చిత్తూరు జిల్లాలోని పుంగనూరులో దారుణ ఘటన చోటుచేసుకుంది. తాగునీరు విషయంలో వైసీపీ కార్యకర్తలు దారుణంగా ప్రవర్తించారు. ఇవి వైసీపీ నీళ్లు.. టీడీపీ వాళ్లు పట్టుకోవద్దంటూ వైసీపీ కార్యకర్తలు విద్యార్థిని కొట్టి ఈడ్చుకెళ్లారు. విద్యార్థిని తలపై కొడవలితో నరికారు. అడ్డుకోబోయిన తల్లిదండ్రులపైన కూడా కర్రలతో దాడి చేశారు. అంతేకాక ఇంటి గోడలు కూలగొట్టి వైసీపీ కార్యకర్తలు బీభత్సం సృష్టించారు. తమ సభకు రాలేదని నీళ్ల వంకతో వైసీపీ దౌర్జన్యం చేసిందని బాధితులు ఆరోపిస్తున్నారు. ‘ఇవి వైసీపీ నీళ్లు. టీడీపీ వాళ్లు ఇక్కడ బిందె పట్టడం కుదరదు’ అంటూ ఆ నేతలు వీరంగం సృష్టించారు. ట్యాంకరు నుంచి నీళ్లు పట్టబోయిన ఆమెపై దాష్టీకం ప్రదర్శించారు. అయితే, ఆమె విద్యాధికురాలు. ఏంబీఏ చదువుతోంది. దీంతో ‘ఇవి పంచాయతీ నీళ్లు. అందరివీ..’ అంటూ గట్టిగా వారిని ఎదుర్కొంది. తమకు ఎదురు చెప్పిన ఆమెపై వారు మరింత రెచ్చిపోయారు. ఆమె తలపై కొడవలితో నరికారు. అడ్డొచ్చిన తల్లిదండ్రులపైనా విరుచుకుపడ్డారు.

ycp 08042019

ఎద్దడి వేళ సైతం ఎన్నికల అరాచకాలకు తెగబడుతున్న వైనానికి పరాకాష్ఠగా నిలిచిన ఈ ఘటన చిత్తూరు జిల్లా పుంగనూరు మండలం చండ్రమాకులపల్లె పంచాయతీ కృష్ణాపురంలో ఆదివారం భయోత్పాతం సృష్టించింది. గ్రామంలో వైసీపీ నేతలు ఏర్పాటుచేసిన ఎన్నికల విందుకు తాము వెళ్లలేదన్న కక్ష కడుపులో పెట్టుకొని, తమ కుటుంబంపై కావాలనే దాడి చేశారని బాధితులు ఫిర్యాదు చేశారు. బాధితుల కథనం ప్రకారం, వేసవి ఎద్దడి కారణంగా కృష్ణాపురం గ్రామం ఎద్దడితో కటకటలాడుతోంది. ఈ నేపథ్యంలో ఆదివారం పంచాయతీ అధికారులు, గ్రామానికి నీళ్ల ట్యాంకరు పంపించారు. ఈ గ్రామానికి చెందిన ఎం.హరి, కన్యాకుమారిల కుమార్తె కుమార్తె భాగ్యలక్ష్మి (22) బిందె తీసుకొని ట్యాంకరు వద్దకు చేరుకొంది. బిందెకు నీరు పడుతుండగా, అదే గ్రామానికి చెందిన వైసీపీ నేతలు రాజేంద్ర, మహేశ్‌, రాజాబాబు, సుబ్రహ్మణ్యం ఆమెను అడ్డుకున్నారు.

ycp 08042019

‘‘ఇవి వైసీపీ నీళ్లు. టీడీపీ వాళ్లు బిందె పట్టడం కుదరదు’’ అంటూ ఆమెను పక్కకు నెట్టారు. ‘‘ఎవరివైతేనేం...పంచాయతీ అధికారులు సరఫరా చేస్తుంటే బిందెకు పడుతున్నాను’’ అని ఆమె బదులిచ్చింది. దీంతో ఆ నేతలు ఆగ్రహావేశాలకు గురయ్యారు. భాగ్యలక్ష్మిని కిందపడేసి చాలాదూరం ఈడ్చుకెళ్లారు. ఆమెను కొట్టుకొంటూ ఇంటిదాకా తీసుకొచ్చారు. అక్కడ భాగ్యలక్ష్మి తలపై కొడవలితో నరికారు. అక్కడే ఉన్న తల్లిదండ్రులను కర్రలతో చితగ్గొట్టారు. వారి ఇంటిపై దాడిచేసి, బీభత్సం సృష్టించారు. ఈ దాడిలో బాధితుల ప్రహరీ గోడ దెబ్బతింది. స్థానికులు జోక్యం చేసుకొని.. క్షతగాత్రులను 108 అంబులెన్స్‌లో మదనపల్లె వైద్యశాలకు తరలించారు. మదనపల్లె ఆస్పత్రి ఔట్‌పోస్టు పోలీసులు ఇచ్చిన సమాచారం మేరకు, ఈ ఘటనపై పుంగనూరు పోలీసు స్టేషన్‌లో కేసు నమోదయింది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read