గురజాల వైసీపీ అభ్యర్థి కాసు మహేష్‌రెడ్డి అత్యంత సంకట పరిస్థితి ఎదుర్కొంటున్నారు. ప్రతిదానికి డ బ్బులు లేవని నాయకులు, కార్యకర్తల ము ఖంమీదే చెప్పేస్తుండటంతో ఆపార్టీ నేతలు తలలు పట్టుకుంటున్నారు. చివరకు ప్రచా రంలో పాల్గొనే యువకులకు కూడా రోజువారీ ఖర్చులకు ఇవ్వకపోతుండటంతో వారి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. పార్టీ అ ధికారంలోకి వస్తుందన్న ఆశతో, గురజాలలో గెలవాలన్న తాపత్రయంతో మొదట్లో ముందు వెనుక చూడకుండా ఖర్చుచేసిన నాయకులు కూడా అభ్యర్థి పరిస్థితి చూసి ఆశ్చర్యపోతున్నారు. పిడుగురాళ్ల పట్టణానికి చెందిన ఇరువురు నేతలు తర్వాత ఇస్తారులే అన్న భరోసాతో ఖర్చుచేసిన సొమ్ము కూడా తిరిగి వచ్చే పరిస్థితి కనపడకపోవటంతో కొద్దిరోజులుగా అంటీముట్టనట్లుగా ఉంటున్నారు.
మొన్న పిడుగురాళ్ల వచ్చిన ఆ పార్టీ అధి నేత జగన్ కూడా అసహనం వ్యక్తం చేసిన ట్లు చెప్పుకుంటున్నారు. నమ్మి సీటు ఇస్తే డబ్బులు లేవని చేతులెత్తేయటం ఏమిటని ప్రశ్నించినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా ఆ పార్టీ వ్యూహకర్త పీకే ఇచ్చిన సర్వేపైనా కాసుకు జగన్ క్లాస్ తీసుకున్నట్టు ప్రచారం సాగుతోంది. వైసీపీ అభ్యర్థుల గెలుపు ఓటములపై ఆ పార్టీ తాజాగా సర్వే చేయించింది.ఈ సర్వేలో గురజాల వైసీపీ అభ్యర్థి, టీడీపీ అభ్యర్థిమధ్య సుమారు 15వేల ఓట్ల గ్యాప్ ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈవిషయంపై జగన్ తీవ్రంగా మండిపడ్డట్లు చెబుతున్నారు.ఎన్నిక సమీపించే కొద్ది గ్యాప్ తగ్గాల్సిందిపోయి పెరగటం ఏమిటని నిలదీసినట్లు తెలుస్తుంది.
అధినేత పిడుగురాళ్ల పర్యటన అంతా అసహనంతోనే సాగినట్లు చెబుతున్నారు.ఈ పరిణామాల తర్వాత మహేష్‌రెడ్డి మరింత ఫ్రస్ట్రేషన్‌కు లోనై.. ఆప్రభావం నాయకులపై చూపుతున్నారని ప్రచారం జరుగుతున్నది. ఇదిలాఉంటే ఆ పార్టీలో ముదిరిపాకాన పడ్డ గ్రూపుల వ్యవహారాలు కూడా మహేష్‌కు తలనొప్పిగా మారాయి. ఒకరు దగ్గరకు వస్తే మరొకరు దూరమయ్యే పరిస్థితి ఉండటం ఆయనను చికాకు గురిచేస్తుంది. ఈ పరిస్థితుల నేపథ్యంలోనే తెరవెనుక మం త్రాంగం సాగించేందుకు ఆయన తండ్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కాసు కృష్ణారెడ్డి కూడా రంగంలోకి దిగారని చెబుతున్నారు. కొంతమంది ఉపాధ్యాయ సంఘాల నాయకులకు కాసు కృష్ణారెడ్డి ఫోన్ చేయటం చర్చనీయాంశమయింది.
ఒకప్రక్క మహేష్‌రెడ్డి ఖర్చులకు కూడా డబ్బులు ఇవ్వకపోవటంతో దయనీయంగా మారిన వైసీపీ పరిస్థితి గ్రూపులతో మరింత దారుణంగా దిగజారుతోంది.