ఏపి ఎన్నికల్లో చంద్రబాబుని తిడితే, అది జగన్ కు నష్టం అని చెప్పి, నెల రోజుల పాటు కేసీఆర్ అండ్ కో నోరు మూసుకుని కూర్చున్న సంగతి తెలిసిందే. ఏపిలో, కేసీఆర్ పేరు ఎత్తితే, ప్రజలు ఊస్తారని అందరికీ తెలుసు, అందుకే చంద్రబాబుని తిట్టకుండా, జగన్ ను పొగడకుండా మాట్లాడకుండా కూర్చున్నారు. అయితే ఎన్నికలు అయిపోగానే, మళ్ళీ మొదలు పెట్టారు. తెలంగాణా రాష్ట్రంలో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో అన్ని స్థానాలనూ గెలవబోతున్నామని టీఆర్ఎస్ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు చెప్తూ, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఈజీగా గెలుస్తుందని, జగన్ అధికారంలోకి వస్తున్నారని అన్నారు. చంద్రబాబు ఘోరంగా ఓడిపోతున్నారని చెప్పారు. అక్కడ జగన్, ఇక్కడ మేము రెండు రాష్ట్రాలని పరిపాలిస్తామని చెప్పారు.
ఇక పిచ్చి వాగుడు వాడే, తలసాని శ్రీనివాస్ యాదవ్ మరింతగా రేచ్చిపోయారు. చంద్రబాబు పై తీవ్ర విమర్శలు చేశారు. ఈవీయంల ప్రచారం పేరుతో చంద్రబాబు డ్రామాలు ఆడుతున్నారని ధ్వజమెత్తారు. తెలంగాణ భవన్లో తలసాని మీడియాతో మాట్లాడారు. ఏపీలో పోలింగ్ శాతం బాగుందని అన్నారు. చంద్రబాబు పబ్లిసిటీ కోసం పోలింగ్‌కు ముందు రోజు ఈసీని కలిశారని విమర్శించారు. పోలింగ్ రోజు కూడా ఓటు వేయాలని వీడియో విడుదల చేయడం ఎన్నికల ప్రవర్తనా నియమావళికి విరుద్ధమని పేర్కొన్నారు. ‘చంద్రబాబు ప్రసంగాల్లో ఒకమాటకు ఇంకోమాటకు పొంతన ఉండదు. పోలింగ్‌లో సాంకేతిక కారణాలతో ఈవీఎంలు మొరాయించడం సర్వసాధారణం. ఓడిపోతున్నామనే భయం, అసహనం చంద్రబాబులో స్పష్టంగా కనిపిస్తోంది. తండ్రిలాగే కుమారుడు మంగళగిరిలో నాటకాలు ఆడారు’ అని తలసాని విమర్శించారు.
ఇక చాలా రోజులుగా కనిపించకుండా పోయిన జీవీఎల్ మళ్ళీ వచ్చారు. ‘‘ఆంధ్రా ఓటర్లు డబ్బుకు అమ్ముడు పోయారు. మేం చేసిన విజ్ఞప్తులను ప్రజలు పెడచెవిన పెట్టారు. ప్రాంతీయ పార్టీలు భారీగా డబ్బులు ఖర్చు చేసి ఓట్లు కొనుగోలు చేశాయి. ఏప్రిల్ 11న ఏపీలో జరిగిన ఎన్నికలు పాతరోజుల్లో బీహార్‌లో పరిస్థితులను గుర్తుచేశాయి. ధన రాజకీయాలతో అధికారంలోకి వచ్చేందుకు ప్రాంతీయ పార్టీలు ఆరాటపడ్డాయి. రాష్ట్రంలో టీడీపీ తుడిచిపెట్టుకుపోతుంది. వైసీపీ అధికారంలోకి వచ్చి తీరుతుంది’’ అని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు ప్రకటించారు. శుక్రవారం ఆయన విజయవాడలో విలేకరులతో మాట్లాడారు. ఫలితాల తర్వాత రాష్ట్రంలో తుడిచి పెట్టుకుపోయే టీడీపీ స్థానాన్ని బీజేపీ భర్తీ చేస్తుంది’ అని జీవీఎల్ అన్నారు.