టీడీపీ అభ్యర్ధులను లొంగదీసుకోవడానికి వైసీపీ ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్నీ ప్రయత్నాలు చేస్తోంది. అభ్యర్థులు లొంగకుంటే వారి బంధువులను, అనుచరులను వైసీపీ టార్గెట్ చేస్తోంది. ఇలాంటి పన్నాగాన్ని రచించిన వైసీపీ అడ్డంగా దొరికిపోయింది. వైసీపీ తీరును పలువురు తీవ్రంగా తప్పుబడుతున్నారు. గత ఎన్నికల్లో అనంతపురం జిల్లాలో టీడీపీ అత్యధిక స్థానాలను కైవసం చేసుకుంది. జిల్లాకు టీడీపీ ప్రభుత్వం అనేక ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు తెచ్చింది. కియో కార్ల పరిశ్రమతో పాటు, గోదావరి జలాలను జిల్లాకు తీసుకువచ్చి సస్యశామలం చేసింది. అయితే అభివృద్ధే ఎజెండాగా టీడీపీ ఎన్నికల్లో ప్రచారం చేస్తోంది. ఈ ఎన్నికల్లో తిరుగులేని శక్తిగా జిల్లాలో ఎదగాలని ఈ పార్టీ చూస్తోంది.

kalva 29032019

గత ఎన్నికల్లో భంగపడ్డ వైసీపీ ఈ సారి జిల్లాలో అత్యధిక స్ధానాలే లక్ష్యంగా పావులు కదుపుతోంది. అందులోభాగంగా రాయదుర్గంలో కాల్వ శ్రీనివాసులు ప్రచారంపై వైసీపీ రెక్కీ నిర్వహించింది. నిఘా పెట్టి రహస్యంగా ఫొటోలు, వీడియోలు సేకరిస్తున్న 21 మంది వైసీపీ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరంతా ఏలూరు, భీమవరానికి చెందినవారుగా పోలీసులు గుర్తించారు. వీరంతా కాల్వ శ్రీనివాసరావు ప్రచార బృందంలో కలిసిపోయి ఆయన కదలికలను వైసీపీ నేత కాపు రామచంద్రారెడ్డికి అందజేస్తున్నట్లు పేర్కొన్నారు. దీన్ని ముందే పసిగట్టిన టీడీపీ నేతలు ఆ గ్యాంగ్‌ను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ప్రస్తుతం భీమవరం బ్యాచ్‌‌ను పోలీసుల అదుపులోకి తీసుకున్నారు.

kalva 29032019

టీడీపీ కార్యక్రమాలపై భీమవరం బ్యాచ్‌ నిఘా వేసినట్లు పోలీసుల విచారణలో తేలినట్లు సమాచారం. కాల్వ శ్రీనివాసులు బంధువులను భీమవరం బ్యాచ్‌ బెదిరించినట్టు గుర్తించారు. వైసీపీకి అనుకూలంగా లొంగదీసుకునే ప్రయత్నం చేసినట్లు సమాచారం. భీమవరం బ్యాచ్‌కు రాయదుర్గం వైసీపీ అభ్యర్థి కాపు రామచంద్రారెడ్డితో బంధుత్వం ఉన్నట్లు సమాచారం. వైసీపీ అనుసరిస్తున్న తీరును పలువురు తప్పబడుతూ ఆ పార్టీ చర్యలను ప్రతిఒక్కరూ ఖండిస్తున్నారు. ఈ విషయమై పోలీస్ ఉన్నతాధికారి ఒకరు మాట్లాడుతూ..‘అనంతపురం జిల్లా రాయదుర్గం నుంచి పోటీ చేస్తున్న కాల్వ శ్రీనివాసరావు కదలికల్ని రహస్యంగా చిత్రీకరిస్తున్న కొండా శివనాగరాజు అనే యువకుడిని టీడీపీ కార్యకర్తలు నిన్న రాత్రి పట్టుకున్నారు. అతడిని విచారించడంతో తనతో పాటు ఇంకో 21 మంది ఉన్నారని నాగరాజు చెప్పాడు. దీంతో ఆ 21 మందిని టీడీపీ కార్యకర్తలు పోలీసులకు అప్పగించారు. విచారణలో వీరంతా కాల్వ శ్రీనివాసరావు ప్రచారం, కదలికల ఫొటోలు, వీడియోలను వైసీపీ రాయదుర్గం అభ్యర్థి కాపు రామచంద్రారెడ్డికి అందిస్తున్నట్లు తేలింది. వీరంతా కాపు రామచంద్రారెడ్డి వియ్యంకుడు శ్రీరామరెడ్డికి చెందిన కంపెనీలో పనిచేస్తున్నారు’ అని తెలిపారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read