ఏపీ ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న పసుపు-కుంకుమ పథకం నిలిపివేయాలంటూ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. జనచేతన వేదిక అధ్యక్షుడు లక్ష్మణరెడ్డి ఈ మేరకు ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించగా, ఆయన దాఖలు చేసిన పిటిషన్ పై న్యాయస్థానం విచారణ ప్రారంభించింది. పసుపు-కుంకుమ పథకం అమలు విషయమై పూర్తి వివరాలు అందించాలంటూ హైకోర్టు ఎన్నికల సంఘాన్ని కోరింది. దీనిపై, టీడీపీ నేత రాజేంద్రప్రసాద్ తీవ్రంగా స్పందించారు. జగన్ బినామీ సంస్థ జనచేతన వేదిక ద్వారా పసుపు-కుంకుమ నిధులు అడ్డుకోవాలని పిటిషన్ వేశారని ఆరోపించారు. నిధులు రాకుండా అడ్డుకున్న వారిని ప్రజలు తరిమికొట్టాలని పిలుపునిచ్చారు.
ఇదిలా ఉంచితే, ఎన్నికల నేపథ్యంలో ఈసీ పసుపు-కుంకుమ పథకానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ పథకంలో భాగంగా తుది దశ చెక్కులను కూడా రాష్ట్ర ప్రభుత్వం బ్యాంకులో వేసినట్టు సమాచారం. బ్యాంకులకు వరుసగా సెలవులు ఉండడంతో డ్వాక్రా సంఘాలకు ఇవ్వాల్సిన నగదు మొత్తాన్ని ముందుగానే బ్యాంకులో జమ చేసినట్టు తెలుస్తోంది. అయితే జగన్, విజయసాయి మాత్రం, ఎలాగైనా మహిళలకు , రైతులకు డబ్బులు అందకుండా చూడాలని, తద్వారా వీరందరూ చంద్రబాబుని తిట్టాలని ప్లాన్ చేసారు. అందుకే ఈసీ చెప్పినా సరే , కోర్ట్ కు వెళ్లి, మహిళలు, రైతుల నోట్లో మట్టి కొట్టాలని ప్లాన్ చేసారు.
కాని వీరి ప్రయత్నాలు ఫలించలేదు. ఏపీలో పసుపు-కుంకుమ పథకానికి ఢిల్లీ హైకోర్టు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. పసుపు-కుంకుమ, అన్నదాత సుఖీభవ, పెన్షన్లు పంపిణీ చేయొచ్చని హైకోర్టు స్పష్టంచేసింది. పాత పథకాలే కావడంతో నగదు పంపిణీ నిలిపివేయాల్సిన అవసరంలేదని ఇప్పటికే కేంద్ర ఎన్నికల కమిషన్ వెల్లడించింది. కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశాలను ప్రభుత్వ తరుపు లాయర్ కోర్టులో అందజేశారు. పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు తోసిపుచ్చింది. అయితే ఎన్నో కుట్రలు చేసి, రాష్ట్రాన్ని నష్ట పరచాలని చూస్తున్న జగన్, ఎలక్షన్ నాలుగు రోజులు ముందు కూడా, ఇదే రకమైన కుట్రలు పన్నుతూ ఉండటంతో అందరూ ఆశ్చర్య పోతున్నారు. ప్రజల్లో వ్యతిరేకత వస్తుందని తెలిసినా, జగన్ ఇలా ఎందుకు చేస్తున్నారా అని అనుకుంటున్నారు.