున్నారు. ఈ విషయం ప్రజల్లోకి తీసుకువెళ్తామని చెప్తున్నారు. శనివారం మధ్యాహ్నం సీఈసీ సునీల్‌ అరోరాతో ఏపీ సీఎం చంద్రబాబు సుమారు రెండు గంటల పాటు భేటీ అయిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణ తీరుపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈసీ ఓ స్వతంత్ర వ్యవస్థగా కాకుండా.. ప్రధాని నరేంద్ర మోదీ కనుసన్నల్లో పనిచేస్తుందంటూ సీఎం మండిపడిన విషయం తెలిసిందే.

Advertisements

Advertisements

Latest Articles

Most Read