హైదరాబాద్ లో కూర్చుని, చంద్రబాబు పై, ఏపి పై విషం చిమ్ముతున్న బ్యాచ్ కి, జగన్ మోహన్ రెడ్డి దగ్గరుండి, తన పార్టీలో చేర్చుకంటున్నారు. అంటే, మొన్నటి దాక వీళ్ళను దగ్గర ఉండి, ఒక ప్లాన్ ప్రకారం, ఈ విషం చిమ్మించింది, జగన్ మోహన్ రెడ్డే అనే విషయం ఇట్టే అర్ధమై పోతుంది. మొన్న మోహన్ బాబు, చంద్రబాబు పై ధర్నా అంటూ, అసంబద్ధంగా హడావిడి చేసి, ధర్నా చేసి, కుటుంబరావు చేతిలో లెఫ్ట్ అండ్ రైట్ వాయించుకున్న సంగతి తెలిసిందే. తరువాత రోజే జగన్ మోహన్ రెడ్డి దగ్గరకు వెళ్లి, లోటస్ పాండ్ లో, తన మెడలో గోల్డ్ మెడల్ లాగా, వైసీపీ కండువా కప్పుకున్నారు. అంటే మొన్న చేసిన ధర్నా, ఎవరి కోసం చేసారో, ఎందుకు చేసారో అర్ధమైపోతుంది.
అలాగే, పవన్ కళ్యాణ్, కేసీఆర్ పై విరుచుకుపడుతున్న తీరుతో, మరొక హైదరాబాదీ ఇబ్బంది పడుతూ ముందుకు వచ్చాడు. పవన్ కళ్యాణ్, కేసీఆర్ ఆంధ్రాకి చేసిన అవమానం గురించి మాట్లాడుతుంటే, చిన్ని కృష్ణ అంటే ఒక అవుట్ డేటెడ్ సినిమా రచియిత హడావిడి చేసిన సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ పై విమర్శల పేరుతో, ఏపి పై తన ద్వేషాన్ని చూపించాడు. ఏపి దిగువ రాష్ట్రం అని, ఎగువ రాష్ట్రం అయిన తెలంగాణా ముందు తలదించుకుని ఉండాలని అన్నారు. అంతే కాదు, ఏపి రాష్ట్రాన్ని ఒక బాత్ రూమ్ తో పోల్చి, ముందు అది కంపు కొట్టకుండా కడుక్కోండి అంటూ ఏపి ప్రజలని అవమానించాడు, చిన్ని కృష్ణా. దీంతో, అతని మేడలో కూడా గోల్డ్ మెడల్ వేసాడు జగన్..
పశ్చిమగోదావరిలోని పాలకొల్లులో నిర్వహించిన సభలో వైసీపీ అధినేత జగన్ ఈరోజు పాల్గొన్నారు. చంద్రబాబు ఇచ్చే రూ.3 వేలకు మోసపోవద్దనీ, రాజన్న రాజ్యం తెచ్చుకుందామని ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. పిల్లలందరినీ ఎంత ఖర్చయినా ఉచితంగా చదివిస్తామని జగన్ ప్రకటించారు. ఎన్నికల వేళ చంద్రబాబు ఎంతకైనా తెగిస్తారనీ, జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఈ సందర్భంగా సినీ రచయిత చిన్ని కృష్ణ వైసీపీలో చేరారు. ఆయనకు జగన్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. దీంతో భావోద్వేగానికి లోనైన చిన్ని కృష్ణ కన్నీరు పెట్టుకున్నారు. చిన్ని కృష్ణతో పాటు ప్రముఖ ఎస్సీ నేత, మాజీ ఎమ్మెల్యే టీవీ రామారావు, దళిత నేత గురుప్రసాద్ కూడా వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. వీరందరినీ జగన్ వైసీపీలోకి సాదరంగా ఆహ్వానించారు.