జాతీయ స్థాయిలో బీజేపీ అనుకూల ఛానల్ గా రిపబ్లిక్ టీవీ ఉన్న సంగతి తెలిసిందే. అయితే వారు ఆంధ్రపదేశ్ పై చేసిన సర్వేలో మొన్నటి వరకు జగన్ మోహన్ రెడ్డికి అనుకూలంగా ఇస్తూ వచ్చారు. ఇప్పుడు ఏమైందో ఏమో కాని, నిన్న వదిలిన ఒక సర్వేలో మాత్రం, చంద్రాబాబుకు ఎక్కువ సీట్లు ఇచ్చి అందరినీ ఆశ్చర్యపరిచారు. మోడీకి అనుకూలంగా ఉండే జగన్ ను పక్కన పెట్టి మరీ చంద్రబాబుకు ఎక్కవ సీట్లు ఇచ్చారు.  ఏపీలో సైకిల్‌ జోరు కొనసాగనుందని రిపబ్లిక్‌ టీవీ- సీ ఓటర్‌ సర్వే అంచనా వేసింది.  నవ్యాంధ్రలో తెలుగుదేశం పరిస్థితి బాగుందని రిపబ్లిక్‌ టీవీ-సీ వోటర్‌ సర్వే వెల్లడించింది. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలోని 25 లోక్‌సభ స్థానాలకు గాను టీడీపీ 14 గెలుచుకుంటుందని అంచనా వేసింది.

republic 09042019

ప్రతిపక్ష వైసీపీ 11 సీట్లు దక్కించుకుంటుందని తెలిపింది. అయితే ఈ 11 స్థానాల్లో నాలుగు చోట్ల రెండు పార్టీల మధ్య చాలా స్వల్ప తేడా ఉందని.. ఈ నాలుగూ టీడీపీ ఖాతాలోనే పడే అవకాశముందని వెల్లడించింది. ఇదే చానల్‌-సర్వే సంస్థ గత జనవరి 24న విడుదల చేసిన సర్వేలో వైసీపీకి 19 ఎంపీ స్థానాలు వస్తాయని.. టీడీపీ ఆరింటికే పరిమితమవుతుందని పేర్కొంది. రెండున్నర నెలల్లో సీన్‌ రివర్స్‌ అయుంది. రాష్ట్రంలో టీడీపీకి పూర్తి అనుకూల వాతావరణం నెలకొందని తాజాగా తెలియజేసింది. టీడీపీకి 38.5% ఓట్లు లభిస్తాయని.. వైసీపీకి 36.5%  వరకు వస్తాయని అంచనా వేసింది. యూపీఏ, ఎన్డీఏ, ఇతరులకు సీట్లేమీ రావని.. కానీ వరుసగా 10.4%, 6.5%, 8.2% ఓట్లు పొందుతాయని విశ్లేషించింది. గత సర్వేలో వైసీపీ 41.3% ఓట్లు పొందుతుందని.. టీడీపీ 33.1% ఓట్లకే పరిమితమవుతుందని పేర్కొనడం గమనార్హం. జనసేన సహా ఇతరులకు 8.2 శాతం ఓట్లు వచ్చే అవకాశం ఉందని పేర్కొంది. ఇక  కాంగ్రెస్‌, బీజేపీకి ఒక్క సీటు కూడా దక్కదని సర్వే తెలిపింది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read