ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు జరిగాయన్నమాటే గానీ... రాజకీయ పార్టీలకు ప్రశాంతత కరువైంది. ఎన్నికల ముందు ఎలా టెన్షన్ పడ్డాయో... ఇప్పుడూ అలాగే పడుతున్నాయి. ఇప్పుడెందుకంటే... 43 రోజులు స్ట్రాంగ్ రూముల్లో ఉన్న ఈవీఎంలు భద్రంగా ఉంటాయో లేదో అన్న టెన్షన్. ఎప్పుడైనా ఎవరైనా దాడి చేసి... వాటిని ఎత్తుకుపోతారేమోనని స్వయంగా రాజకీయ పార్టీలే తమ ప్రతినిధులను కాపలాగా పెట్టుకుంటున్నాయి. ఇలాంటి సమయంలో... ఓ సంఘటన తీవ్ర కలకలం రేపింది. మే 23వ తేదీ తెరుచుకోవాల్సిన మచిలీపట్నంలోని కృష్ణా యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్‌ రూమ్‌ను శనివారం రాత్రి 10 గంటల సమయంలో తెరిచారు.

evm 14042019

అందులో నుంచి ఈవీఎంలను వాహనాల్లో తరలించారు. మచిలీపట్నం లోక్‌సభ స్థానంలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. వాటికి సంబంధించిన ఈవీఎంలను కృష్ణా వర్సిటీలో భద్రపరిచారు. పోలింగ్‌ ముగిసిన అనంతరం శుక్రవారం కలెక్టర్‌, రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో స్ట్రాంగ్‌రూమ్‌లకు సీలు వేశారు. వాటిని ఏ కారణంతో తెరవాలన్నా... ఎన్నికల సంఘం అనుమతితో కలెక్టర్‌తోపాటు రాజకీయ పార్టీల ఏజెంట్ల సమక్షంలోనే తెరవాల్సి ఉంటుంది. అయితే, శనివారం రాత్రి కలెక్టర్‌, పార్టీల ప్రతినిధులు లేకుండానే స్ట్రాంగ్‌రూమ్‌ సీలు తీసి, తలుపులు తెరిచి మూడు టాటా ఏస్‌ వాహనాల్లో ఈవీఎంలను తరలించారు.

evm 14042019

అసలే ఎన్నికల కమిషన్‌పై తీవ్ర విమర్శలు చెలరేగుతున్నాయి. ఇలాంటి సమయంలో స్ట్రాంగ్‌రూమ్‌ తెరిచి ఈవీఎంలను తరలించడం వివాదాస్పదంగా మారింది. దీనిపై కృష్ణా జిల్లా కలెక్టర్‌ ఇంతియాజ్‌ను సంప్రదించగా... ‘‘అవి నూజివీడు నియోజకవర్గానికి చెందిన రిజర్వు ఈవీఎంలు. ఆ నియోజకవర్గ రిటర్నింగ్‌ ఆఫీసర్‌, సబ్‌ కలెక్టర్‌ స్వపిన్‌ దినకర్‌ ఆధ్వర్యంలో వాటిని తరలించాం’’ అని తెలిపారు. 103 రిజర్వు ఈవీఎంలను ఇతర రాష్ట్రాల్లో వినియోగించుందుకు వీలుగా అక్కడి నుంచి తరలించామని, ఇందులో వివాదమేదీ లేదని సబ్‌ కలెక్టర్‌ కూడా తెలిపారు. అన్ని పార్టీల ప్రతినిధులకు సమాచారం ఇచ్చినప్పటికీ వారు ఎవరూ రాలేదని చెప్పారు.

 

Advertisements

Advertisements

Latest Articles

Most Read