నర్సాపురం పార్లమెంట్ అభ్యర్థి కనుమూరి రఘురామకృష్ణం రాజు కారుపై జనసేన కార్యకర్తలు దాడి చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు మండలం కాళీపట్నం గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. సకాలంలో సెక్యూరిటీ సిబ్బంది స్పందించి జనసేన కార్యకర్తలను చెదరగొట్టడంతో రఘురామ కృష్ణంరాజుకు పెను ముప్పు తప్పింది. కానీ అప్పటికే కార్యకర్తలు రఘురాజు ప్రయాణిస్తున్న కారుతో పాటు మరో కారు అద్దాలు ధ్వంసం చేశారు. కాళీపట్నంలో జనసేన మీటింగ్ జరుగుతున్న సమయంలో రఘురాజు కాన్వాయ్ వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. గొడవ జరిగిందని తెలుసుకున్న వైకాళీపట్నం గ్రామానికి భారీగా వైసీపీ కార్యకర్తలు చేరుకున్నారు. దీంతో వైకాళీపట్నంలో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. రంగంలోకి దిగిన పోలీసులు ఇరువర్గీయులను చెదరగొట్టారు. కాగా ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

janasena 06042019 1

అయితే ఈ దాడి వెనుక, కులాలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు ఉన్నట్టు తెలుస్తుంది. మొన్నటికి మొన్న ఆయన ఓ సభలో తులూతూ మాట్లాడుతున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో నెటిజన్లు ఆయన మీద విమర్శలు గుప్పించారు. మద్యం తాగి ప్రచార సభకి వచ్చిన ఈయన నాయకుడా? అంటూ కొందరు.. వైసీపీ అధికారంలోకి వస్తే మద్యం నిషేదిస్తాం అంటున్నారు.. ముందు అభ్యర్థులు తాగి ప్రచారానికి రాకుండా చూసుకోండి అంటూ మరికొందరు విమర్శించారు. అయితే ఈ తలనొప్పి చాలదు అన్నట్లు రఘు రామ కృష్ణంరాజు కాపు కులం గురించి మాట్లాడి మరో తలనొప్పి తెచ్చుకున్నారు.

janasena 06042019 1

పవన్ కళ్యాణ్ అవినీతిపరుల తాట తీస్తా అంటూ పలుమార్లు చేసిన వ్యాఖ్యలను పరోక్షంగా ప్రస్తావిస్తూ రఘురామకృష్ణంరాజు కౌంటర్ వేయాలి అనుకున్నారు. కానీ అది కాస్త బెడిసి కొట్టింది. ఇంతకీ ఆయన ఏమన్నాడంటే.. 'మీరు కాపులు. కాపు కాసే వాడు కాపు. మీ పని మీరు చేసుకోండి. నార తీసే వృత్తి వేరు, తాట తీసే వృత్తి వేరు. వాళ్ళని వాళ్ళ పని చేసుకోనివ్వండి.' అని రఘురామ కృష్ణంరాజులు వ్యాఖ్యలు చేశారు. అయితే సోషల్ మీడియాలో రఘు రామ కృష్ణంరాజు వ్యాఖ్యల మీద తీవ్ర విమర్శలు వస్తున్నాయి. తాము మాత్రమే పరిపాలన చేయాలి అన్న అర్థం వచ్చేలా ఆయన మాట్లాడాడంటూ, ఇది ఆయన అహంకారానికి నిదర్శనం అంటూ వివిధ వర్గాల వారు ఆయన వ్యాఖ్యలను తప్పు పడుతున్నారు. మొత్తానికి నర్సాపురం వైసీపీ ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన రఘు రామ కృష్ణంరాజును వరుస వివాదాలు చుట్టుముడుతున్నాయి. మరి ఈ వివాదాలు ఆయన ఎన్నికల ఫలితంపై ఎలాంటి ప్రభావాన్ని చూపుతాయో చూడాలి.

Advertisements

Advertisements

Latest Articles

Most Read