ప్రధాని నరేంద్ర మోదీ సాధారణంగా సొంత డబ్బా కొట్టుకుంటారని ఏపీ ఐటీ మంత్రి నారా లోకేశ్ ఎద్దేవా చేశారు. కానీ ఎన్నికల సమయానికి అది ఇంకాస్త శ్రుతిమించుతుందని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఈరోజు ఉదయం ఏపీ గురించి మోదీ చేసిన ట్వీట్ అలాంటిదేనని వ్యాఖ్యానించారు. ఏపీకి జాతీయ స్థాయిలో 750 అవార్డులు ఎలా వచ్చాయో కేంద్ర మంత్రిత్వ శాఖలను అడిగితే చెబుతారని మోదీకి లోకేశ్ సూచించారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అందించిన సుపరిపాలన, అభివృద్ధి విధానాలను ఆయా కేంద్ర మంత్రిత్వ శాఖల అధికారులు మోదీకి వివరిస్తారని అన్నారు. ఒకవేళ ఈ విషయాన్ని అధికారులు చెప్పినా మోదీ ప్రజలకు చెప్పకుండా దాచేస్తారన్న విషయం తమకు తెలుసని వ్యాఖ్యానించారు.
ఈరోజు లోకేశ్ ట్విట్టర్ లో స్పందిస్తూ..‘నరేంద్ర మోదీగారు, మీరు మామూలుగానే సొంతడబ్బా కొట్టుకుంటారు. ఎన్నికల సమయంలో అది ఇంకాస్త శ్రుతిమించుతుందని అందరికీ తెలుసు. ఈరోజు ఉదయం ఏపీ గురించి మీరు చేసిన ట్వీట్ కూడా అలాంటిదే’ అని తెలిపారు. మరో ట్వీట్ లో స్పందిస్తూ..‘ఏపీకి జాతీయ స్థాయిలో 750 అవార్డులు ఎలా ఇచ్చారో మీ మంత్రిత్వ శాఖలను అడిగితే, చంద్రబాబుగారు అందించిన సుపరిపాలన, అనుసరించిన అభివృద్ధి విధానాలు మీకు పూర్తిగా వివరిస్తారు. మీకు తెలిసినా వాటిని ప్రజలకు చెప్పకుండా దాస్తారన్న విషయం మాకు తెలుసులెండి!’ అని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.