ఎన్నికల ప్రచారంలో భాగంగా గన్నవరం మండలం వీరపనేనిగూడెం గ్రామంలో పర్యటిస్తున్న ఎమ్మెల్యే వల్లభనేని వంశీ గాయానికి గురయ్యారు. పార్టీ కార్యకర్తలు, అభిమానుల ఉత్సాహం నడుమ ప్రచారరథం నుండి దిగి కాలినడక నడుస్తూ గ్రామంలో పర్యటిస్తుండగా ఆయన కుడికాలుకి గాయం అయ్యింది. దాంతో ఒక్కసారిగా పార్టీ శ్రేణులు ఆందోళనకు గురయ్యారు. గాయపడ్డ వంశీకి ప్రస్తుతం చిన్న‌అవుటపల్లిలోని పిన్నమనేని వైద్యశాలలో చికిత్స జరుగుతుండగా అభిమానులు, కార్యకర్తలు పెద్ద‌ఎత్తున అక్కడికి చేరుకున్నారు. అయితే గాయం మానాలి అంటే, ఒక నాలుగు రెస్ట్ తీసుకుని, దుమ్ము తగలకుండా చూడాలని డాక్టర్లు సలహా ఇచ్చారు.

vamsi 28032019 2

అయితే, ప్రచారానికి కొద్ది సమయమే ఉండటంతో, గాయంతోనే ప్రచారానికి వెళ్తానని వంశీ చెప్పారు. చెప్పినట్టు గానే, వంశీ ఈ రోజు గాయంతోనే ప్రచారానికి బయలుదేరారు. బాపులపాడు మండలం రేమల్లె గ్రామంలో ఈ రోజు వంశీ ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. గాయానికి ఒత్తిడి తగలకుండా జాగ్రత్తలు తీసుకుంటూ, వంశీ ప్రచారం చేస్తున్నారు. ప్రచారంలో, గ్రామాల్లో ఆపార్టీ శ్రేణులు, నాయకులు, కార్యకర్తలు ప్రచారంలో పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అభివృద్ధి పనుల్లో భాగంగా ప్రజల తరపున ప్రజావిరాళం ప్రభుత్వానికి తానే చెల్లించి అన్నీ గ్రామాల్లో సిమెంటు రోడ్లు వేయించానన్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read