సాధారణ ఎన్నికల సమయంలో ఆంధ్రప్రదేశ్‌లో మరోసారి ఐటీ దాడులు కలకలం సృష్టిస్తున్నాయి... ఎంపీ గల్లా జయదేవ్‌ ఆడిటర్ గుర్రప్పనాయుడు ఇంట్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి సోదాలు చేస్తున్నారు. జయదేవ్‌ ఎన్నికల ఖర్చుల వివరాలను ఆడిటర్ గుర్రప్పనాయుడు ప్రతిరోజు రిటర్నింగ్ అధికారులకు సమాచారం ఇస్తున్నారు. గల్లా జయదేవ్‌‌కు చెందిన బ్యాంక్ అకౌంటెంట్‌ను ప్రశ్నిస్తున్నారు ఐటీ సిబ్బంది. అయినా సోదాలు నిర్వహించడం పై టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. కావాలనే తమ నేతలను టార్గెట్ చేస్తున్నారని మండిపడుతున్నారు. ఎన్నికల ఒక రోజు ముందు ఇలా చేసి, భయపెట్టాలని చూస్తున్నారని ఆరోపిస్తున్నారు.

galla 09042019

మరో పక్క ఈ రోజు ఉదయం, గుంటూరు జిల్లా గురజాల నియోజకవర్గంలో ఇవాళ ఐటీ అధికారులు దాడులు నిర్వహించారు. తెలుగుదేశం పార్టీకి చెందిన ఎంపీపీ కాంతారావు ఇంట్లో ఐటీ శాఖ అధికారులు సోదాలు నిర్వహించారు. అయితే, టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఓవైపు గురజాలలోనే ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న సమయంలో... మరోవైపు ఈ దాడులు జరగడం తీవ్రమైన చర్చకు దారితీశాయి. ఇప్పటికే ఉద్దేశ్యపూర్వకంగానే టీడీపీ నేతలను టార్గెట్ చేసి కేంద్రంలోని నరేండ్ర మోడీ, తెలంగాణ సీఎం కేసీఆర్, వైఎస్ జగన్ కుమ్మక్కై... కుట్రపూరితంగా దాడులు చేస్తున్నారని చంద్రబాబు ఆరోపించిన సంగతి తెలిసిందే.

galla 09042019

ఐటీ దాడుల పై ఏపి ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ స్పందించారు. ఎవరి ఆదేశాలతో సీఎం రమేశ్‌ ఇంట్లో పోలీసులు సోదాలు చేశారని ఆయన మండిపడ్డారు. సాధారణ తనిఖీలేనంటున్న పోలీసులు అదే జిల్లాలోని జగన్‌, అవినాశ్‌ రెడ్డి, మిథున్‌రెడ్డి ఇళ్లలో ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడారు. సాధారణ దాడులైతే అన్ని పార్టీల అభ్యర్థుల ఇళ్లపై చేయాలే గానీ ఒకే పక్షం అభ్యర్థులపై ఎందుకు నిర్వహిస్తున్నారని అని ప్రశ్నించారు. ఇటీవల ఉగ్రనరసింహరెడ్డి, బీద మస్తాన్‌రావు, పుట్టా సుధాకర్‌ యాదవ్‌ ఇళ్లపైనా దాడులు చేశారని.. వీటిని ఏ కోణంలో చూడాలని ప్రశ్నించారు. ఇందులో కచ్చితంగా కుట్ర కోణం దాగి ఉందని తేల్చి చెప్పారు. వైసీపీలోనూ నేరస్థులు చాలా మంది ఉండగా.. రకరకాల వ్యాపారాలు చేస్తున్న వారిపై ఐటీ దాడులు ఎందుకు జరపడం లేదని ధ్వజమెత్తారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read