ప్రతికూల పరిస్థితుల్లోనూ 2018-19లో అత్యధికంగా ఉపాధి హామీ పథకంలో రూ.9,216 కోట్లు ఖర్చు చేసి రాష్ట్రం దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. ఉపాధి కూలీలకు 24.64 కోట్ల పని దినాలను కల్పించింది. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ కార్యక్రమం (నరేగా) ప్రారంభించాక ఇంత భారీగా రాష్ట్రంలో నిధులు వెచ్చించడం ఇదే మొదటిసారి. నిధులు సకాలంలో విడుదల కాని కారణంగా నరేగా అమలులో 2018-19లో అనేక ఇబ్బందులు ఎదురైనా దానిని అధిగమించి రాష్ట్రం ఈ ఘనతను సాధించింది. కేంద్ర గ్రామీణాభివృద్ధిశాఖ రెండు విడతలుగా రాష్ట్రానికి 2018-19లో 24.70 కోట్ల పని దినాలను కల్పించింది. మార్చి నెలాఖరు నాటికి 24.64 కోట్ల పనిదినాలను రాష్ట్రం వినియోగించుకుంది.

ap first 14042019

2017-18తో పోల్చి చూస్తే అదనంగా సుమారు 3 కోట్ల పని దినాలను వాడుకుంది. పూర్తయిన పని దినాలపై సమాచారం వెళ్లిన 15 నుంచి 20 రోజుల్లోగా కేంద్ర గ్రామీణాభివృద్ధిశాఖ కూలీల బ్యాంకు ఖాతాలకు వేతనాలు జమ చేసేది. 2018-19లో అనుకోని పరిణామాలు ఎదురయ్యాయి. 45 రోజులైనా చెల్లింపులు చేయక వేతన బకాయిలు ఒకానొక దశలో రూ.400 కోట్లకుపైగా పేరుకుపోయాయి. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకుంది. తరువాత సర్దుబాటు చేస్తామంటే రాష్ట్ర ఖజానా నుంచి చెల్లింపులు జరుపుతామని కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. కేంద్రం ఇటీవల రూ.918 కోట్లు కేటాయించి పాత బకాయిలన్నీ చెల్లించడంతో ఎట్టకేలకు కథ సుఖాంతమైంది.

ap first 14042019

‘మెటీరియల్‌ కాంపోనెంట్‌’ కింద సమకూరిన నిధుల వ్యయంలో, సంపద సృష్టిలో, నీటి కుంటలు, వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మాణంలో రాష్ట్ర ప్రభుత్వం దేశంలోనే మొదటి స్థానంలో నిలవడం విశేషం. ఈ ఏడాది (2019-20) కూలీలకు 20 కోట్ల పని దినాల కల్పనే లక్ష్యంగా ఇటీవలే రాష్ట్రంలో నరేగా పనులు ప్రారంభమయ్యాయి. హాజరు ప్రస్తుతం మందకొడిగా ఉన్నా క్రమంగా పెరుగుతుందని అధికారులు భావిస్తున్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read