జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. విజయనగరం జిల్లా అయోధ్య మైదానంలో స్టేజ్‌‌పై ప్రసంగిస్తుండగా పవన్ అభిమాని కాళ్లు పట్టుకోవడంతో ఆయన కిందపడిపోయారు. కాసేపు విరామం అనంతరం తిరిగి పవన్ ప్రసంగాన్ని ప్రారంభించారు. కాగా.. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన నాటి నుంచి పవన్ కల్యాణ్ రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో పర్యటించి అభ్యర్థులను గెలిపించాలని పవన్ అభ్యర్థిస్తున్న విషయం విదితమే. విజయనగరం నుంచి విజయవాడ వచ్చిన పవన్ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. భీమవరం సభ తర్వాత జనసేనాని అస్వస్థతకు గురయ్యారు. షుగర్ లెవల్స్ తగ్గడంతో పవన్ ఇబ్బంది పడినట్లుగా తెలుస్తోంది.

pk 0042019

విజయనగరం పర్యటన ముగించుకొని గుంటూరు జిల్లాలో ప్రచార సభలకు వెళ్లేందుకు హెలికాప్టర్‌లో విజయవాడకు చేరుకున్న పవన్‌ అస్వస్థతకు గురికావడంతో ఆయనను ఆస్పత్రికి తరలించారు. వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు కొంత విశ్రాంతి తీసుకోవాలని పవన్‌కు సూచించారు. గుంటూరు జిల్లా తెనాలి, సత్తెనపల్లిలో ఆయన రోడ్‌షో, బహిరంగ సభలకు నేతలు అన్ని ఏర్పాట్లూ చేసుకున్న నేపథ్యంలో శ్రేణులను నిరుత్సాహానికి గురిచేయకుండా సభావేదికకు బయల్దేరేందుకు సిద్ధమైన పవన్‌ను వైద్యులు వద్దని వారించినట్టు సమాచారం. దీంతో ఆ రెండు సభలను రద్దుచేసినట్టు పార్టీ నేతలు తెలిపారు. శనివారం నుంచి ఆయన ప్రచారానికి సిద్ధమవుతారని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. ఎన్నికల ప్రచార గడువు ఈ నెల 9తో ముగియనున్న నేపథ్యంలో పవన్‌ అస్వస్థతకు గురికావడం జనసేన పార్టీ శ్రేణుల్ని కొంత కలవరపాటుకు గురిచేస్తోంది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read