ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని పదే పదే ప్రకటిస్తున్న కాంగ్రెస్ పార్టీ... ఈ అంశాన్ని తమ ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపర్చింది. 2014, ఫిబ్రవరి 20న నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ రాజ్యసభలో ప్రకటించిన విధంగా ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని కాంగ్రెస్ పార్టీ తమ మేనిఫెస్టోలో పేర్కొంది. ఏపీతో పాటు ఈశాన్య రాష్ట్రాలకు కూడా ప్రత్యేక హోదాను పునరుద్ధరిస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్‌కు గత ఎన్నికలకు ముందు ప్రత్యేక హోదా ఇస్తామని ప్రకటించిన బీజేపీ... ఆ తరువాత అందుకు నో చెప్పింది. అయితే తాము అధికారంలోకి వస్తే ఏపీకి కచ్చితంగా ప్రత్యేక హోదా ఇస్తామని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అనేక వేదికలపై ప్రకటించారు.

rahulmanifesto 0202019

తాజాగా కాంగ్రెస్ పార్టీ ఈ అంశాన్ని మేనిఫెస్టోలో పొందుపర్చడంతో... ఏపీ ప్రజల్లో ఆ పార్టీ పట్ల సానుకూలతలు వ్యక్తమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏపీకి కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక హోదా ఇస్తామని స్పష్టం చేయడంతో... జాతీయ స్థాయిలో ఆ పార్టీతో కలిసి పని చేసేందుకు టీడీపీ అంగీకరించింది. ఏపీలో కాంగ్రెస్ పార్టీతో పొత్తు లేకపోయినప్పటికీ... జాతీయ స్థాయిలో మాత్రం కాంగ్రెస్‌కు టీడీపీ మద్దతు ఇచ్చే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతోంది. రాష్ట్రంలో ఏ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉందనే అంశంతో సంబంధం లేకుండా కేంద్రంతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని రాహుల్ గాంధీ ప్రకటించిన సంగతి తెలిసిందే.

rahulmanifesto 0202019

కాంగ్రెస్‌ మేనిఫెస్టోలో ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇస్తామని హామీ ఇవ్వడంపై కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ స్పందించారు. మంగళవారం దిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చామని, ఆ ప్యాకేజీ ఇప్పుడు అమలులో ఉందని చెప్పరి. ఆమోదించిన ప్యాకేజీ కింద ఆంధ్రప్రదేశ్‌కు ఆ నిధులు వస్తాయని స్పష్టంచేశారు. ఇప్పటికే తమ రాష్ట్రానికి సైతం ప్రత్యేక హోదా కావాలంటూ ఒడిశా సహా అనేక రాష్ట్రాలు డిమాండ్‌ చేస్తున్నాయన్నారు. హోదా కింద ఇచ్చే డబ్బును కాంగ్రెస్‌ ఎక్కడినుంచి తెస్తుందని ప్రశ్నించారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read