ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం కృష్ణా జిల్లా తిరువూరు, పామర్రు, పెడన, మచిలీపట్టణంలలో మాట్లాడిన చంద్రబాబు ఖమ్మం జిల్లాలోని పవిత్ర పుణ్యక్షేత్రం భద్రాచలంపై కీలక వ్యాఖ్యలు చేశారు. పోలవరం ప్రాజెక్టుకు తాము అడ్డంకి కాదన్న కేసీఆర్.. ప్రాజెక్టు కారణంగా భద్రాచలం మునిగిపోతుందని అంటున్నారని చంద్రబాబు ఆరోపించారు. భద్రాచలాన్ని, రాముడిని ఎలా కాపాడుకోవాలో తమకు తెలుసని అన్నారు. ఒకప్పుడు భద్రాచలం ఏపీలోనే ఉండేదని ఈ సందర్భంగా చంద్రబాబు గుర్తుచేశారు. భద్రాచలాన్ని తమకిస్తే భద్రంగా చూసుకుంటామన్నారు. సాగర్, శ్రీశైలంలను నియంత్రణలో ఉంచుకున్న మీకు పోలవరంలో వాటా కావాలా? అని నిప్పులు చెరిగారు. కేసీఆర్ పెత్తందారీ పాలన తమ వద్ద సాగదని చంద్రబాబు తేల్చి చెప్పారు. కేసీఆర్, జగన్‌లు ముసుగు తీసేశారని అన్నారు. కేసీఆర్ వేసే బిస్కెట్లకు జగన్ తోక ఊపుతున్నారని అన్నారు. జగన్ తమ మిత్రుడే అన్న కేసీఆర్ వ్యాఖ్యలపై చంద్రబాబు మాట్లాడుతూ.. పొగ పెట్టానని, కలుగులోంచి ఎలుక బయటకు వచ్చిందని, ముసుగు తీసేసాడని అన్నారు.

yeluka 09042019

ప్రత్యేక హోదాకు మద్దతు పేరిట కేసీఆర్‌ డ్రామాలాడుతున్నారని చంద్రబాబు ధ్వజమెత్తారు. ఇప్పుడు మద్దతు ఇస్తామంటున్న కేసీఆర్‌... ఇదే హోదా కోసం కేంద్రంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టినప్పుడు ఎందుకు కలిసి రాలేదని ప్రశ్నించారు. సోమవారం ఆయన కృష్ణా జిల్లా తిరువూరు, పామర్రు, పెడన, మచిలీపట్నంలలో జరిగిన ఎన్నికల ప్రచార సభల్లో ప్రసంగించారు. తిరువూరు, పామర్రు సభల్లో మాజీ ప్రధాని దేవెగౌడ కూడా పాల్గొన్నారు. ‘ఏపీకి ప్రత్యేక హోదాకు మా మద్దతు! పోలవరానికి మేం అడ్డంకి కాదు’ అని కేసీఆర్‌ చేసిన తాజా ప్రకటనపై చంద్రబాబు స్పందించారు. ‘కేసీఆర్‌తో కలిసి హోదా సాధిస్తామంటున్న జగన్‌... మంగళవారం సాయంత్రంలోగా తమ ఫెడరల్‌ ఫ్రంట్‌ తరఫున కేంద్రానికి కేసీఆర్‌తో లేఖ రాయించాలి.

yeluka 09042019

పోలవరానికి అడ్డుపడటం లేదంటున్న కేసీఆర్‌.. ఈ ప్రాజెక్టుపై సుప్రీంకోర్టులో వేసిన కేసులు వాపస్‌ తీసుకోవాలి. ఏపీకి హోదా ఇస్తే తెలంగాణలో పరిశ్రమలు పోతాయని, తమకూ కావాలని కేసీఆర్‌ చెప్పలేదా? ప్రత్యేక హోదా ఇస్తామన్న సోనియాను విమర్శించలేదా? కేసీఆర్‌ ఎప్పుడూ నిజం చెప్పరు! జీవితమంతా అబద్ధాలే. ఆంధ్రావాళ్లు ద్రోహులని తిట్టలేదా? దద్దమ్మలని దూషించలేదా? కోడికత్తిపార్టీకి డబ్బులు ఇచ్చి డ్రామా ఆడిస్తే నమ్మడానికి జనం పిచ్చోళ్లు కాదు. జగన్‌కు వెయ్యి కోట్లు ఇచ్చి.. రాష్ట్రానికి రావాల్సిన లక్షకోట్లు ఎగ్గొట్టే ప్రయత్నంలో ఉ న్నట్లు ప్రజలకు తెలుసు. హైదరాబాద్‌ అభివృద్ధిలో భాగస్వాములైన ఆంధ్రులకు.. నిబంధనల ప్రకారం రావాల్సిన 58ు వాటాపై పోరాటం సాగిస్తా’ అని చంద్రబాబు ప్రకటించారు. పోలవరం గ్రాఫిక్స్‌ అని మాట్లాడిన కేసీఆర్‌లు ఇప్పుడు ముంపు గురించి మాట్లాడటం హాస్యాస్పదమన్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read