రెండు సంవత్సరాల క్రితం, మన ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత జగన్ మోహన్ రెడ్డి పాల్గున్న చివరి అసెంబ్లీ సమావేశాల్లో ఏమి చెప్పారో గుర్తుందా ? మేము అసెంబ్లీలో అగ్లీ సీన్స్ రిపీట్ చేస్తాం అని. అప్పటి నుంచి అసెంబ్లీకి రావటం అయితే మానేశారు కాని, అప్పటి నుంచి మాత్రం అగ్లీ సీన్స్ చూపిస్తూనే ఉన్నారు. ఎన్నికలు దగ్గర పడే కొద్దీ, ఈ అగ్లీ సీన్స్ రోజు రోజుకీ ఎక్కువ అవుతున్నాయి. ‘యథా నేతా... తథా పార్టీ’ అన్నట్లు నోటి దురుసులో వైసీపీ నేతలకు తమ నాయకుడు జగనే ఆదర్శంగా నిలుస్తున్నారు. ‘వయసుకైనా గౌరవం ఇవ్వాలి’ అనేది మన సంప్రదాయం. కానీ, తన తండ్రి వయసున్న ముఖ్యమంత్రి చంద్రబాబుపై జగన్‌ ఎన్నో సందర్భాల్లో కఠినమైన వ్యాఖ్యలు చేశారు. ‘‘చంద్రబాబును నడిరోడ్డుపై తుపాకీతో కాల్చినా తప్పులేదు’’ అంటూ నంద్యాల ఉప ఎన్నికల సమయంలో జగన్‌ ఊగిపోయారు. ‘కాల్చి చంపాలి’ అని సాధారణ పౌరుడిని ఉద్దేశించి వ్యాఖ్యానించినా నేరమే. కానీ, ఏకంగా రాష్ట్ర పాలనా సారథిని ఉద్దేశించే జగన్‌ ఇలా మాట్లాడారు. ఇదే ఎన్నిక సందర్భంగా ‘ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును గుడ్డలూడదీసి కొట్టాలి’ అని కూడా జగన్‌ దూషించారు. నిజానికి, ఈ వ్యాఖ్యలు వైసీపీకి రాజకీయంగా నష్టం చేశాయి. ‘తండ్రి వయసున్న చంద్రబాబును పట్టుకుని ఇలా తిట్టడమేమిటి’ అని సామాన్య జనం విమర్శించారు. అయినా... వైసీపీ తన వైఖరిని మార్చుకోలేదు.

వైసీపీ జిల్లా, నియోజకవర్గ స్థాయి నేతలూ తరచూ నోరు పారేసుకుంటూ సోషల్‌ మీడియాకు చిక్కుతున్నారు. కృష్ణా జిల్లా గుడివాడ అభివృద్ధిపై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ వైసీపీ అభ్యర్థి కొడాలి నాని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘‘ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యే నియోజకవర్గంలో అభివృద్ధి చేయవా? ఏం చంద్రబాబు నాయుడు అమ్మ మొగుడి సొమ్ము గుడివాడకు తెస్తున్నాడా? నేను గుడివాడ వాడిని కాదంటున్నారు. చంద్రబాబు ఎక్కడివాడు? నీ పెళ్లాం ఎక్కడ ఉంటుంది? నీ కోడలు ఎక్కడుంటుంది?’’ అంటూ పరుషంగా మాట్లాడారు. ఏదైనా లక్ష్యాన్ని ఎంచుకుని, దానిని సాధించేందుకు ‘చావో రేవో’ అన్నట్లుగా ప్రయత్నించడం మామూలే. కానీ... వైసీపీ నెల్లూరు పట్టణ ఎమ్మెల్యే, ప్రస్తుత అభ్యర్థి అనిల్‌ కుమార్‌ యాదవ్‌ అంతకుమించిన మార్గం ఎంచుకున్నారు. ‘‘మనముం దు ఉన్నది ఒక్కటే! జగనన్న కోసం చంపడమా.. చావడమా! 2019లో రాష్ట్రంలో ఒక్క వైసీపీ జెండా మాత్రమే ఎగరాలి. ఒక్క కనుసైగ జగన్మోహన రెడ్డి చేసిననాడు ఎవ్వరూ మిగల రు’’ అని హెచ్చరించారు.

అసెంబ్లీలో విపక్ష నేతలు ఆందోళనకు దిగడం సహజమే. అయితే... వైసీపీ సభ్యులు పోడియంను చుట్టుముట్టి కేకలు, నోటితో ఊలలు వేస్తూ గందరగోళం సృష్టించారు. నగరి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ఆందోళన నిర్వహించేందుకు పోలీసులు అనుమతించకపోవడంతో వైసీపీ ఎమ్మెల్యే రోజా ‘ఆ సీఐ ....కొడుకు’’ అని ఇన్‌స్పెక్టర్‌ను తిట్టిపోశారు. తాజాగా వైసీపీ సీనియర్‌ నేత ధర్మాన ప్రసాదరావు... ‘‘పోలీసులు తెలుగుదేశం పార్టీకి కొమ్ము కాస్తున్నారు. అందరి సమాచారం తీసుకున్నాం. అధికారంలోకి వస్తున్నాం. లెక్క తేలుస్తాం’’ అని హెచ్చరించారు. ఓటు ఎవరికి వేయాలన్నది పౌరుల వ్యక్తిగత ఇష్టం. అది... రాజ్యాంగం కల్పించిన హక్కు. కానీ... ‘మాకు ఓటేయకపోతే’ అని బెదిరించి ఇళ్లు ఖాళీ చేయించడం, దా డులు చేయడం వంటి ఘటనలు ఇప్పుడే చోటు చేసుకుంటున్నాయి. విశాఖలోని గాజువాక నియోజకవర్గంలో ‘మేం జనసేనకే ఓటు వేస్తాం’ అని చెప్పిన నేరానికి స్టీల్‌ప్లాంట్‌ లో కాంట్రాక్టు ఉద్యోగం చేస్తున్న వ్యక్తిపైన, ఆయన భార్యపైనా దాడి చేశారు. గర్భిణీ అని కూడా చూడకుండా ఆమె ను కిందికి తోసేశారు. ఇక... సీఎం చంద్రబాబు ప్రాతిని ధ్యం వహిస్తున్న కుప్పంలోనూ ఇలాంటి ఘటనే జరిగింది. వైసీపీకి జైకొట్టకుండా టీడీపీ ప్రచారంలో పాల్గొన్నందుకు వసంతమ్మ అనే మహిళ చేత ఇల్లు ఖాళీ చేయించారు. గుంటూరులో ‘మేం తెలుగుదేశానికే ఓటు వేస్తాం’ అని చెప్పిన వృద్ధ దంపతులను అర్ధరాత్రి అని కూడా చూడకుండా ఇల్లు ఖాళీ చేయించారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read